కుజ గ్రహ కారకత్వాలు మరియు ఫలితాలు - అచ్చంగా తెలుగు

కుజ గ్రహ కారకత్వాలు మరియు ఫలితాలు

Share This

                                    కుజ గ్రహ కారకత్వాలు మరియు ఫలితాలు

                                                                                                                                  PSV రవికుమార్ 


ఈ పాఠం లో కుజ గ్రహ కారకత్వాలు, కుజుడు ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం.

కుజుడు మేష, వృశ్చిక రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. మృగశిర, చిత్త, ధనిష్ట  నక్షత్రాలకు, కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. పైన చెప్పిన మూడు నక్షత్రాలలో ఎవరైతే జన్మిస్తారో, వారి జీవితం కుజ మహాదశ తో ప్రారంభం అవుతుంది .

కుజ గ్రహం, కోపానికి, ఆవేశానికి, రక్త సంబందిత వ్యాధులకు, వైద్య విద్య కు, అందులోను సర్జన్లుగా ఉండటానికి కుజుడు కారకుడు.

కొన్ని స్థానాలలో కుజుడు ఇంజనీరింగ్ విద్య కూడా ఇస్తాడు. కుజుడు భూమి కారకుడు, వైవాహిక సమస్యలకు కారకుడు, మిలిటరీ, పోలీస్ వృత్తులకు కారకుడు, 

కుజ గ్రహానికి మకర రాశి ఉచ్చ క్షేత్రమయితే, కర్కాటకం నీచం అవుతుంది. కుజుడు ఉచ్చ లో ఉంటే, విద్య రంగం లో క్రీడా రంగం లో ముందంజ లో ఉంటారు. క్రీడా రంగం లో కూడా విజయాలను సాధిస్తారు.

లగ్నం లో కుజ ఉంటే ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, దుందుడుకుతనం ఉంటుంది. విద్య లో ఎప్పుడు ముందంజలో ఉంటారు.

ద్వితీయం లో కుజ ఉంటే, ఇది కుజ దోషం గా పరిగణీస్తారు (స్వక్షేత్రం, ఉచ్చ క్షేత్రం అవ్వకపోతే). వీరి మాట తీరు గొడవలకు దారితీసేలా ఉంటుంది. స్వరం బిగ్గరగా ఉంటుంది. వీరి మాట తీరు వలన కుటుంబం లో తగదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 

తృతీయం లో కుజ ఉంటే, వీరు సమాజం లో ఎప్పుడు ముందంజ లో ఉండాలని అన్ని రంగాలలో ముందుండాలని కృషి చేస్తారు. ఆవేశం గా నిర్ణయాలు తీసుకుంటారు. పదునైన వస్తువుల వ్యాపారం చేస్తారు లేదా వాహనాల వ్యాపారం, వాహనాల రిపేర్ వంటి వృత్తులు చేయవచ్చు.

చతుర్ధం లో కుజ ఉంటే, ఇది కూడా కుజ దోషం గా పరిగణిస్తారు. వివాహం ఆలస్యం అయ్యే సూఛనలు ఎక్కువ. గృహం లో ఎదో ఒక గొడవ వచ్చే అవకాశం. తల్లికి అనారోగ్యం లేదా తల్లి లేదా తల్లి తరపు వారితో ఎప్పుడు గొడవలు. స్కూలు విద్య లో తోటి విద్యార్దులతో తగవులు. విద్య లో మంచి ర్యాంకులు సాధిస్తారు.

పంచమం లో కుజ ఉంటే, తెలివి తేటలు అమోఘం. సంతాన సంబందిత సమస్యలు, ఆలస్య సంతానం. వ్యాపారానికి అనుకూలం కాదు.

షష్టమం లో కుజ ఉంటే, వైద్య వృత్తి లేదా తత్సమాన రంగాలలో వృత్తులలో రాణింపు. పోటీ పరీక్షలో విజయాలు.  

సప్తమం లో కుజ ఉంటే, ఇది కూడా కుజ దోషమే. వివాహం ఆలస్యం. వైవాహిక జీవితం లో ఆనందం లేక పోవుట.జీవిత భాగస్వామి తో తరచూ గొడవలు లేదా ఎదో ఒక సందర్భం వలన భార్యా భర్తల మధ్య ఎడబాటు.

అష్టమం లో కుజ ఉంటే, ఇది కూడా కుజ దోషమే. జీవిత భాగస్వామికి ఎప్పుడూ ఎదో ఒక అనారోగ్యం. ఆకస్మిక లాభాలు, నష్టాలు కలగవచ్చు. లాటరీ వంటివి కూడా దక్కవచ్చు. వైద్య వృత్తి లో రాణిస్తారు, సర్జన్లు గా పేరు ప్రఖ్యాతలు పొందుతారు.. 

భాగ్యం లో కుజ ఉంటే, ఉన్నత విద్య లో రాణిస్తారు, మంచి మార్కులు సాధిస్తారు. ఉద్యోగం లో ఎప్పుడూ ముందంజ లో ఉంటారు. లీడర్షిప్ క్వలిటీస్ ఉంటాయి. 

రాజ్యం లో కుజ ఉంటే, ఉద్యోగం లో కొంత దుడుకు తనం ఎక్కువగా ఉంటుంది. త్వరగా లీడర్లుగా ఎదుగుతారు. వీరి మాట తీరు వలన ఇతర ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు. పోలీస్, మిలిటరీ వృత్తులలో కూడా రాణిస్తారు.

లాభం లో కుజ ఉంటే, ఇంజనీరింగ్ వృత్తులలో ఉద్యోగం చేస్తారు. రియల్ ఎస్టేట్ వలన లాభాలు, భూ లాభాలు. వాహనాల వలన లాభాలు.

వ్యయంలో కుజ ఉన్న, ఇది కూడా కుజ దోషమే. దీని వలన భార్యా భర్తల మధ్య ఎడబాటు ఏర్పడే అవకాశం ఎక్కువ. జైలర్లు గా లేదా సర్జన్లు గా వృత్తి చేబడతారు. 

కుజ గ్రహం రాహు గ్రహం తో కలిస్తే నాగ దోషం గా చెప్ప బడింది. దీని వలన జీవితం లో ఎదుగుదల ఉండదు. సంతాన సంబందిత సమస్యలు, వైవాహిక సమస్యలు, ఆర్దిక సమస్యలు ఉండచ్చు.

వీటి కోసం ప్రతి మంగళ వారం నాగులకు లేదా సుబ్రమణ్యేస్వర స్వామికి పూజ చేయాలి. కుదిరిన నాగ ప్రతిష్ట చేయించిన మంచిది.

నిత్యం సుబ్రమణ్యేస్వర స్వామిని లేదా నాగ దేవత ను కొలవాలి.  ఎరుపు రంగు ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

ఎవరికయినా జాతకం తెలుసుకోవాలంటే నన్ను కన్సల్ట్ చేయవలసిన నంబర్ 911 304 8787 . కన్సల్టేషన్ చార్జస్ వర్తిస్తాయి.

***

No comments:

Post a Comment

Pages