ఇది నా దేశం - అచ్చంగా తెలుగు
ఇది నా దేశం
పావని యనమండ్ర


ఎవరిది ఈ నేల?

ఏ తల్లి కన్నది ఏ వేళ ?

పూర్వము దీన్ని పరిపాలించెను  ఒక రాజు
ఆనందం అంచులలో సాగేను ఆ రోజు.

ఈనాడు యుద్ధ భేరి ప్రకటించెను ప్రజలు
ఇవి ఎవరి నెత్తుటి కన్నీటి రాతలు?

మనం అన్న మాటే మరిచి
"నా" అన్న అహంకారమే తెరచి
శ్రుంఖలాల బంధనాలు విరిచి
ఎక్కడికి నీ పరుగు?
ఏ చోటకి నీ పయనం?

మనస్సు కుదుట పరిచి ఆలోచించు!
అర్ధమే అందులో ఉంది పరిశీలించు!

పోరాడేరు ఆనాడు మన దేశం కోసం ఒకనాడు!
దానినే పదిల పరచు ఈనాడు.

శాంతి అన్న మాటను కాపాడు
ఇది నా దేశం అన్న మాటను మరువకు ఏనాడూ!
అదే ఈ దేశం మన
భారతదేశం!

No comments:

Post a Comment

Pages