మంచు తెరలు -3 - అచ్చంగా తెలుగు

 మంచు తెరలు -3 

పద్మావతి అన్నాపంతుల 




భగవతం గారికి విజ్జి ప్రేమ విషయం చెప్పగానే అతని ముఖం  మలినం అయింది.

అతని కి చెల్లి  అంటే  వల్లమాలిన ప్రేమ.మంచి హోదాలో ఉన్న వరుడిని తెచి చెల్లికి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాడు భగవతం.ఇలాగ పేరు వూరు లేని వాడికి, ఒక అనాధకి ఇచ్చి పెళ్లి చెయ్యడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు.

భగవతం అది జీర్ణించు కో లేక పోతున్నాడు.

విజ్జి కి నచ్చ చెప్ప మని సుమిత్రకి చెప్పేడు.సుమిత్ర కి ఇంట్లో ఇంకా అంత అధి కారం రాలేదు.కానీ సుమిత్ర మాటకి  వేదవతి, రంగా రావు గారు,భగవతం విలువ ఇస్తారని విజ్జి కి తెలుసు .విజ్జి పెద్దలకి చెప్పి ఒప్పించ మని వదినకి చెప్పింది. విజ్జి మనసు మార్చమని భగవతం చెప్పేడు.సుమిత్ర పని ఇరకాటం లో పడింది. సుమిత్ర విజ్జికి చాలాసేపు బోధ పరచింది. వెనకా,ముందు లేని ఒక నాదని పెళ్లి చేసుకుంటే   రాబోవు కష్టాలు, నష్టాలు, అవమానాలు ఏ కరువు పెట్టింది.డబ్బు లేక పోతే బతకడం కష్టం అన్నా ది.అన్నిటి కంటే ముఖ్యం విజ్జి తండ్రి ఈ పెళ్ళికి ఒప్పు కోరని, అతను పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యం ఇస్తారని, ఒక అనామకుడికి తన కూతురిని కట్ట పెట్టరని స్పష్టం గా చెప్పింది.

అన్నీ విన్న విజ్జి" నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ కానీ వదినా  వీటన్నిటి కంటే నా ప్రేమ గొప్పది.నేను ఎట్టి పరిస్థితిలో ను రాజ్కుమార్ ను వదులు కో ను " అని గట్టిగా చెప్పింది

ఇంక సుమిత్ర చేసేది లేక తమ మధ్య జరిగిన సంభాషణ అంతా భర్త కి చెప్పింది. ఎవరి పట్టుదల వారిది.

భగవతం ఉపేక్షించి లాభం లేదని రంగారావు గారికి అన్ని విషయాలు చెప్పేరు. సంగతి విన్న రంగా రావు గారు ఇంత ఎత్తున ఎగిరి పడ్డారు. భగవతం ఆయనని బుజ్జగించి" నాన్న గారూ విజ్జి చిన్న పిల్ల,అభం శుభం తెలియని పిల్ల.మనం దానికి వేరే సంబంధం చూసి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేద్దాం. ఒకసారి పెళ్లి ఐతే అదే సర్దుకు పోతుంది." అన్నాడు భగవతం.

కొడుకు చెప్పిన సలహా అతనికి బాగా నచ్చింది.

రంగారావు గారి ఫ్రెండ్ సుబ్బారావు గారు అని వున్నారు అతను, రంగారావు పొద్దుటే కలిసి వాకింగ్ కి వెళతారు.మాటల సందర్భం లో రంగా తన కూ తురికి ఏదైనా మంచి సంబంధం ఉంటే. చెప్పమని అడిగేరు.

సుబ్బారావు వెంటనే తన కొడుకు సుకుమార్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని,రంగాకి అభ్యంతరం లేకపోతే తన కొడుక్కి చేసుకుంటాను అని అన్నారు.ప్రస్తుతం సుకుమార్ ఇండియా వచ్చాడని, తను కూడా కొడుక్కి పెళ్లి చేసి  అమెరికా పంపించాలని అనుకుంటున్నట్టు చెప్పేరు .ఒకొక్కసారి  అనుకోకుండా.కొన్ని విషయాలు జరిగి పోతాయి.రంగారావు గారు వెంటనే ఆ సాయంత్రం పెళ్లి చూపులకి రమ్మని సుబ్బారావు గారిని ఆహ్వా నించే రు.రంగారావు గారు ఇంటికి వచ్చి ఆ సంగతి వేదవతి కి, భగవంత కి, సుమిత్రకి చెప్పేరు.విజ్జి ఇంట్లో లేదు కాలేజీ కి వెళ్ళి పోయింది.

పెళ్లి చూపులు అంటే విజ్జి గొడవ చేస్తుంది అని సుమిత్ర,విజ్జి తో " విజ్జి మీ అన్నయ్య ఏదో పెద్ద కేసు గెలిచేరుట,ఆ సందర్భం గా మనం స్టార్ హోటల్ కి డిన్నర్ కి వెళదాము.నువ్వు రెడీ అయిపో" అన్నది.

స్టార్  హోటల్, పార్టీ అనగానే విజ్జి సంతోషం గా బాగా ముస్తాబు అయింది.

హోటల్ కి వెళ్ళేక సుమిత్ర విజ్జి పక్కకి పిలిచి అసలు సంగతి చెప్పింది. విజ్జి కి సుమిత్ర మీద కోపం వచ్చింది తన దగ్గర దాచినందుకు." వదినా నువ్వు నా ఫ్రెండ్ వి అని  కు న్నా ను. నువ్వు వాళ్ళతో కలిసి పోయే వా" అన్నది

"లేదు విజ్జి నీ మంచి కోరేదానిని కనుక నీ దగ్గర  దాయవలసి వచ్చింది,ఇప్పుడు గొడవ చెయ్యకు, మౌనం గా ఉండు." అంది సుమిత్ర.

విజ్జి మాట్లాడ లేదు. పెళ్లి  చూపు లు జరిగే

సుకుమార్ కి విజ్జి నచ్చింది.

అతను విజ్జి తో కాసేపు ఒంటరిగా మాట్లాడతాను అన్నాడు.

రంగారావు గారు" ఇప్పుడు ఈ హోటల్ లో వద్దు, రేపు పొద్దుట పదిగంటలకు మా ఇంటికి వస్తె మాట్లాడుకో వచ్చు" అన్నారు .సుబ్బారావు గారు సరే అన్నారు

ఇంటికి వచ్చాకా రంగారావు గారు విజ్జి తో చెప్పేరు," సుకుమార్ వస్తున్నాడు.అతను నీకు నచ్చే డు అని, ఈ పెళ్లి నీకు ఇష్టమే అని చెప్పమని గట్టిగా వార్నింగ్ ఇచ్చే రు.విజ్జి అన్నిటికీ మౌనం వహించింది.సుకుమార్  వచ్చే డు.రంగారావు గారు వాళ్ళు మాట్లాడు కుంది కి ఏర్పాటు చేసేరు.చాలా సేపు మాట్లాడు కు.న్నారు.బయటికి వచ్చిన తర్వాత సుకుమార్ నవ్వుతూ నార్మల్ గా మాట్లాడేడు. అతను వెళ్ళేక సుమిత్ర విజ్జి నీ అడిగింది ఏమిటి మాట్లాడు కున్నారు అని. దానికి విజ్జి,

" వదినా సుకుమార్ సంస్కార వంతుడు, మంచి వాడు.నాతో అన్ని విధాల  సహా క రీ స్తానని అన్నాడు" అని

"ఐతే పెళ్ళికి ఒప్పుకున్నట్టేనా" అడిగింది సుమిత్ర.

పక్కన వున్న గ్లాసు తో నీళ్ళు తాగుతూ తల అవును కాదు అన్నట్టు వూపింది. సుమిత్ర పెళ్ళికి విజ్జి ఒప్పుకుంది అను కుంది.

విజ్జి పెళ్ళికి నాలుగు రోజుల్లోనే ముహూర్తం కుదిరింది.సుకుమార్ అమెరికా వెళ్ళిపోవాలని,పెళ్లి ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అన్నారు సుబ్బా రావు గారు.రంగా రావు గారికి కూడా కావలసినది అదే.ఇంట్లో అందరూ, పెళ్ళికి కావలసినవి అన్ని సమకూర్చ సాగేరు.బంధువులు అందరికీ పిలుపులు వెళ్ళాయి.షాపింగ్ చేసి అన్ని కొన్నారు.కేటరింగ్ వాళ్ళకి డెకరేట్ చేసే వాళ్ళని అందరిని మాటలాడేరు.ఇంటికి దగ్గరగా ఒక పెద్ద హోటల్ ఉంటే అక్కడ పెళ్లి చెయ్యడానికి నిశ్చయించు  కున్నారు. అక్కడే వచ్చిన బంధువులకు రూమ్ బుక్ చేసేరు. సుమిత్రని ఎక్కువగా తిరగవద్దని,అలసిపోతుంది అని చెప్పింది వేదవతి. సుమిత్రకి ఇప్పుడు ఏడవమాసం. విజ్జి ని కనిపెట్టుకుని ఉండమన్నాది.

సుకుమార్ మరి రెండు సార్లు ఇంటికి వచ్చి విజ్జి తో మాటలాడి వెళ్ళేడు.విజ్జి కి నచ్చే నగలు చీరలు గురించి వాళ్ళ అమ్మగారు అడగ మన్నారని అన్నాడు. అన్నీ సిద్ధం అయి పోయి పెళ్లి రోజు వచ్చింది. మగ పెళ్ళి వారు విడిది లో దిగారు. కాశీ ప్రయాణం,తోట లాంఛనం లాంటి తంతులు ముగిసాయి. ఇంక రాత్రి  పెళ్ళి అయి పోతే చాలు అనుకున్నారు రంగారావు దంపతులు.

రాత్రి రెండుగంటలకు ముహూర్తం.రాత్రి భోజనాలు అయి పోయాక వేదవతి సుమిత్రని కొంతసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పింది. రంగారావుగారు ముహూర్తానికి ఇంకా నాలుగైదు గంటల వ్యవధి ఉందని తాము కూడా ఒక గంట సేపు పడుకుంటామని వాళ్ళ గదికి వెళ్ళిపోయారు.. సుమిత్రకి నిద్దర పట్టలేదు మేడ మీద నుంచి కిందకి దిగి వచ్చింది. విజ్జి గదిలోకి వెళ్ళింది. విజ్జి గదిలో లేదు. బాత్రూం,హాలు,అంతటా వెతికింది. మేడ మీదకి ఫోన్ చేసి భగవతం గారికి విజ్జి కనపడ లేదని చెప్పింది.భగవతం గాభరాగా క్రిందకి  వచ్చాడు. ఇద్దరూ మళ్ళా అంతటా వెతికారు. విజ్జి జాడ లేదు. భగవతం తండ్రినీ తల్లినీ లేపి సంగతి చెప్పాడు. వేదవతి ఏమిటిరా ఇదంతా బాబు అంటూ ఏడవడం   మొదలెట్టింది. రంగారావు గారు భార్యని  కసిరి " పోయిన పరువు చాలు,ఇంకా నీ ఏడుపుతో అందరికీ తెలిసేలా చెయ్యకు" అన్నారు. రంగారావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. విషయం సుబ్బారావు గారికి చెప్పేద్దాము  అన్నారు. నలుగురూ కలిసి విడిదికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికే సుబ్బారావుగారు ఎదురుగా  వచ్చారు. రంగారావు గారిని చూసి కొంచం తడబాటుతో " ఒరే రంగా మా సుకుమార్ కనిపించడం లేదు,కారు కూడా లేదు,ముహూర్తం సమయం దగ్గర పడుతున్నా ది .అంతా గాలించే ము ఎక్కడా లేడు" అన్నారు.

రంగారావుగారు చెప్పాలని వచ్చిన విషయం సుబ్బారావు నోటినుండి వచ్చేసరికి ఆశ్చర్య పోయేరు.భగవతం, సుమిత్రతో,ఇక్కడ సుకుమార్ లే డు ,అక్కడ విజ్జి లేదు .నాకేదో అనుమానం గా ఉంది.ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా" అన్నాడు

సుబ్బారావుగారు"  తోట  లాంఛనం అప్పుడు కూడా ఇద్దరు తెగ మాటలాడు కు న్నారు. ఇప్పుడు ఇలాగ అయింది" అన్నారు.

అప్పుడు రంగా రావుగారు " మా విజ్జి కూడా కనిపించడం లేదురా" అన్నారు

"ఆ !! ఏమిటి " అని నోరు వెళ్ళబెట్టేరు సుబ్బారావు గారు

అర గంట గడిచింది.లగ్నం సమయం ఆసన్నం అయింది అని బంధువులు ఒకొక్కరు లేవడం మొదలుపెట్టేరు.పెద్దవాళ్ళు ఇద్దరికీ ఏమి చెయ్యాలో పాలు పోలేదు.తలలు పట్టుకుని కూర్చున్నారు.

వీధి లోకి ఒక కారు వచ్చి ఆగింది.అందులోనుండి విజ్జి,రాజకుమారు దిగేరు.వాళ్ళిద్దరూ పెళ్ళి బట్టలలో ఉన్నారు.మెడలో పూల దండలు ఉన్నాయి.విజ్జి మెడలో మంగళ సూత్రం పసుపు తాడుతో వెళ్ళాడు తున్నా ది.అది చాలు వాళ్ళిద్దరికీ పెళ్లి ఐపోయింది అని చెప్పడానికి

డ్రైవింగ్ సీటు లో నించి సుకుమార్ దిగాడు.సుబ్బారావు గారు సుకుమార్ ను చూసి" ఏమిటిరా కుమార్ ఏమిటి ఇదంతా" అన్నారు

 సుకుమార్ " వాళ్ళిద్దరూ ప్రేమించు కొన్నారు నాన్నా పెళ్లి చూపుల నాడు విజ్జి నాకు చెప్పింది.ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు అని బలవంతం గా పెళ్లి చేస్తారని , నన్ను సాయం చెయ్య మని అడిగింది.నేను అందుకే రహస్యంగా ఎవరికీ తెలియకుండా మాకు పెట్టిన ముహూర్తానికి వాళ్ళకి పెళ్ళి చేసేసాను" అన్నాడు హీరో లాగ ఫోజు పెట్టీ.

విజ్జి ముందుకి వచ్చి రంగారావు గారికి దండం పెట్టింది.రంగారావు గారు కాళ్ళు వెనక్కి లాక్కొని" నీకు నచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు.నా ఇంటి పరువు ప్రతిష్ట నీకు అవసరం లేదు.నాకు ఇక మీదట కూతురు లేదు.నీ ముఖం నాకు చూపించ వద్దు" అంటూ వేదవతి చెయ్యి పట్టుకుని విస విసా ఇంటికి వెళ్ళి పోయేరు.

సుమిత్ర విజ్జి దగ్గరకు వెళ్ళింది

" వదినా ఇంత సాహసం చేసినందుకు నన్ను క్షమించు.అన్నయ్య నన్ను మన్నించు.నాన్నగారికి కోపం తగ్గేక మళ్ళా వస్తాను" అన్నది విజ్జి

" వుండు విజ్జి ఎక్కడికి వెళతావు, ఎలా వే ళ తావు కట్టు బట్టలతో." అంది సుమిత్ర

" రాజ్కుమార్ ఒక గది లో ఉంటున్నాడు అక్కడికి వెళతా ము " అంది విజ్జి.

" వుండు విజ్జి ! నీకు సంబంధించిన బట్టలు,పుస్తకాలు వగైరా తెస్తాము" అంది సుమిత్ర

భగవతం , సుమిత్ర ఇంటికి వెళ్ళేరు

విజ్జి,  రాజ్కుమార్ కుర్చీల్లో కూర్చున్నారు.సుబ్బారావు గారికి చెందిన వాళ్ళు ఎవరూ బయటికి రాలేదు.రంగారావు గారి బంధువులు  వాళ్ల చుట్టూ ఉన్నారు. అందరూ తలో రకం మాట అంటున్నారు..దగ్గర ఊర్ల నించి వచ్చిన వాళ్ళు, ఊరిలోనే వున్న బంధువులు ఒకొక్కరు వెళ్ళిపోవడానికి సిద్ధ పడుతున్నారు.ఇంకా ఇక్కడ జరుగు తున్నా తమాషా చూడడానికి కొంతమంది అక్కడే తచ్చాడు తున్నారు. సుమిత్ర, భగవతం  విజ్జి కి సంబంధించిన సామాన్లతో వచ్చి విజ్జి కి అందజేశారు.సుమిత్ర విజ్జి కి ఒక కవర్ ఇచ్చింది.విజ్జి తెరిచి చూసింది.అది సుమిత్ర విజ్జి కి రాసిన ఉత్తరం

డియర్ విజ్జి

 నువ్వు పట్టుదలగా అతనినే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే ఇంత డ్రామా ఆడ వలసిన పని లేదు.సుకుమార్ తో పెళ్ళి ఇష్టమే అన్నట్టు మమ్మల్ని మోసం చేసే వు.ఇంటి పరువు తీసే వు.ఇంక  నీ జీవితం నీ ఇష్టం.ఈ కవర్ లో కొంత డబ్బు పెడుతున్నాను.మీ కొత్త కాపురానికి పనికి వస్తుంది. ఈ డబ్బు నా స్వంతం.నాకు నా పుట్టింటి వారు ఇచ్చినది .నీ పుట్టింటి సొమ్ము కాదు.వ ద్ద 

న కుండా తీసుకో.నీ నగలు, బట్టలు సర్దేశాను. ఫోన్ చెయ్యి.ప్రేమతో సుమిత్ర వదిన

విజ్జి నగలు అన్ని ఒక బాగ్ లో పెట్టీ విజ్జి కి అందించింది సుమిత్ర..విజ్జి నగలు తీసు కుంది కి తిరస్క రించింది.బట్టలు, పుస్తకాలు మాత్రం  తీసుకుని భర్తతో వెళ్ళి పోయింది

ఇన్ని సంవత్సరాల వరకు విజ్జి పుట్టింటికి రాలేదు.రాలేదు అనే కంటే రంగారావుగారు రానివ్వ లేదు అంటే బాగుంటుంది..ఇంట్లో అందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చే రు ఇంట్లో విజ్జి పేరు ఎత్త వద్దని

విజ్జి మీద బెంగతో వేదవతి సంవత్సరం తిరగ కుండానే పోయింది

రంగారావుగారు లా ప్రాక్టీస్ మానేశారు. ఇంట్లో అందరినీ శాసించే  రే కానీ అతని మనసుని శాసించ లేక పోయేరు.అపురూపం గా పెంచిన కూతురు చేసిన పనికి కృంగి పోయి ఐదు సంవత్సరాలు లో అతను కూడా మరణించారు.సుమిత్ర కొడుకు  సురేష్ పెద్దవాడు  అయేడు.

నిద్ర పట్టని సుమిత్ర భగవతం గారి గదికి వెళ్ళింది.భగవతం గారు కూడా నిద్ర పోలేదు." ఏమిటండీ ఇది.ఇన్ని ఏళ్ళు తరవాత ఈ పిల్ల రావడం"అంది

"అవును సుమిత్ర నాకు అదే అంతుపట్టడం లేదు. ఈ పిల్ల నిజం గా మన విజ్జి కూతురేనాని.నేను రేపు ఆ పిల్లని తీసుకుని  రాజమండ్రి వెళతాను. విజ్జి నివసించిన ఇంటికి వెళతాను.ఆధారాలు  ఉంటే ఆ పిల్ల విజ్జి కూతురే .అంతవరకు నువ్వు తొందర పడకు";అన్నారు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages