నాలోకి నేను చూసుకున్నప్పుడు - అచ్చంగా తెలుగు

నాలోకి నేను చూసుకున్నప్పుడు

Share This

 నాలోకి నేను చూసుకున్నప్పుడు

భమిడిపాటి స్వరాజ్య రాజనాగారావు 
ఎన్నో వ్యక్తిత్వాలు

దర్శనమిస్తూ ఉంటాయి. 

కామం,క్రోధం,దుఃఖం,ఈర్ష్య,అసూయ,ద్వేషం

ఇలా ఆ వ్యక్తిత్వాలలో ఎన్నెన్నో భావాలు 

ప్రకటింపబడుతుంటాయి.

ఏ భావానికీ నటన తప్ప

నిజాయితీ కానీ, నిర్మలత్వం కానీ లేవు.


ఆ భావాలు దైవం ముందు కూడా 

తమ నటనను ప్రదర్శిస్తూనే ఉంటాయి.

ఆ నటనకు భక్తి అనే పేరు పెట్టుకొంటాయి.


ఇవన్నీ ఆత్మవంచనను నమ్ముకొని

దానికే తమ మనసును అమ్ముకొని 

జీవిస్తూ ఉంటాయి.

అహంతో జీవించలేక 

అహంకారంతో విలసిల్లుతుంటాయి.


వీటన్నిటికీ ఆధారభూతమైన 

వీటికంటే వ్యతిరేకమైన భావం ఒకటి 

వీటిని దారిలోకి తేవటానికి

నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

అది ఆత్మకు సాక్షిగా ఉంటూ

అన్నిటినీ మౌనంగా కంటూ

ఈ వ్యక్తిత్వాల మార్పుకై  నిరీక్షిస్తూ ఉంటుంది. 

***

No comments:

Post a Comment

Pages