శ్రీధర మాధురి - 96 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి - 96

Share This

 శ్రీధర మాధురి - 96

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


మీకోసం ఒక కథ...

దేవతలు బృహస్పతి చేసిన యజ్ఞాలవల్ల జీవించగలిగారు.
 
బృహస్పతి(గురుగ్రహం) తన భార్య అయిన తార(నక్షత్రాల) తో కలిసి యజ్ఞాలు చేయడంలో చాలా నియమబద్ధంగా ఉండేవారు. బృహస్పతి తో ఉన్న సమస్య ఏమిటంటే ఆయన దృక్పథం చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది, ఆయన తారకు ఒక మంచి ప్రేమికుడు/భర్త కాలేకపోయారు.
 
అందుకే తార చంద్రుని(చంద్ర భగవానుడి) పట్ల ఆకర్షింపబడింది. ఆయన మంచి ప్రేమికుడు.  అందుకే ఆమె బృహస్పతిని వదిలి చంద్రుడి వద్దకు వెళ్ళిపోయింది.

ఇంద్రుడు దిగులుపడ్డాడు, ఎందుకంటే భార్య అయిన తార లేకుండా బృహస్పతి బ్రహ్మయజ్ఞాలు చెయ్యలేడు. బృహస్పతి వద్దకు తిరిగి రమ్మని తార మీద ఒత్తిడి పెట్టి ఇంద్రుడు కృతకృత్యుడయ్యాడు.
   
ఆ సమయానికి తార గర్భవతి అని బృహస్పతికి తెలుసు. చంద్రుడు, బృహస్పతి ఇరువురు కూడా ఆ బిడ్డకు తానే తండ్రి అని చెప్పుకున్నారు, కానీ తార బిడ్డకు ఎవరికి చెందుతాడన్న నిజాన్ని వెల్లడించడానికి నిరాకరించింది.
 
ఒక బిడ్డ పుట్టాడు. పుట్టగానే చాలా తెలివిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. తన తండ్రి ఎవరని తారను అడిగాడు.

తార బిడ్డను కాదనలేక, చంద్రుడే తండ్రి అని సమాధానం చెప్పింది. బృహస్పతి కోపంతో నిప్పులు కక్కుతూ ఆ బిడ్డను ఆడామగా కాని నపుంసకుడు కమ్మని శపించాడు.
 
బృహస్పతి యొక్క కోపాన్ని చూసిన ఇంద్రుడు కోపించి, ఇలా అన్నాడు 'ఈ బిడ్డ ఇప్పటినుంచి నీ బిడ్డగా చెప్పబడతాడు. ఎవరు బీజాన్ని నాటారన్నది ముఖ్యం కాదు, తోటమాలి ఎవరు అన్నది మాత్రం ముఖ్యమైనదే!'
 
అలా పుట్టిన బిడ్డ నపుంసకునిగా ఉన్నా, పుట్టుకతోనే ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉండటంవల్ల బుధుడు(బుధగ్రహం) అని పిలువబడింది. అది ఆడా కాదు, మగా కాదు.
 
దీని ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటంటే, బుద్ధి(జ్ఞానం) అనేది ఆడ లేక మగ ఏదీ కాదు. కాబట్టి ఆడ లేక మగ ఎవరైనా కూడా మేధస్సుతో పుట్టవచ్చు. కాబట్టి బుధునికి లింగబేధం లేదు.
 
ఆ తరువాత వ్యాస భగవానుడు అంబిక, అంబాలికలను గర్భవతులను చేసినా కూడా, ఆ పిల్లలు నపుంసకుడయిన 'విచిత్రవీర్యుని' పిల్లలుగానే పిలువబడ్డారు. యుధిష్టరుడు యముడికి పుట్టినా, అర్జునుడు ఇంద్రుడికి పుట్టినా, భీముడు వాయుదేవుడికి పుట్టినా,  నకులసహదేవులు అశ్వినీ కుమారులకు పుట్టినా, వారంతా పాండు కుమారులనే పిలువబడ్డారు. నిజానికి పాండురాజు 'కిందముడు' ఇచ్చిన శాపం వల్ల తన భార్యలైన కుంతీ, మాద్రులను గర్భవతులను చేయలేకపోయాడు, అయినా వారిని 'పాండవులు' అనే అన్నారు.

ఇదే 'నియోగం'.

No comments:

Post a Comment

Pages