'జారిపోతున్న క్షణాలు' - అచ్చంగా తెలుగు

'జారిపోతున్న క్షణాలు'

Share This
'జారిపోతున్న క్షణాలు'
-సుజాత.పి.వి.ఎల్
సైనిక్ పురి, సికిందరాబాద్.
వేకువ చైతన్యం 
సుప్రభాతగీతికై
మేల్కొల్పుతున్నా..
నిశి నిద్రావస్థలోనే ఉంటున్నానెందుకో..
ధరణిని జీవాధారం చేసుకొని
శ్రమ సేద్యంతో..
నీటి బుడగ బతుక్కి 
ఎప్పటికప్పుడు వింద్యామర వీస్తూనే వున్నా..
నిర్వేద స్వేదంతో 
జాలువారుతున్నాయి క్షణాలు..
ఆకలి మింగేస్తున్న ఆశలు
అధః పాతాళంలో అంటుకట్టబడ్డాయి..
ఆగే శ్వాసకి అదో కారణం కాకూడదని..
కష్టాన్ని ఇష్టంగా భరిస్తున్నా..
బాధల్ని అధిరోహిస్తూ 
బావిలోని మండూకంలా
గిరగిర తిరుగుతున్నా!
******

No comments:

Post a Comment

Pages