ఓ భూమిపుత్రా!! - అచ్చంగా తెలుగు
ఓ భూమిపుత్రా!!
పాలగుమ్మి లత 


ఎండనకా, వాననకా చెమటోడ్చే ఓ భూమిపుత్రా!!

పండించటానికి నీరు లేక, సకాలంలో వర్షం రాక

పండిన పంట చేతికి వచ్చే వరకు

నువ్వు పడే కష్టం ఎవరికి తెలుసు?? ఎవరికి తెలుసు??

వరుణదేవుని కరుణ కోసం

ఆకాశం కేసి ఆశగా చూసే ఓ పుడమి తనయా!!

ప్రకృతి ప్రకోపానికి గురై చేతికందని పంట, కూలిపోయిన ఆశా సౌధం

నువ్వు పడే కష్టం ఎవరికి తెలుసు?? ఎవరికి తెలుసు??

నీ వలన ప్రపంచమంతా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండె

నీవు పడే కష్టంతో మా కడుపులు నిండె

ప్రపంచంలో నీ ఉనికే లేకపోయె

ఓ ధరణీ పుత్రా!! నువ్వు పడే కష్టం ఎవరికి తెలుసు?? ఎవరికి తెలుసు??

అదిగో సంక్రాంతి వచ్చె!! అదిగో సంక్రాంతి వచ్చె!!

పంట చేతికి వచ్చె, పడిన కష్టం తీరె

పురి నిండా ధాన్యం, పిల్ల పాపలకు క్రొత్త బట్టలు

అని ఆశగా చూసే ఓ రైతన్నా!!

పంట చేతికి రాక ఋణబాధలు తీరక దిక్కే తోచక

చావే శరణ్యమని బ్రతుకు చాలిస్తున్న....

ఈ రైతన్న ఆత్మ హత్యలకు ఎవరు బాధ్యులు?? 

ఎవరు బాధ్యులు?? ఎవరు బాధ్యులు??

  *****


No comments:

Post a Comment

Pages