స్వాగతమమ్మా.....!! - అచ్చంగా తెలుగు

స్వాగతమమ్మా.....!!

Share This

స్వాగతమమ్మా.....!!

సుజాత తిమ్మన.


స్వాగతమమ్మా...స్వాగతం...
అఖిలాండేశ్వరి..చాముండేశ్వవి
ఆపద్భాందవి....అమ్మా భవానీ..!!
వేయి నామముల వెలిగే తల్లీ..!!
వేదనల తీర్చ ఒక చూపు
ప్రసరించు నీ కరుణ కనులతో..
మనో మందిరమున
నీ పూజార్చనలు చేయ
ఎద పలకమునే ఆశనము చేసి
ఆత్మ కలశము లో నిను
ఆవాహనము చేసినాము.
మూసిన కనుల తోటలో
విరిసిన భక్తి పూలతో
అలంకారాలు చేసి
ప్రతీ శ్వాసనొక
మంత్ర పుష్పముగా మలచి
వ్రతము చేయుచుంటిమి..
అనుక్షణం ఈ ధ్యానంతో..నే
జీవితమై...!!
స్వాగతమమ్మా..!! స్వాగతం..!!
కాత్యాయినీ...కమలనయనీ..
కారుణ్యమయీ...కనదుర్గాభవానీ..!!
నవరత్రులకే నవసూత్రముగా
మా మదిలో నిలచీ
ఇలలొ వెలిసిన
మంగళ ప్రదాయినీ...!!
సత్ సంతానమునే అందించే బాలవేనమ్మా..!!
మొదటి రోజున నీ అలంకారమే
"శ్రీ బాలా త్రిపుర సుందరివే...!!"
చతుర్వేద పారాయణ
ఫలితమునిచ్చు
జగదంబవే..రెండవరోజు అలంకారమే
"శ్రీ గాయత్రీ మాతవే..!!"
అష్ట లక్ష్మిల సమిష్టిరూపమే
సంపదలనిచ్చే తల్లిగా
అలంకారమే మూడవరోజు
"శ్రీ మహాలక్ష్మివే..!!"
అక్షయ పాత్రను దరించిన తల్లి
చరాచర సృష్టి పోషక దాయిని
అలంకారమే...నాలుగవరోజు
"శ్రీ అన్నపూర్ణాదేవివే..!!"
పంచాక్షరీ మహామంత్ర
అదిష్టాన దేవతవే కామేశ్వరీ..
అలంకారమే అయిదవ రోజూ...
"శ్రీ లలితా త్రిపుర సుందరీవే..!!"
చదువుల తల్లీ..
బ్రహ్మ చైతన్య స్వరూపిణి..
అలకంకారమే...ఆరవరోజు
"శ్రీ సరస్వతీ మాతవే..!!"
మహా శక్తి వై..
దుర్గముడిని సంహరించి
జనులననుగ్రహించిన మాతా
అలంకారమే ఏడవ రోజు
"శ్రీ దుర్గా దేవివే..!!"
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
చేసి దర్మ విజయము సాదించిన
సింహ వాహిని..మహా శక్తి
అలంకారమే ఎనిమిదవరోజు
"శ్రీ మహిషాసుర మర్ధినివే..!!"
అమ్మలగన్న అమ్మా..!!
సకలసిద్ది ప్రదాతా..జగన్మాతా
పరమేశ్వరుని సగబాగానివి
అలంకారమే....తొమ్మిదవరోజు
"శ్రీ రాజరాజేశ్వరివే..!!"
దరిశనములొసగుతూ...
దేవీ నవరాత్రుల వేడుకలే..
మాకిచ్చినావమ్మా...!!
మంగళమమ్మా... జయ మంగళం...
శంకరీ...పరమేశ్వరీ..
పరంధాయినీ...పాపహరిణీ...!!
నమోస్తుతే...నమోస్తుతే..!!
****   ****   *****  **** 

No comments:

Post a Comment

Pages