పెళ్లి భోజనం.. - అచ్చంగా తెలుగు

పెళ్లి భోజనం..

కృష్ణ కసవరాజు


ఈ మహానగరం లో ఎవరైనా పెళ్లి కి పిలిస్తే ఆనందమే కాని...అక్కడ తిండి తినడం మాత్రం ఏడుపు వస్తుంది....ఏమి వంటకాలో...నా మొహం లా ఉంటాయి..😡😡
దోస అవకాయో..గొంగురో కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే నాలుక నాగుపాములా కదిలి బుస కొట్టి మిగతావి తినమంటుంది..😜😜
అవేమి ఉండవు...ఉప్పు కారం లేని ....ఆకుపచ్చ పచ్చడి ఒకటి వేసాడు దోస ముక్కలు కనపడుతున్నాయి కాని పచ్చడో పాయసమో తెలుసుకోలేక గిల గిల కొట్టుకున్న కాసేపు 😣😣😣
పెళ్లి జరుగుతుండగానే వాతావరణం చూద్దామని డైనింగ్ హాల్ వద్దకు వెళ్ళా అరిటాకులు వేసి వున్నారు హమ్మయ్య పంట పండింది దిక్కుమాలిన బఫెట్ భోజనం తప్పించుకున్నాం అనుకున్న..😠😠😠
ఎం లాభం మైఖేల్ జాక్సన్ కి ..పంచ కచ్చ పంచలు కట్టినట్టు....ఆ అరిటాకులో వేసింది...పన్నీరు...రుమాలు రోటి...గోబీ మంచురియ...నయం సూప్ కి కప్ పెట్టారు అరిటాకులో పొయ్యకుండా..😠😠😠
మనిషనే వాడు ఎవడైనా కడుపుకు సరిపోయినంతే తినగలడు మొగపెళ్లి వాళ్ళు ఎమన్నా అనుకుంటారని మొహమాట పడి ఒక పాతిక రకాలు పెడితే ఎవరికీ నష్టం...మిగిలింది పారేయ్యడమే గా...కాని తప్పదు..😠😠😠😠
మిరపకాయ బజ్జి...అప్పడం ...పెరుగు వడ తిన్నాక నొప్పులోస్తున్నవాళ్ళు నడిచినట్టు నడుస్తూ వెళ్ళడం తప్ప ఒకర్ని పలకరించ గలమా! ...అన్ని పెట్టారు అనుకోండి తినడం దేనికి అరిగే దాక రాయడం దేనికి..అంటారా అదే మరి జిహ్వా చాపల్యము అంటే...అది తగ్గితే అన్ని తగ్గుతాయి అప్పుడు ఎ కోలోర్స్ అవసరము రాదు ఎంచక్కా మల్లె తీగల్ల....టీవీ రిమోట్ లు కూడా లేచి మనమే తెచ్చుకోవొచ్చు...మొదటి అంతస్తు కుడా ఆయాసం లేకుండా ఎక్కొచ్చు.....😊😊😊😊😊
మనమేదో చుట్టపు చూపుగా వెళ్లి వచ్చేస్తాం కనుక సరే..అదే పెళ్లి వాళ్ళ సంగతి ఏంటి ఇదే ఫుడ్ మూడు పూటలు తింటే.......అందుకే పెళ్లి జంట ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు ...బస్సు , కార్ ల లో కాదేమో వాళ్ళ ఉద్దేశం ఏడూ కొండలు నడిచి ఎక్కమని...
***

No comments:

Post a Comment

Pages