శ్రీధరమాధురి - 106 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 106

Share This

శ్రీధరమాధురి - 106

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


రావణుడు తన పాల భాగంపై విభూదిని ధరిస్తే వాడటం కానీ దాని మీద కుంకుమను మాత్రం పెట్టుకునేవాడు కాదుట. విభూతి శివుడి పట్ల భక్తి భావాన్ని చాటుతుంది. కుంకుమ అమ్మవారి పట్లా, సృష్టిలోని అన్ని ఇతర జీవుల పట్లా భక్తిభావాన్ని చాటుతుంది.

 
శివుడిని పరమపురుషుడిగా, శక్తిని ప్రకృతిగా,  భావిస్తారు. ప్రకృతి అంటే సృష్టించబడినవన్నీ అని అర్థం.
 
కాబట్టి కేవలం విభూదిని ధరించడం అనేది శివుడి పట్ల మాత్రమే భక్తిభావాన్ని చాటుతుంది. 
కానీ కుంకుమ ధరించకపోవడమన్నది ప్రకృతిని అగౌరవించినట్లుగా భావించబడుతుంది. అంతేకాక ఈ సృష్టి లోని అన్ని జీవులపట్ల అగౌరవాన్ని చాటుతుంది.
  
నిజానికి కుంకుమ ఒక్కటే పెట్టుకోవాలి, ఎందుకంటే తన సృష్టిలోని జీవులన్నిటి పట్లా, గౌరవాన్ని చూపితే, అది పురుషుడిని గౌరవించినట్లే అవుతుంది కనుక 'పురుష' కూడా ప్రసన్నులవుతారు.

అదేవిధంగా 'పురుష' అయినా గురువు ఒక్కరినే గౌరవించకూడదు. 'పురుష'తో పాటుగా 'పురుష', ఆయన సేవ కోసం సృష్టించిన సమస్త ప్రకృతిని గౌరవించాలి. 

దీని భావం ఏమిటంటే ఒక శిష్యుడు తన గౌరవాన్ని కేవలం గురువుకు మాత్రమే పరిమితం చేయకూడదు. గురువు సేవకై వచ్చిన ఆయన యొక్క పరివారాన్ని, ఇతర శిష్యులను, సమస్త విశ్వాన్ని కూడా గౌరవించాలి.

గురువుకు సంబంధించిన ఏ అంశాన్నైనా అగౌరవపరచడం అనేది 'విషం'గా భావించబడుతుంది.

***

No comments:

Post a Comment

Pages