జ్ఞానం - అచ్చంగా తెలుగు

 జ్ఞానం

    భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.


 

కులాలు, మతాలు నదుల లాంటివి!

నదులుగా చూస్తే వేరుగా కనిపించే నీరు

గంగగా చూస్తే ఒకటే అనిపిస్తాయి.

మనుషులుగా చూస్తే వేరుగా కనిపించే కులాలు,మతాలు 

మానవత్వంతో చూస్తే ఒకటే అనిపిస్తాయి.

“నేను” వేరుగా ఉంటేనే బేధాలు వస్తాయి,

నేను, మీరూ మనంగా మారితే వాదాలు రావు.

నదులన్నిటిలో నీటిని దర్శిస్తే,ఒకటిగానే కనిపిస్తాయి.

కులాలు, మతాలను మానవత్వంతో స్పర్శిస్తే,

ఒకటిగానే అనిపిస్తాయి.

కులాలు నువ్వు ఏకాకివి కావని చెబుతాయి,

కొట్టుకోమని చెప్పవు.

మతాలు నీకు మానవత్వాన్ని బోధిస్తాయి,

మూర్ఖుడిగా నిన్ను మారమని చెప్పవు.

లోపం కులంలో లేదు, నీ ఆలోచనలో ఉంది,

పాపం మతంలో లేదు, నీఅజ్ఞానంలో ఉంది.

వేరు అనే భావాన్ని వీడి ఒక్కటే అనే నిజాన్ని చేరితే

మానవత్వం వికసిస్తుంది,మాధవత్వం విలసిల్లుతుంది.

 ***

No comments:

Post a Comment

Pages