శివం - 95 - అచ్చంగా తెలుగు

శివం - 95 

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్  


{నేను అనగా శివుడు}

(కార్తికేయుడు కోటప్పకొండ రావటం అక్కడ జరిగిన అపశృతి సరి చేయడం.. కార్తికేయుడీ రచనా చాతుర్యం గురించి విష్ణు నుంచి బృంగి దాకా చెప్పటం నేను కోటప్పకొండ మెట్లు దిగుతూ కిందకి రావటం)

మెట్లు దిగి కిందకి వస్తూ ఉండగా, అక్కడ నాకు కనిపించాడు బ్రహ్మదేవుడు..

 బ్రహ్మ "మహేశ్వర అందరి గురించి ఉటకించావు చాలా చక్కగా చాలా ఆనందంగా ఉంది.. కానీ నా గురించి చెప్పింది మాత్రం మరిచిపోయావా"

నేను" అలా ఏమీ లేదు బ్రహ్మదేవా.. మీకు మూడు తలలు ఉన్నాయి కదా, అప్పుడు తమరు మూడు రకములుగా కార్తికేయని రచన గురించి చెప్తారని. నిత్యము వేదము పటించే మీ వాక్కుని ఈ రకముగా విందామని సంకల్పించాను"


బ్రహ్మ "తమరు మిక్కిలి చతురులు మహాదేవ!  తమరు లీలలు అనన్య సామాన్యం.. పార్వతీ మాత  ఈ బైరాగి  ఈ స్మశానవాసి.. ఈ బిక్షపతితో ఎలా వేగుతుందో పర్వత రాజకుమారి.. ఆదిశక్తి సతి అని భావించాను ఇటువంటి సమాధానాలు పరిచి.. మాతని చల్ల బుచ్చు తున్నారు అన మాట"

నేను "బ్రహ్మదేవా ఈ కార్తికేయుడు నిందాస్తులు మీరు కూడా పరిశీలించి.. నామీద బాగానే చలొక్తి ఇస్తున్నారు.. మా కార్తికేయుడు రచన చమత్కారం అటువంటిది "

బ్రహ్మ " అదేమీ లేదు మహాదేవ.. నన్ను కూడా అతగాడు పులకరింప చేశాడు.. అతగాడు రచించిన ఒకానొక నాటకంలో.. బ్రహ్మదేవుడికి ఉన్న మూడు తలలు ఒకటి విష్ణువు ఒకటి శివుడు మరొకటి బ్రహ్మ. త్రిమూర్తులకి భేదం ఏమీ లేదు సృష్టిని పరిపాలించుకోవటానికి ఎవరి బాధ్యతను వారి పంచుకున్నారు.. అంటూ నా మీద ఒక నాటక సన్నివేశం రూపొందించి నా చే త అదే అదే అనగా నా పాత్ర ద్వారా సందేశం ఇప్పించాడు"


నేను "అవును బ్రహ్మదేవా.. అతడిని సృష్టించింది తమరే.. అతనికి ఆ తెలివి ఆ చతురత ఇచ్చినది కూడా మీ తల రాతే.."

బ్రహ్మ  "తమరికి తెలియనది ఏముంది మహాదేవ మనము విత్తు మాత్రమే నాటుతాము ప్రతి మనిషి తన కృషితో తన పట్టుదలతో తన ఆసక్తితో తన ప్రతిభని పెంపొందించుకోవాలి ఆ తరువాత వారికి భగవంతుడు అనుగ్రహం అని అదృష్టమని ఒక అవకాశం వస్తుంది అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే వారు అవని మీద చరితార్థులు అవుతారు.. కీర్తించు హృదయం ఇచ్చేది మనమే.. కీర్తన ఆలపించేది మనకోసమే.. కీర్తనాలపించే వాడి బుద్ధి అన్నిటినీ ప్రేరేపిస్తుంది ఇదే కదా భగవంతుడు తన భక్తుడికి పెట్టిన శ్రద్ధ అనే పరీక్ష "

నేను " బహు బాగా చెప్పారు బ్రహ్మదేవా.. మన ముగ్గురిలో ఎవరు చెప్పినా అది మనందరం చెప్పినట్టే.. జగన్నాటకం ఆడటమే కానీ వేరే చోద్యమైన పనులు ఇప్పటిదాకా మనం ఎవరూ చేయలేదు కానీ ఈ కార్తికేయుడు జన్మని చరిత ర్థం చేయడానికి అందరం కలిసి విహారయాత్ర లాంటి ఒక లీలా చేద్దాము"

బ్రహ్మ "తమరు ఎలా అంటే అలా, ఇలా అంటే ఇలా,"

ఇదంతా చూస్తూ విష్ణుమూర్తి పాలకడలిపైన శేష తల్పం పైన చిలిపి నవ్వులు నవ్వుతూ చూస్తున్నాడు

లక్ష్మి దేవి "ఆ అర్థమవుతుంది లే మీరు మహదేవులు బ్రహ్మదేవులు ముగ్గురు కలిపి ఏదో తుంటరి పని చేయబోతున్నారు.. సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి చూస్తున్నాను.. ఏదో సరదా కోసం మూకుమ్మడిగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు అని అర్థమవుతుంది "

విష్ణు దేవుడు "ఇప్పటిదాకా మనందరం జగన్నాటక సూత్రధారులం ఇకమీద కార్తికేయుడు నాటకంలో సూత్రధారులు ము . ఎవరి పాత్ర వచ్చినప్పుడు వారు చేయాలి .. లేకపోతే మహాదేవుడు.. హలహాలం మింగిన గొంతుతో ఈ పాలసముద్రం పాలన్నీ తాగాడు అనుకో.. నాకు మా శేషుడీ కి ఇబ్బంది అవుతుంది.. ఈ కార్తికేయుడు మన మీద చేయబోతున్న పెత్తనానికి సిద్ధం అవ్వండి"

ఆదిశేషుడు కూడా తన పడగలతో ఒక్కసారిగా ఉసురుమన్నాడు..


మొత్తం మీద త్రిమూర్తుల చుట్టూ ఉన్న వాతావరణం
హాస్య యుక్తం గా ఉంది

లక్ష్మి "అక్కడ బ్రహ్మదేవులు విష్ణు దేవుడు ఉన్నారు కదా తమరు కూడా వెళ్తారా?"

విష్ణు  దేవుడు "వెళ్తాం త్వరలోనే వెళ్తాం.. మహాదేవుడు మనల్ని వదిలిపెడతాడా? " అన్నాడు సరదాగా

లక్ష్మి దేవి " అంటే మహాదేవులు వారు పిలుస్తున్నారు కాబట్టి తమరు వెళ్తారు మీకు ఇష్టం లేదా" అంది సహజ వెటకారంగా

విష్ణు దేవుడు "మహాదేవుని వారి ఇష్టపడిన దాన్ని నేను ఇష్టపడకపోవడం జరగదు.. మా ఇద్దరికీ భేదమే లేదు వారు ఏమి ఇష్టపడతారో వాటిని నమితంగా ఇష్టపడతాను నేను ఏమి ఇష్టపడతానో వారు దాన్ని ఇంకా అమితంగా ఇష్టపడతారు.. కార్తికేయుడు తను రాసిన ఒక రచనలో.. పాత్రధారి ప్రతిరోజు లింగాభిషేకం చేసుకునేవాడు.. కానీ అతగాడికి ఒక రోజు తన దగ్గర ఉన్న మహాదేవుని కి అభిషేకం చేసే సామాగ్రి ఉన్న సంచిని అడవిలో బందిపోటులు అపహరించారు అని తెలుసుకొని ఏమి చేయాలో అర్థం కాక.. తన మెడలో ఉన్న నా బొమ్మకి అన్ని తానే ఉన్నాను అని నమ్మి శివలింగానికి ఏ ఏ పూజ చేస్తారు అదే చేశాడు.. నాకు జరుగు పూజ కన్నా కూడా మహాదేవులు వారుకు జరగు పూజ నాకు చేయటం ఇంకా ఎంతో ఆనందంగా అనిపించింది వినవంటేనే ఆ బందిపోటు తిరిగి వచ్చి మహాదేవుని వారి పూజా సామాగ్రి ఆ పాత్ర గారికి అప్ప చెప్పి తనని క్షమించవలసిందిగా కోరుకుంటున్నానని ఆ పూజ చేసే వాడి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినట్టు ఒక రచన చేశాడు.. నేను కూడా ఆ మై మరుపు లో  ఉన్నాను అందుకే కదా త్రిమూర్తులు అందరం కలిసి చూస్తావుగా ఏం జరుగుతుందో "అన్నాడు ముగ్ధ డి లా

లక్ష్మి దేవి "చూడండి ఏం జరగబోతుందో"

అందరూ చూస్తున్నారు...అదే దేవతలందరూ

బ్రహ్మదేవుడు మాయమయ్యాడు చెప్పాను కదా మీకు నిజమైన భక్తులకి నేనే కనపడుతున్నాను కానీ వారు నన్ను శివుని వలె అలంకరించుకున్న వారి లాగా మాత్రమే చూస్తున్నారు.. ఎలాగైనా వారికి నేను దర్శనమిద్దామని.. అలా కావాలని కనపడ్డాను

చక చక చక చకా కార్తికేయుడు మెట్లు పైకి వస్తున్నాడు

నన్ను చూశాడు .. మన కార్తికేయుడు చాలా సరదా మనిషి లే... ఇక చూడండి అతనితో ఎలా ఉంటుందో సరదా లీల 

కార్తికేయుడు "ఓయ్ బాబు ఆగవయ్య ఆగు"

నేను "నీకు కనిపిస్తున్నానా? "

కా "చెట్టు అంత మనిషివి పైగా మహాదేవుడి వేషం వేసుకున్నావ్ కనపడకుండా ఉంటావా.."

నేను "ఏమిటో ఎవరు పట్టించుకోకుండా పోతున్నారు పలకరించావు ని అలా అన్నాను" 

కా "ఏమిటి కదా! ఏమాటకామాటయ్య నీకు శివుడి వేషం సరిపోయింది . బలే సరిపోయా వులే.. నిజంగా శివుడే దిగి వచ్చినట్టుంది నాకైతే.."

ఈ పదానికి అందరూ నవ్వుకుంటున్నారు

బ్రుంగి  నంది అయితే.. "ఓరి ఈతగాడి అసాధ్యం కులా శివుని పట్టుకొని శివుడిలా ఉన్నావని మన మహాదేవుడుతోనే చెబుతున్నాడు.. మీ పార్వతీ మాతైతే ఒకటే నవ్వు.. కైలాసమంతా ఒకటే చతుర తో అందరూ నవ్వుకుంటున్నారు ఇలాంటి నవ్వు చూసి ఇన్ని యుగాలైందో సుమీ."
బ్రహ్మదేవుడు మూడు తలలతో పగలబడి నవ్వుకుంటున్నాడు
విష్ణుమూర్తి అయితే నవ్వి నవ్వి నవ్వి నవ్వి..ఉబ్బి తబ్బి పోతున్నాడు ..

విష్ణు దేవుడు "ఆరే అల్లరి వాడ.. మహాదేవుని పట్టుకొని మహాదేవుడి వేషానికి బాగా సరిపోయావు అంటున్నావే .." 

ఆంజనేయడు అయితే తపస్సులో లీనమై కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు..

నేను "అంటే అప్పుడప్పుడు పండక్కి ఇలా వస్తూ ఉంటాను నీ బోటి వారి కళ్ల పడుతూ ఉంటాను.."

కా "బాగుంది బాగుంది.. నీ చిరునామా ఇస్తావా నీతో పని ఉంటుంది రాబోయే రోజుల్లో" 

నేను " నేను ఎక్కడికి పోతాను నేను కూడా దేశి సంచారం కోసమే బయలుదేరాను నీకు ఇబ్బంది లేకపోతే నీతో పాటే నడుస్తాను "

కా "అపరిచితుల్ని చూస్తే వారికి కొంత దూరంగా ఉంటాను కానీ నిన్ను చూస్తే బాగా తెలిసిన వాడిలాగా అనిపిస్తున్నావ్, బాగా కావాల్సిన వాడిలాగా, ఇంతకీ నీ పేరు ఏం పేరు"

నేను " నటరాజు!"

ఇక చూద్దురుగాని నటరాజ పెరుమాళ్ళ కళాతాండవం...

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages