జ్యోతిష్య పాఠాలు - 5 - అచ్చంగా తెలుగు

జ్యోతిష్య పాఠాలు - 5

Share This

 జ్యోతిష్య పాఠాలు - 5

పి.ఎస్.వి.రవి కుమార్ 


ఇన్ని రోజుల పాఠాలలో  మనం గ్రహలు వాటి కారకత్వాలు, గుణ గణాలు తెలుసుకున్నాము. ఈ రోజు జాతక చక్రం వాటి వివరాలు నేర్చుకుందాము.

ఒక వ్యక్తి జాతక పరిశీలన కు ముఖ్యం గా జాతక చక్ర పరిశీలన, మరియు గోచార పరిశీలన చేయాలి.

జాతక చక్రం:

జ్యోతిష్యం చెప్పడానికి ముందుగా జాతక చక్రం వేసుకోవాలి. దాని కోసం ఆన్లైన్ లో ఎన్నో ఫ్రీ సాఫ్ట్వేర్స్ (Free softwares) అందుబాటులో ఉన్నాయి. పుట్టిన తేది, నెల, సంవత్సరం పుట్టిన సమయం, పుట్టిన ఊరు వివరాలు సాఫ్ట్వేర్ లో నమోదు చేయగానే జాతక చక్రం వస్తుంది.

ఒక ఉదాహరణ జాతక చక్రం :

జాతక చక్రం  లో చాలా వరకు గ్రహాల మొదటి అక్షరం తో గ్రహాల పేర్లను సూచింపబడుతుంది.

ఇక్కడ  తెలిపిన ఉదాహరణ చక్రం లో


ల అనగా లగ్నం అని (లగ్నం ను ఆంగ్లం లో AS అనే అక్షరాలతో సూచిస్తారు)

ర అనగా రవి

రా అనగా రాహు

శ అనగా శని

చం అనగా చంద్రుడు

బు అనగా బుధుడు

ఏదైన జాతక చక్రం లో చంద్రుడు ఏ రాశి లో ఉంటాడో అది ఆ వ్యక్తి కి జన్మ రాశి అగును. పైన తెలిపిన ఉదాహరణ లో చంద్రుడు కన్యా రాశి లో ఉన్నాడు. అనగా ఈ వ్యక్తి యొక్క రాశి కన్యా రాశి. 

అలాగే ఏ రాశి లో ల లేదా లగ్నం అని ఉంటుందో అదే ఆ వ్యక్తి యొక్క జన్మ లగ్నం. పైన తెలిపిన ఉదాహరణ లో 

ల అనేది దనస్సు రాశి లో ఉంది అనగా ఈ వ్యక్తి యొక్క లగ్నం దనుర్లగ్నం.

గోచారం:

ఇంతకముందు పాఠాలలో చెప్పుకున్నట్లుగా ప్రతీ సంవత్సరం గురు గ్రహం రాశి మారుతుంది.

అలాగే శని 2 సంవత్సారల 6 నెలల తర్వాత రాశి మారుతుంది.  

రాహు, కేతువులు 18 నెలల కాలం తర్వాత రాశి మార్పు చెందుతుంది.

ఒక వ్యక్తి జన్మ రాశి నుండి, ప్రస్తుత కాల చక్రం లో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలిపేది గోచారం.

ఉదాహరణ కు జనవరి 2021 నెల  చక్రం చూద్దాం. 

జనవరి 2021 నెల  ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ తెలుస్తుంది.

ఇపుడు పైన తెలిపిన జన్మ జాతక చక్రం తీసుకుంటే ఆ వ్యక్తిది కన్యా రాశి.

గోచారం చూడాలి అంటే ఆ వ్యక్తి యొక్క జన్మ రాశి నుండి, గురు గ్రహం ఎక్కడ ఉండో చూడాలి.

జనవరి 2021 చక్రంలో గురు గ్రహం మకర రాశి లో ఉన్నాడు. అంటే కన్యా రాశి నుండి 5 రాశుల దూరం లో ఉన్నాడు. అనగా గోచారం లో ఆ వ్యక్తి కి గురు గ్రహం 5 వ క్షేత్రం లో లేదా 5వ ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకోవాలి.

అలాగే శని గ్రహం కూడా చూడాలి ఆ గ్రహం కూడా మకర రా శి లో ఉంది. అనగా శని కూడా కన్యా రాశి వారికి 2021 లో 5 వ ఇంట్లో లేదా 5 వ క్షేత్రం లో ఉంది అని తెలుసు కోవాలి.

అదే విధం గా కన్యా రాశి వారికి రాహువు 9 వ ఇంట్లో, కేతువు 3 వ ఇంట్లో ఉన్నట్టు తెలుసుకోవచ్చు.

గోచారం లో గురు, శని, రాహు, కేతు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవే  ఒక రాశి నుండి ఇంకొక రాశి కి గమనం చెందటానికి ఎక్కువకాలం తీసుకునే గ్రహాలు. వ్యక్తి జన్మ రాశి నుండి ఎన్నో రాశి లో ఉందో తెలుసుకుని ఆ ఫలితాలని తెలపాలి. గోచారం ప్రకారం  జన్మ రాశి లో నుండి ఏ రాశి లో ఏ గ్రహాలు ఉంటే ఏ ఫలితాలు వస్తాయో మున్ముందు పాఠాలలో తెలుసుకుందాం. 

ఒక వ్యక్తి కి జాతక చక్రం లో వచ్చే ఫలితాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తే, గోచారం లో చూపించే ఫలితాలు కొంత మాత్రం గా మాత్రమే ఉంటాయి.

వ్యక్తి యొక్క జాతకం లో లో దశ బాగుండి గోచారం బాగాలేకపోయినా అంతగా చెడు ప్రభావం ఉండదు. అదే దశ బాగాలేక, గోచారం కూడా బాగాలేక పోతే ఆ జాతకుడికి ఇబ్బందులు ఎదురవుతాయి.

భావాలు విభజన

జాతక చక్రం లో మొత్తం 12 భావాలు ఉంటాయి.

ఇప్పుడు ఒక  ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం.

ఏదైతే లగ్నం అని ఉంటుందో అదే మొదటి భావము.

ఇక్కడ తెలిపిన జాతక చక్రం లో లగ్నం ధనస్సు, అంటే ఈ జాతకునికి మొదటి భావం, ధనస్సు.

భావాలు:

లగ్నం - దీనినే తనుభావం అంటారు. ఈ భావం లో ఆ వ్యక్తి యొక్క  శరీర తీరు, రంగు, శారీరక దారుడ్యం, శారీరక లక్షణాలు, ఆరోగ్యం, కీర్తి, గుణం వంటి విషయములు తెలుపును. లగ్నం ఏ రాశి లో ఉందో ఆ రాశ్యాది పతి లగ్నాది పతి అగును.  మనం తీసుకున్న ఉదాహరణ లో గురుడు లగ్నాదిపతి.


ద్వితీయ భావం: దీనినే ధనభావం, కుటుంబ స్టానం అని కూడా అంటారు. ఈ స్టానం ద్వారా ఆ జాతకుడి ధన ఆదాయలు, కుటుంబ సౌక్యం, వాక్కు, భుక్తి, నత్తిలోపాలు వంటివి ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు. పైన తెలిపిన చక్రం లో శని ద్వితీయాధిపతి.

త్రుతీయ భావం: దీనినే భాత్రు భావం అంటారు. ఈ భావం ద్వార సోదరి, సోదరులు, ధైర్య సాహసాలు, మిత్రులు, శాంతం, ఉపాయం ఇలాంటి విషయాలు తెలుపును. పైన తెలిపిన చక్రం లో శని త్రుతీయాధిపతి.

చతుర్ద భావం: దీనినే మాత్రు భావం అంటారు. తల్లి, స్వంత ఇల్లు, వాహనాలు, భూమి, విద్య, కుటుంబ అభివ్రుద్ది, పశువుల సంపద, శాస్త్ర పరిశోదన ఇటువంటి వి తెలుసుకొవచ్చు. ఇక్కడ తెలిపిన చక్రం లో గురుడు చతుర్దాధిపతి

పంచమ భావం: దీనినే పుత్ర భావం అంటారు: ఈ భావం ద్వారా, సంతానం, విద్య, పాండిత్యం, జ్ఞానం, కవిత్వం, శాస్త్ర జ్ఞానం ఇటువంటి విషయాలు తెలుపును. ఉదాహరణ చక్రం లో కుజుడు పంచమాధిపతి.

షష్టమ భావం: దీనినే శత్రు భావం అంటారు. ఈ భావం, శత్రువులు, రుణములు, రోగాలు, కోర్టు తగాదాలు, సోమరితనం, వైద్య వ్రుత్తి వంటి వి తెలుపును. ఉదాహరణ చక్రం లో శుక్రుడు షష్టాధిపతి.

సప్తమ భావం: దీనినే కళత్ర భావం అంటారు. ఈ భావం వివాహం, ప్రేమ, దాంపత్య సుఖం, శయన సౌఖ్యం, కళత్ర లక్షణాలు, వ్యాపారం వంటి విషయాలు తెలుపుతాయి.  బుధుడు ఈ చక్రం లో సప్తమాధిపతి.

అష్టమ భావం: దీనినే అయుష్షు భావం అంటారు. ఈ భావం   జాతకుని ఆయుష్షు, మారకం, ఆత్మ శక్తి, నిధులు, పరుల సొమ్ము, పాప స్వభావం వంటి వి తెలుపును. చంద్రుడు అష్టమాదిపతి.

నవమ భావం: దీనినే భాగ్య స్టానం అందురు. ఈ భావం భాగ్యం, పిత్రు, ధర్మము, పిత్రార్జిత ధనం, ఆచార సాంప్రదాయాలు, ధర్మ కార్య నిర్వహణ, అద్రుష్టం, ఐశ్వర్యం, జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం వంటి విషయాలు తెలుపును. రవి నవమాధిపతి.

దశమ భావం: దీనినే రాజ్య భావం అంటారు. ఈ భావం వ్రుత్తి (ఉద్యోగం), ఉద్యోగ రంగాలు, అధికారం, క్రుషి, అభివ్రుద్ది, ఆదాయం వంటి విషయాలు తెలుపును. బుధుడు రాజ్య లేక దశమాధిపతి.

ఏకాదశ భావం: దీనినే లాభ స్టానం అంటారు. ఈ భావం, లాభాలు, ఉద్యోగా అభివ్రుద్ది, ధనాదాయ అభివ్రుద్ది, విద్య, జ్యేష్ట సోదరుడు, వ్యాపారం, జూదం ద్వారా ఆదాయం (Stocks, Lotteries), ఆకస్మిక ధన లాభ,నష్టం, విషయాలు తెలుపును. శుక్రుడు లాభ లేక ఏకాదశాధిపతి. 

ద్వాదశ భావం: దీనినే వ్యయ భావం అంటారు. ఈ భావం ధన వ్యయాలు, ఖర్చులు, మోక్షము, విదేశి యానం, పాప కర్మలు, దైవ భక్తి, ధన సద్వినియోగం, దుర్వినియోగం, కారాగర వాశం వంటివి తెలుపును. కుజుడు వ్యయ లేక ద్వాదశాధిపతి. 

ఈ జాతక చక్రం లో

లగ్నాదిపతి ఏకాదశ స్థానం లో ఉన్నాడు. ద్వితీయాదిపతి రాజ్యస్థానం లో ఉన్నాడు

త్రుతీయాదిపతి కూడా రాజ్యస్థానం లో ఉన్నాడు. చతుర్దాతిపతి కూడా ఏకాదశ స్థానం లో ఉన్నాడు

పంచమాదిపతి స్వక్షేత్రం (పంచమం) లో ఉన్నాడు. షష్టాదిపతి ద్వితీయస్థానం లో ఉన్నాడు

సప్తమాదిపతి ద్వితీయస్థానం లో ఉన్నాడు. అష్టమాదిపతి రాజ్యస్థానం లో ఉన్నాడు.

నవమాదిపతి లగ్నం లో ఉన్నాడు. దశమాదిపతి ద్వితీయస్థానం లో ఉన్నాడు. ఏకాదశాదిపతి ద్వితీయస్థానం లో ఉన్నాడు. ద్వాదశాదిపతి స్వక్షేత్రం (పంచమం) లో ఉన్నాడు

 ఈ పాఠం లో జాత చక్ర వివరాలు, స్థానల వివరాలు తెలుసుకున్నాము. తరువాతి పాఠం లో స్థానాల ప్రాముఖ్యతలు, వాటి ప్రభావాలు తెలుసుకుందాం.

***

No comments:

Post a Comment

Pages