ఒకరు లేని ఇంకొకరు - అచ్చంగా తెలుగు

 ఒకరు లేని ఇంకొకరు

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


     అమ్మ లేని నాన్న....

వెలిగించని దీపంలా 

రాశిపోసిన  పాపంలా

వెలుగే లేని లోకంలా

మూర్తీ భవించిన శోకంలా

శబ్దం లేని మాటలా

పల్లవిలేని పాటలా

పువ్వులులేని తోటలా

నవ్వులులేని నోటిలా

శిధలమైన కోటలా

గమనం తెలియని గమ్యంలా

పగలులేని రాత్రిలా   

ఉంటారు.


నాన్న లేని అమ్మ ......

వత్తిలేని ప్రమిదలా

ప్రమోదం లేని ప్రమదలా

కళ తప్పిన కళ్ళలా

మమతలు ఉడిగిన మనసులా

ఒరలేని కత్తిలా

పిడిలేని సుత్తిలా

దిక్కులేని పక్షిలా

హక్కులేని సాక్షిలా

అంతంలేని శిక్షలా

గమ్యం ఎరుగని గమనంలా

రాత్రి లేని పగలులా

ఉంటుంది.

***


No comments:

Post a Comment

Pages