మానసవీణ -10 - అచ్చంగా తెలుగు
మానసవీణ -10 
జగన్నాధ్ వెలిదిమెళ్ళ(విసురజ)


పోలీస్ వాళ్లకు వుండాల్సిన పొగరు, మగటిమి సంపూర్తిగా పుణికి పుచ్చుకుని మగటిమిని,పొగరును కూడా పది మందికి మంచికే వాడే అరుదైన ఆఫీసర్ దినేష్..అలాగని పవరుంది పొగరు వుంది కదాని తప్పుడు దారులు తొక్కడు, తొక్కిన వారి పట్ల కాలుడు దినేష్ కుమార్, (I. P. S.).. అతడి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు, తెలుసుకుందామన్నా వారికి అవకాశం యివ్వలేదు..ఎక్కువ మాట్లాడడు, ఎక్కువగా ఎవరినీ మాట్లాడినివ్వడు..అతనే నవ్వుతుంటే పున్నమి వెన్నెల విరిసిందా అన్నట్టు అగుపిస్తాడు అందుకు తగ్గట్టుగానే నెలకు ఒకసారి వచ్చే పున్నమిలా అతని నవ్వు కూడా గంభీరంగా వుండే అతని మోములో కనబడేది అప్పుడప్పుడే.. 
ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒద్దికగా, పద్దతిగా నడవాలని, మచ్చలేని నడతతో డిసిప్లిన్ కి దూరమవుతున్న రకరకాల మత్తులలో జోగుతున్న నేటి తరానికి ఆదర్సమవ్వాలని తలచి సివిల్స్ రాసి టాప్ చేసి I.A.S. ఎంపికై కూడా మనసు పడి ముచ్చటతో ఏరి కోరి ఎంచుకున్న సర్వీస్.ఇండియన్ పోలీస్ సర్వీస్ (I.P.S.) మొదలు పరీక్షలప్పుడు, అపై ట్రైనింగ్ లోను ప్రయాసతోను, ప్రణాళికతోను ముందుకు వెళ్లి తమ బ్యాచ్ లో బెస్ట్ ప్రోబేషనర్ గా మెడల్ అందుకున్న ఘనుడు..అతని ప్రజ్ఞపై నమ్మకంతోనే అందుకే అతనినే ప్రత్యేకంగా పిలిపించి ఈ సున్నితమైన సమస్య గురించి అతనితో మాట్లాడదలచాడు మంత్రి కృషీవలరావు.. మంత్రి గారి పిలుపు అందుకున్న దినేష్ మనస్సులో వెయ్యి సందేహాలు..తను ఒకరికి వత్తాసు పలికే రకం కాదే, అస్సలు మొహమాటానికి కూడా తావివ్వడే మరటువంటప్పుడు తనని రమ్మని కబురంపిన విషయం ఏమైవుంటుందానని తీవ్రంగా ఆలోచిస్తూ మంత్రి గారి బంగాళా ముందు జీపు దిగి కాపలదారులకు కూడదంటున్న దినేష్ తన ఐ.డి.ని చూపుతూ గేటు దాటి లోపలకు వెళ్లి ముందు హాలులో కూర్చున్నాడు.. 
'మానస' విషయంపై పలు మార్లు పలు రకాలుగా యోచించిన మీదట..పైగా ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే తత్వం గల నిక్కచ్చి ఆఫీసర్ దినేష్ ముందు వున్నదున్నట్టు చెప్పటమే సుఖమన్నగ్రహింపుతో విషయాన్ని ఆమూలాగ్రం సవివరముగా దినేష్ కి వివరించేడు మంత్రి కృషీవలరావు..శాంతంగా సాంతం విన్న దినేష్ దృష్టిలో మంత్రి కృషీవలరావు పట్ల గౌరవం మరింత పెరిగింది..నాడు లేని పరపతి, పవర్, పైసా అన్నీ నేడు వుండీ కూడా తన తండ్రిని దారుణంగా చంపించిన భూషణం గారిపై ఎటువంటి ద్వేషం లేకపోగా ఆయనను క్షమించి వారింట్లోవారికి మనశ్శాంతి కలగాలని, వారి ఇంటి కోడలైన శ్రావణికి లేదనకుంటున్న కూతురు, దూరమైన కూతురు 'మానస' బ్రతికే వుందని, తనని తల్లి శ్రావణితో కలిపి తన తండ్రిని పొట్టన పెట్టుకున్న వాళ్ల ఇంట్లో తిరిగి ఆనందాలు వెల్లివిరియాలని కోరుకోవడం మంత్రి కృషీవలరావు గారి పెద్ద మనసుకు తార్కాణమని భావించి, తన మనసులోని భావం బయట పెట్టకుండానే మంత్రి గారికి మనసులోనే అంజలి ఘటించాడు దినేష్ కుమార్, I.P.S. 
దినేష్ కుమార్ కు తన గతం కళ్ళముందు రీలులా గిర గిరా తిరిగింది..సంపన్న కుటుంబంలో పుట్టిన తనకు పస్తులుండవలసిన పరిస్థితి కారణం, తన తండ్రి యశోవర్ధనరావు, తల్లి పరిమళ దేవి కాపురం కూలడం వెనుక, తన తండ్రి మాంచి బిజినెస్ ను కూల్చిన ఘనత చివరికి తను అనాధగా మారడం వెనుకునున్నది భూషణమన్న సంగతి తనకి తప్ప మరొకరికి తెలియదు తను ఈ విషయం ఎవరితోనూ పంచుకోదలుచుకోలేదు..గీతలో గీతాచార్యుడు అన్నట్టు ఎవరి యుద్దాలు వారే చెయ్యాలి అన్నది దినేష్ కుమార్ కి బాగా చిన్నప్పుడే నేర్చిన సత్యం..మంచిగా చెబితే మారేదేవ్వరు పైగా నవ్వి పోతారు, పైగా అసమర్ధుడి క్రింద జమకడతారని దినేష్ కుమార్ చిన్ననాడే తెలుసుకున్న నిజం.. అహింస పరమో ధర్మమే గానీ పాపుల భారాన్ని తగ్గించాలంటే, ఎదగదిలో గూడుకట్టుకున్న మనోరధాలు పూర్తికావాలంటే అప్పుడప్పుడు రాణాలు జరగాల్సిందే, దుర్మమాధుందుల ఏరివేత జరగాల్సిందే.. 
తండ్రి యశోవర్ధనరావు వ్యాపారంలో భాగస్వామిగా చేరి తన తండ్రిని మత్తులోను ముంచి, గమ్మత్తైన ముద్దుగుమ్మలతోను సావాసం కల్పించి, తన తల్లిపై కన్నేసి చెరబట్ట తను కాదన్నందుకే తన తల్లి చరితను మత్తులో మునిగితేలే తండ్రి చెవిలో చెడుగా చెప్పి తన తల్లి జీవితాన్నిరంపపుకోతకు గురిచేసి, కట్టుబట్టలతో తనతో సహా తల్లిని ఇంటినుండి వెడలగొట్టించిన దొడ్డ ఘనత ..ఆ వూర్లో అంత బతుకు బతికి అక్కడ వుండలేక మరో వూరికి వెళ్లి పాచి పనులు చేసినా తన ఆకలిని తీర్చలేనితనాన్ని, తన విలువలు వదిలి వలువులు విప్పే పని చెయ్యలేక తనని చిన్ననాడే అనాధ శరణాలయం ముందు ఒక పెట్టెతో వదిలేసి తన తల్లి కాలువలో దూకి కాలం చేసిదన్న సంగతి, ముందుచూపుతో తన తల్లి ఈ గత విషయాలన్నీ వివరంగా ఒక వుత్తరం రాసి తన పెట్టెలో బట్టల మడతల్లో దాచిందన్న సంగతి ఆ అనాధ శరణాలయం ప్రాంగణంలో తను అనాధగా పెరిగి పెద్దయ్యాదాక గానీ తెలియలేదు.. స్నేహితులు కరువై, ఈసడింపులు మోతై మ్రోగినపుడు, మనసు కష్టపడినప్పుడు, తనెవరో తెలుసుకోదల్చినప్పుడు..తన పాత పెట్టెలోని వస్తువలతోనే తన బాధను పంచుకునే దినేష్ కుమార్ కి ఒకనాడు ఒక పాత చిరిగి పీలికలైన బొంత మడతల్లో కనబడిన తన జీవిత సత్యాన్ని..తన తండ్రి తల్లి జీవితాలని కాలరాసిన దొడ్డ ఘనత పెద్దమనిషిగా చలామణి అవుతున్న భూషణమేనన్న తెలిసి, తన తండ్రి వూరు వెడితే తన తండ్రిని ఏనాడో వ్యాపార హీనుడిని చేసి గెంటించేస్తే చేతిలో చిల్లిగవ్వలేక కుళ్ళి కృశించి చనిపోతే, మున్సిపాలిటీ వాళ్ళచే ఈడ్చివేయబడ్డ సంగతి తెలిసింది..ఆ నాడే దినేష్ కుమార్ ప్రతినబూనాడు..తను కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదివి సివిల్స్ రాసి, I.P.S. కి అర్హత పొంది, ఎక్కడ పలుకుబడితో, గర్వంతో కన్ను మిన్ను కానక పేట్రేగేడో అక్కడే భూషణాన్ని మట్టిలో కలపాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.. ఈ విషయం అతనికి ఆ పెట్టెలో వున్నా మాసిన చిరిగిన బట్టల పీలికలకు తప్ప మరొకరికి తెలియదు.. 
దినేష్ కుమార్, I.P.S. కి వెదక బోయిన తీగ కాలికి తగిలినట్టయ్యింది..తను ఎదురుచూస్తున్న శుభఘడియ రానున్నదని యింతకాలం భూషణం వెనకున్న రాజకీయ బలమే తనని ఆపిందని యిప్పుడు వాళ్ళే పిలిచి విషయం చెప్పి సహాయం కోరితే యిలా అంది వచ్చిన అవకాశాన్ని తను ఎందుకు వదులుకుంటాడు, అందులో I.P.S. బుర్రనాయే..మంత్రి కృషీవలరావు చెప్పిందంతా విన్న దినేష్ తగిన ప్లాను, పద్దతి కొరకై ఒక్కరోజు సమయం అడిగాడు..ఇక్కడ దినేష్ కి పెద్ద చిక్కొచ్చిపడింది.. తన తండ్రినే హత్య చేసిన వారికీ, వాళ్ళింట్లోని వారికి మంచి చెయ్యాలన్నది మంత్రి వుద్దేశ్యమైతే తన తల్లిని తండ్రిని నాశనం చేసి తనను అనాధను చేసిన వాడికి క్షమను అందివ్వడమా సరియైనదేనా అన్నదే యోచించ తగినది తలచి ఒక్కరోజు సమయం అడిగి వెనక్కి మరలాడు దినేష్ కుమార్, I.P.S..
(సశేషం)

No comments:

Post a Comment

Pages