భారతంలో కర్ణుడు - అచ్చంగా తెలుగు

భారతంలో కర్ణుడు 

అంబడిపూడి శ్యామసుందర రావు 


మనం ఎలా ఉండకూడదో కర్ణుడిని చూసి తెలుసుకోవచ్చు కర్ణుడి పాత్ర విషయంలో, వ్యాస భారతంలో లేని అంశాలు చాలా ప్రచారంలో ఉన్న మాట నిజం. వీటిని వర్గీకరణ చేసుకోవలసిన అవసరం ఉంది. లేదంటే మనకు నచ్చనిదంతా అభూత కల్పన, పుక్కిట పురాణం అని అనుకునే ప్రమాదం కూడా ఉంది కర్ణుడు చిన్నప్పటి నుంచి అసూయాపరుడు.కర్ణుడు జీవిత పర్యంతం ఓడిపోతూనే ఉన్నాడు.కర్ణుడు జీవితం లోను అలాగే యుద్ధం లోను అనేక సార్లు ఓడిపోయాడు.. కర్ణుడిని తీవ్రంగా అభిమానించేవారు, తీవ్రంగా ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏ భారత ప్రతి చదివినా కర్ణుడు తప్పు దారిలో నడిచిన పరాక్రమవంతుడు అనిపిస్తుంది.

కర్ణుడు పరాక్రమవంతుడు కాదు అని ఎవరు అనలేరు, గొప్ప విలు విద్య అతని సొంతం, దానగుణం కలిగిన వాడు,అయినప్పటికీ అతను ఆదర్శప్రాయుడు కాలేకపోయాడు. సాక్షాత్తు సూర్య తేజస్సుతో పుట్టినా చెడు స్నేహం, ఈర్ష్య, అసూయ భావాలు అతని పతనానికి కారణం.కర్ణుడు మహాభారతంలో ఉన్నతమైన స్థానం తో పాటు ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి గా పేరుపొందాడు. తన ప్రభువైన దుర్యోధనుని ఆదరణ తో మరణించే వరకు ఋణపడి ఉండటం, అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడు అని చెప్పవచ్చును కర్ణుడు ఎప్పుడూ సంతోషంగా, దాన గుణంతో ఉండేవాడు. ఎక్కడికి వెళ్లిన "తక్కువ కులంలో జన్మించినవాడు" అని పిలిచేవారు. ఇలా కర్ణుడు జీవితాంతం వరకు ఈ అవమానంను ఎదుర్కొన్నాడు.

శకుని సలహాలతో విభేదించిన కర్ణుడు, దుర్యోధనుని కొరకు తన జీవితం ను పణంగా పెట్టిన వ్యక్తి గా చరిత్రలో నిలిచిపోయినాడు.

దూర్వాస మహర్షి కుంతిభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యుని అంశాన సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశించాడు. కర్ణుడిని పూర్వజన్మలో సహస్రకవచుడు అనేవారు. అతనికి వేయి కవచాలు ఉండేవి. అతనికి ఉన్న 999 కవచాలు నరనారాయణులు ఛేదించి సంహరిస్తారు.

 

అతడే తర్వాత జన్మలో సహజ కవచకుండలాలతో కర్ణుడిగా కుంతి గర్భాన జన్మించాడు.కన్య అయిన తనకు సంతానం చేటు తెస్తుందని కుంతి ఇతనిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడవేసి ఇంటికి వెళ్ళిపోయింది. అది సూత వంశజుడు అతిరథుడు తన భార్య రాధకు ఆ పెట్టె దొరికింది. అందులో ఉన్న బాలకుని జూచి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతన్ని పెంచసాగారు.

కర్ణుని పెంపుడు తండ్రి అగు సూతుఁడు అస్త్ర విద్యాభ్యాసమునకై రాజ కుమారులతో పాటు అస్త్రవిద్య కఱపుచు ఉన్న ద్రోణాచార్యుల వద్ద చేర్పించాడు. అయన సకల విద్యలను నేర్పించిన మంత్ర సహితంగా కొన్ని దివ్యాస్త్రాలను మాత్రం అతనికి ఇవ్వడానికి నిరాకరించారు. కర్ణుఁడు ఏవిధంగా నైనా ఆ అస్త్రాలను సాధించాలి అన్న తలంపుతో బ్రాహ్మణుడిగా పరశురాముని ఆశ్రయించి ఆయన వద్ద సాంగముగా అస్త్ర విద్య అభ్యసిస్తూ ఉండగా పరశురాముడు కర్ణుడి మోసమును తెలుసుకొని తాను ఉపదేశించిన మహా శస్త్రములు అతనికి ఆపత్కాలమున ఫలింపక పోవునట్లు శాపం ఇచ్చెను.కర్ణుడు మొదటి నుంచి ద్రోణునికి ప్రియశిష్యుడైన అర్జునుడు అంటే ఈర్ష్యతో అర్జునుని కన్నా గొప్ప వీరుడిగా అవ్వాలని అభిలాష కలిగి ఉండేవాడు పాండవుల పట్ల సహజముగా వైరము ఉండే దుర్యోధనుడు ఇది గ్రహించి అర్జునుడికి కర్ణుడు సమఉజ్జీ అని భావించి కర్ణుడిని చేరదీసి పరమ ఆప్తుడిగా చేసికొని అంగదేశం రాజుగా చేశాడు. ఇదిగాక కర్ణుఁడు విలువిద్య అభ్యసించే వేళ ఒక బాణం అచ్చట మేయుచున్న ఒకబ్రాహ్మణుని ఆవు పెయ్య మీదపడి అది చచ్చిపోతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణునికి సమరోద్రేకమున రథచక్రాలు భూమిలో క్రుంగు నట్లును, ఏవీరుని మార్కొని గెలువ కోరి పోరునో ఆవీరునిచే అతఁడు చచ్చునట్లును శపించెను. ఈతడు మహాదాత. సూర్యప్రసాదమువలన పుట్టినపుడే తాను పడసి ఉండిన సహజ కవచ కుండలములను ఇంద్రుడు అర్జునుని మేలుకై బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచింపఁగా అది తెలిసియు ఏమాత్రము సంకోచించకుండా ఇచ్చివేసెను. కనుకనే "అతిదానాద్ధతఃకర్ణః" అని అంటారు.

 

కర్ణుడు కురుక్షేత్ర యుద్ధం లో 17 వ రోజు, కర్ణుడు అర్జునుడి తో జరిగిన యుద్ధంలో మరణించాడు. కర్ణుడికి ఉన్న దివ్య అస్త్రములు, కవచ కుండలాలు అన్ని పోగుట్టుకొని, పరుశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయితన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకున్న తర్వాత మరణం పొందారు . కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుడు చేతిలో మరణించాడు.కర్ణుని మరణం తర్వాత, కుంతి యుద్ధభూమికి వెళ్ళింది . పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకున్నారు. మరణించిన కర్ణుడి చివరి కర్మలను కూడా వారు నిర్వహించారు.మహాభారతంలో కర్ణుడి మరణం పుట్టుకతోనే సవాల్, అవమానకరమైన, అన్యాయమైన ప్రతిభావంతులైన, ధైర్యవంతుడైన కర్ణుడు తన అంతిమ ప్రత్యర్థి అయిన అర్జునితో మరణించాడు.

 

ఇది మనకు తెలిసిన కర్ణుని వృత్తాంతము కానీ వ్యాస భారతానికి, కవిత్రయ అనువాద భారతానికి కర్ణుడి పాత్ర విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి. పైన చెప్పిన రెండిటికి మాత్రమే కాకుండా మన తెలుగు సినిమాల్లో, నాటకాల్లో ప్రచారంలో ఉన్న కథల్లో కూడా చాల తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే దాన వీర శుర కర్ణ లాంటి సినిమాలో కర్ణుడి పాత్ర గొప్పగా చూపించటానికి మిగిలిన పాత్రలను తక్కువ చేసి చూపిస్తారు అలాంటి సంఘటనలు మన తెలుగు సినిమాల్లో చాలా ఎక్కువ.ఎవరికీ వాళ్ళ సినిమాలు తీసేటప్పుడు వాళ్ళులభ్యమైన భారత ప్రతిని తీసుకొని వాళ్ల అభిరుచులకు అనుగుణముగా కథను మార్చి పాత్ర పోషణ చేసి ప్రజల ముందుకు ఉంచుతారు చివరకు అదే నిజం అని నమ్మే స్థితి ఏర్పడుతుంది.కవిత్రయం కూడా అనువాద ప్రక్రియ చేపట్టినప్పుడు వారికి లభ్యమైన ప్రతుల ఆధారంగా మూలానికి విరుద్ధంగా లేకుండా ఆంధ్రీకరించారు. ఒకవిధంగా వారిది స్వేచ్చానువాదం.

 

భారతంలో మిగిలిన విషయాలు పక్కన పెట్టి కేవలం కర్ణుడి విషయం పరిశీలిద్దాము.సంస్కృత భారతంలో కుమార అస్త్ర విద్యాభ్యాసంలో కర్ణుడు అర్జునుడిని ఎదిరించడం అంతా అలాగే ఆంధ్రీకరించినా కర్ణుడిని చూసి ధర్మరాజు భయపడినట్లు సంస్కృత భారతంలో ఉన్నా నన్నయ దానిని స్వీకరించలేదు.అలాగే కర్ణుడు ద్రౌపది స్వయంవరం లో పాల్గొన్నప్పుడు కొన్ని ప్రతులలో 'నాహం వరయామి', ఇతడు సూత పుత్రుడు కావున నేను ఇతడిని పెళ్లాడను అని ఉన్నది, కొన్నిటిలో కర్ణుడు విల్లు ఎక్కుపెట్టినా గురి తప్పాడని ఉంది. కవిత్రయం, కూడా ద్రౌపది కర్ణుడిని నిరాకరించిన విషయాన్ని అంగీకరించలేదు. కర్ణుడికి సంబంధించి ఇది ఒక తెగని వివాదం.కర్ణుడు దానానికి ప్రసిద్ధి. అయితే అతడు దానశీలి అనడమే గాని అతడు చేసిన దానాలు, ఒక్క ఇంద్రుడికి కవచ కుండలాలు ఇవ్వడం మినహా, వర్ణించబడ లేదు. కానీ వీటి మీద వచ్చిన కధలకు అంతూ లేదు. ఇవన్నీ పుక్కిట పురాణాలే. ఉదాహరణ, రణభూమిలో చనిపోయే ముందు బ్రాహ్మణ వేషంలో వున్న కృష్ణుడికి, తన బంగారు పన్ను పెరికి ఇచ్చాడన్నది. సినిమాలో కూడా చూపించారు.కృష్ణుడు అర్జునుడికి, కర్ణుడికి చెరో బంగారు కొండ ఇచ్చి దానం చేయమనడం, అర్జునుడు చేయలేక పోవడం అలాగే ధర్మరాజుని కర్ణుడిని బ్రాహ్మణులు కలప కోసం అర్ధిస్తే కర్ణుడు తలుపులు, కిటికీలు విరగగొట్టి ఇచ్చేయడం ఇలాటివెన్నో కల్పిత కధలు,ప్రచారములో ఉన్నాయి ఇంకొక అసత్యప్రచారం ద్రౌపది మనసులో కర్ణుడిని ఆరో భర్తగా పొందాలని ఉండేదని. కర్ణ సినిమాలో కూడా చూపించారు కూడా ద్రోణుడు కర్ణునికి బ్రహ్మాస్త్రము నేర్పక పోవడానికి అతడి అర్జున ద్వేషమే కారణమని చెబుతారు ద్రోణుడు.

 

యుద్ధంలో తనకు చంపగలిగే అవకాశం వచ్చినా అర్జునుడిని చంపలేదని సూర్యాస్తమయం అవ్వడం వల్ల, అనేది పూర్తిగా అభూత కల్పన. అటువంటి సంఘటన జరుగలేదు.

 

ద్రోణుడు గురు దక్షణగా ద్రుపద మహా రాజుని ఓడించమని తన శిష్యులు అందరికి చెప్తాడు.. ద్రోణుడి మెప్పు పొంది దివ్య అస్త్రాలని పొందాలని కౌరవులతో కలిసి ద్రుపదుని ఓడించటానికి వెళ్లి ఒడిపోతాడు ..తర్వాత భీముడు, అర్జునుడు ద్రుపదుడిని ఒడిస్తారు., తన స్నేహితుడు దురుద్యోదనుడిని కాపడే ప్రయత్నం లో గంధర్వుడు చిత్ర రధుడు చేతిలో ఒడిపోతాడు..తర్వాత భీమార్జునులు గంధర్వుడిని ఓడించి దుర్యోధనుడిని విడిపిస్తారు.ఇక ఉత్తర గోగ్రహణం లో అర్జునుడి చేతిలో చావు దెబ్బలు తింటాడు, అశ్వత్థామ పుణ్యమా అని అక్కడ బ్రతికిపోతాడు.. కురుక్షేత్రం లో భీముడి చేతిలో కూడా ఒడిపోతాడు, భీముడు కర్ణుని చంపుదాం అనుకుంటాడు కానీ తన తమ్ముడు అర్జునుడి ప్రతిజ్ఞ గుర్తు వచ్చి వదిలేస్తాడు..కురుక్షేత్రంలో. ఇక చివరిలో అర్జునుని చేతిలో మరణిస్తాడు.

No comments:

Post a Comment

Pages