మానసవీణ -13 - అచ్చంగా తెలుగు

 మానసవీణ-14

మణి వడ్లమాని

(జరిగిన కథ: ఎవరూ లేని మానస చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. సేవాభావానికి మారుపేరులా ఉండే మానస అంటే అందరికీ ఇష్టమే. ఒక బహుమతి ప్రదానోత్సవ సభలో మానసను చూసిన మంత్రి కృషీవలరావు, ఆ పాపలో తనకు తెలిసిన శ్రావణి అనే ఆవిడ పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెతో చనువుగా మెలుగుతూ ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రభుత్వ కాలేజిలో చేరి, చదువుతూ ఉన్న మానస అక్కడి విద్యార్ధుల మనసు గెల్చుకుని, క్లాస్సులు సజావుగా జరిగేలా చేస్తుంది. రోడ్డుపైన అనాధలుగా వదిలేసిన కొండలరావు దంపతుల దీనస్థితిని చూసి, వాళ్ళ బిడ్డలకు బుద్ధి చెప్పి, దారిలో పెడుతుంది  మానస. మనసు నలతగా ఉండడంతో గుడికి వెళ్ళిన మానసను శ్రావణి కౌగిలించుకుంటుంది. భూషణానికి ఒక ఫోన్ కాల్ ఒస్తుంది.)

భూషణానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన  ఆ ఫోన్  అతని మానసిక  శాంతిని పోగొట్టి అనారోగ్యానికి గురిచేసింది. ఇది అని చెప్పలేని బాధ అసలే బిపి, షుగర్ ఉన్నాయి వాటికి  తోడూ కొత్తగా ఆయాసం కూడా మొదలైంది. మనసు గతం లోకి జారింది

ఎప్పుడైతే  కోడలు శ్రావణి, తప్పిపోయిన  పిల్లకోసం జీవితమంతా రోదిస్తూ పిచ్చిదానిలా ఉందో, అప్పటి నుంచే ఒక్కగా నొక్క కొడుకు రఘురాం, ఒంటరి వాడైపోయాడు.తల్లి తండ్రి  ఎన్నో సార్లు చెప్పారు.మళ్ళి పెళ్లి చేసుకోమని. అతను ససేమిరా వినలేదు.  బలవంతం గా అయినా రెండో  పెళ్లి చెయ్యాలని  ప్రయత్నించారు. అది కుదరలేదు. తల్లి అనసూయ ఆత్మాహత్య చేసుకుంటానని బెదిరించింది. ఒక వేళ నీకు దేవుడు అలా  రాసి పెడితే అదే జరుగుతుంది అనేసాడు. అంతే కాని తల్లి బెదిరింపు కి  ఏ మాత్రం భయపడలేదు. దానితో తల్లి చాల బాధపడిందిఆమెకి అసలు  తన అన్న గారి కూతురినిచ్చి  చేయాలనీ ఉండేది. ఆస్తి పరుడు. రాజకీయంగా  పలుకుబడి ఉన్నాడు.

 కాని రఘురాం తనకు చిన్నప్పటి నుంచి  చదువు చెప్పిన మాస్టారు అమ్మాయిని ఇష్టపడ్డాడు.తల్లి తండ్రికి పెద్దగ ఇష్టం లేకపోయినా పట్టు బట్టి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. అత్తగారు, మావగారు తనతో సరిగా  ఉండకపోయిన  తన్ని ప్రేమగా చూసుకునే దైవంలాంటి భర్త ఉండగా తనకే లోటు రాదు అనుకుంటూ సంతోషంగా  సాగిపోతున్న  సంసారంలో మరో మనిషి  రాబోతున్న సన్నాహాలు  కనిపించి భర్త  చెవిలో వేసింది. అది విన్న రఘురాం ఆనందంతో ఆమెని దగ్గరకు తీసుకొని ఇంకేమి, దేవి గారు నన్ను మరచి పోతారుఅంటూ ఏడిపించాడు.“రఘు కలలో కూడా ఆ మాట అనొద్దు. మిమ్మల్ని మరచి పోవడం అనేది కల్ల ఎన్నటికి జరగదు.”ఆవేశంగా అంది. “కూల్ శ్రావణి కూల్. ఈ సమయంలో లో ఇంత ఆవేశం పనికి రాదు" అన్నాడు, అనునయంగా.

 ఆరవ నెల వచ్చింది. కొంత ఒళ్ళు చేసి,మరి కొంత తల్లి కాబోతున్న ఆనందం ఇవన్ని కలసి శ్రావణి మాతృత్వపు శోభ తో  మెరిసిపోతోంది. అలా మెరిసి పోతున్న శ్రావణి అందాలు చూస్తూ రఘురాం ఎవరో కవులు చక్కనమ్మ చిక్కినా అందం అన్నారు.  కానీ నేనంటాను బొద్దుగా ఉండి బొండు మల్లెపువ్వులా ఉన్నా కూడా అందమేఅంటూ శ్రావణిని  ఉత్సాహ పరచేవాడు. ఏడోనెల రాగానే పుట్టింటి వారు వచ్చి అత్తవారింట్లో సీమంతం చేసి పుట్టినింటికి తీసుకెళ్ళే సమయంలో  అత్తగారు, మావగారు కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు, "పండంటి కొడుకును కనాలి సుమా" అంది

 ఆ దీవెన లోనే అంతర్లీనంగా  హెచ్చరిక వినిపించింది శ్రావణికి. కానీ అన్ని అనుకున్నట్లే జరగవు. తానొకటి తలిస్తే దైవం వేరే తలచాడు. పుట్టిన ఆడపిల్లను తీసుకోని వచ్చిన శ్రావణి కి అన్ని అవమానలే.

 ఇంతలో పులి మిద పుట్రలా బోసినవ్వుల  మూడు నెలల పాప మాయం. అది తట్టుకోలేని శ్రావణి పిచ్చిదయిపోయింది. కొడుకు రఘురాం, ససెమిరా రెండో పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేసాడు. అప్పటి నుంచి సరే ఏదో బాధలో ఉన్నాడు లేఅని సరిపెట్టుకున్నా ఇంచుమించుగా  19 ఏళ్ళు గడిచిపోయాయి. అసలు కొడుక్కి తన పని భార్యను చూసుకోవడం తప్ప వేరే ద్యాసలేదు. ఈ లోపల భార్య పోవడం, మనమరాలు బతికే ఉందన్న నిజం తెలిసిన కోటేసును చంపించడం జరిగాక, నీ విషయాలు బయటపెడుతాను అని బెదిరింపులు   రావడంతో  మనిషి భయపడి మానసికంగా బెదిరిపోయాడు.

 అదిగో అప్పటి నుంచి  భూషణం  తనలో తనే కుమిలిపోతున్నాడు. తన వంశం ఇక్కడి తో ఆగి పోతుందని బెంగ పెట్టుకొని  అనారోగ్యం తో మంచమెక్కాడు. డాక్టర్లు  ఈయన కాళ్ళు పనిచెయ్యవు, రెండు కాళ్ళకి, నోటికి పక్షవాతం వచ్చింది అని చెప్పేశారు.

 గతమంతా కళ్ళ ముందు మెదిలింది. భార్య, ‘కొడుకు జీవితం నాశనం అయిపోయిందిఅన్న బెంగతో, చేసినపాపం పట్టి కుడపటంతో, తీసుకొని, తీసుకొని చనిపోయింది. కొడుకు ఒక శిలా పాషాణం లా అయిపోయాడు. వాడి కళ్ళలోకి చూడాలంటేనే భయమేస్తోంది. దేవుడా దయ తలచి  నా మనమరాలు ని చంపలేదని ఆశ్రమం దగ్గర వదిలేసానని ఓబులేసు అన్నాడు. నేను ఘోరమైన  పాపం చేశాను. నా పాపానికి నిష్కృతి  లేదు. నాకు ఏ శిక్ష విదించినా  సిద్దమే. దయచేసి  నా మనవరాలిని ఒక్క  సారి చూపించు  ఆ తల్లి, బిడ్డలను  కలుపు భగవంతుడా. అంటూ కనిపించని  ఆ దేవుణ్ని ప్రార్థించాడు.

(ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages