శ్రావణ గురువార వ్రతం...పౌడర్ డబ్బా నోము - అచ్చంగా తెలుగు

శ్రావణ గురువార వ్రతం...పౌడర్ డబ్బా నోము

Share This

 శ్రావణ గురువార వ్రతం...పౌడర్ డబ్బా నోము  

 కసవరాజు కృష్ణ  మోహన్
ఉదయన్నే లేచిన అప్పారావు హడావుడి గా వెతికేస్తున్నాడు..చిరాకు పడుతున్నాడు మొన్న tailor దగ్గర కుట్టించుకున్న ప్యాంటు దానికి మాచింగ్ చొక్కా కనపడలేదని..వాళ్ళావిడ చీరల మధ్య చిక్కుకొని వుంటే బయటకు తీసాడు ఐరన్ చేసి లేదేమో బజ్జి తిని పారేసిన పేపర్ లా తగలడింది అది.. ఎదో ఒకటి అనుకుంటూ గబా గబా పక్కన పెట్టుకొని పల్లుతోముకొని..స్నానానికి వెళ్ళాడు.

రెండు చెంబులు కుమ్మరించుకున్నాక గుర్తొచ్చింది..షాంపూ మర్చిపోయానని..గట్టిగ కేక పెట్టాడు షాంపూ ఇవ్వమని ..జుట్టు వుంటే షాంపూ కార్టూన్ లో వేసిన వెంట్రుకుల్ల వుంటే నీళ్ళు చాలు రండి అంది అనసూయ అప్పారావు వాళ్ళావిడ.. సరే ఎలాగోలా ముగించి బయటకు వచ్చి రెడీ అయ్యాక ..సోఫా అటు ఇటు జరుపుతూ హడావుడి పడుతున్నాడు.. తీరిగ్గా లేచిన వాళ్ళావిడ ఏమిటి మీ హడావుడి అని అడిగింది..అదేంటే అలా అంటావు ఇవాళ శ్రావణ గురువువారం ..ముత్తారువులు అందరికి పండగ ...దీనినే పౌడర్ డబ్బా నోము అని కొన్ని ప్రాంతాల్లో అంటారు అని వివరించాడు. 

ఆసక్తి గా అనసూయ శ్రావణ శుక్రవారం ఎప్పుడో మా అమ్మమ్మ లా కాలం లో చేసేవారట ఈ నోము మా తాతయ్య ..అంకుల్ వాళ్ళు చెయ్యలేదే అంది.. సంస్కృతి సాంప్రదాయం తెలీని పిచ్చి పిల్ల అనుకోని తన మొహం తనే అద్దం లో చూసుకుంటూ లోపల లోపాల దుఖించాడుబాధ పడుతూ ఇప్పుడు ఒక పదహారు మందికి పౌడర్ డబ్బాలు పంచాలి అందరు వస్తారు నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పాడు..రోజు పళ్ళు తోమడమే కష్టం ఐన అనుసూయ సరేలే అంటూ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంది.


ఎవరికీ తప్పిన మనకు తప్పదు అనుకోని అప్పారావు .. తెచ్చిపెట్టుకున్న పౌడర్ డబ్బాలను వరసగా పేర్చి గుమ్మం కేసి చూస్తున్నాడు ముత్తరువుల కోసం.. ఎదురగా వున్నా రాజరావు గారు వచ్చారు రండి రండి అన్నయ్య గారు కూర్చోండి అంటూ షర్టు సర్దుకుంటూ వెళ్లి కూర్చోబెట్టారు.....ఒక ముగ్ తో నీళ్ళు తెచ్చి ముందుగా మొహం కడిగి..చింపిరి టర్కీ టవల్ తో మొత్తం తుడిచి ఆ పైన శాంపిల్ గ కొంచం పౌడర్ అతని చేతికిచ్చి ఇతని చేతిలో కొంచం పౌడర్ వేసుకొని ఒకరు వేస్తినయ్య పౌడర్ అంటే ఇంకొరు ఇస్తినయ్య పౌడర్ అంటూ ఇద్దరి మొహాలకు పులుముకున్నారు..  ....రావు గారి మొహానికి తడి పోక పౌడర్ పుయ్యడం వళ్ళ మొహం పూతరేకుల్ల తయారైంది...వస్తానండి అని బయలుదేరుతున్న రామారావు కి అలాగే అన్నయ్య గారు అంటూ ...ఇంకో పదిహేను మంది రావాలి ఈ పౌడర్ డబ్బాల నోము పూర్తు చెయ్యాలి అని ఆలోచనలో మునిగిపోయాడు అప్పారావు. 

ఒకవేలా అందరు రాకపోతే అలా  టీ బుంక్ దగ్గరికి వెళ్లి పాండ్స్ పౌడర్ లు పంచి పెట్టాలని పంచ కచ్చ పంచ ధరించి మరీ ప్రతిజ్ఞ పూనుకున్నాడు కనుక పంచేస్తాడు లెండి ఎవరైనా! 

ఈ నోము ఎవరైనా  ఆచరించవచ్చు కాకపోతే ఆడవారి కి చెప్పి ఈ నోము నోచుకుంటే పదికాలాలు పౌడర్ లు పూసుకుంటూ ఉండొచ్చు వారికేమిటి చెప్పడం అనుకుంటే....మీ ఇష్టం.. నమస్కారం.                                                        ***


No comments:

Post a Comment

Pages