జాతీయ పర్వదినం - గణతంత్ర దినోత్సవం - అచ్చంగా తెలుగు

జాతీయ పర్వదినం - గణతంత్ర దినోత్సవం

Share This
'జాతీయ పర్వదినం..గణతంత్ర దినోత్సవం..!'
-సుజాత. పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.


ప్రపంచంలోని శ్రేష్ట రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటి. ఇది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగంలో మొదటి రెండవ అధ్యాయం వ్యాఖ్యానిస్తుంది. రాజ్యాంగంలోని ఆరవ ఆధ్యంలోని రెండవ భాగంలో 72-122 మధ్యగల నిబంధనలు పార్లమెంట్ నిర్మాణాన్ని సూచిస్తాయి.
ప్రాచీన భారతంలో లిఖిత రాజ్యాంగాలు లేవు.. రాజు స్థూలంగా తన అభీష్టానుసారం పాలించేవాడని ఒక అభిప్రాయం సమాజంలో ఉంది. పురోహిత వర్గాల సహాయంతో రాజ్యవ్యవస్థ నడిచేదనే దుర్భావనను సూడో సెక్యూలరిస్టులు బలంగా ప్రచారం చేశారు. ఇందుకు కారణం బ్రిటన్ వంటి దేశాలల్లో రాజుకు పోపుకు మధ్య జరిగిన మతయుద్దాలు.
మన భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. అంతేకాదు రాజ్యాంగాలు యుగయుగాల్లోనూ మారుతూ వచ్చాయి.
మనుస్మృతి తర్వాతి కాలంలో పరాశరస్మృతి, శoబలిఖిత స్మృతి వంటివి ఎన్నో వచ్చాయి. ఆమాటకొస్తే 1950 సంవత్సరం అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించబడిన రాజ్యాంగం ఈ డెబ్బది సంవత్సరాల్లోనే తొమ్మిదిసార్లు మార్చబడింది. కాబట్టి సారాంశమేమిటంటే రాజ్యాంగాలు ప్రజలకోసం ఏర్పడి ప్రజాసంక్షేమాన్ని పరిరక్షించుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి.
భారత రాజ్యాంగాన్ని అమెరికా రాజ్యాంగంతో పోల్చి చూసిన నిపుణులు మనదే శ్రేష్టంగా ఉన్నదని అంగీకరించారు. అందుకు కాలానుగుణమైన మార్పులు కూడా చేశారు. రాజ్యాంగం అనేది ఒక సిద్ధాంత గ్రంథం. సిద్ధాంతం ఎప్పుడైనా ఆచరించే వారి బలం మీద ఆవిష్కరింపబడుతుంది. . 1947 ఆగస్టు 15 న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది..మూడు సంవత్సరాల తర్వాత ఇది ఒక డెమోక్రొటిక్ రిపబ్లిక్గా మారింది. 1947 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆగస్టు 28 న సమావేశంలో భారత దేశం యొక్క శాశ్వత రాజ్యాంగం ముషాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ నియమించి ...పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. 'పూర్ణ స్వరాజ్' ప్రతిజ్ఞ గావించి భార్తదేశ కీర్తి, గొప్పతనానికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగుర వేసి గణతంత్ర దినోత్సవాన్ని ప్రకటించడమైనది. అప్పటినుండి ప్రతి ఏటా మనం' రిపబ్లిక్ డే' ని జరుపుకుంటున్నాం.

'' ఇదిగిదిగో మన త్రివర్ణ పతాకం
రండి.చేద్దాం! గౌరవ వందనం
స్వతంత్ర సమరయోధుల త్యాగానికి 
నిలువుటద్దమై నిలిచింది మన జెండా
దేశం కోసం కలిసి నడుద్దాం!
ఒక్క బాటగా పయనిద్దాం ..!
ఏక కంఠంతో కలిసి పాడుదాం 
మన జాతీయ గీతాన్ని ఆలపిద్దాం 
అదిగదిగో మన త్రివర్ణ పతాకం 
రండి చేద్దాం గౌరవ వందనం'' ..!

*******No comments:

Post a Comment

Pages