కాఫీ దురలవాటును మానాలనుకుంటున్నారా? - అచ్చంగా తెలుగు

కాఫీ దురలవాటును మానాలనుకుంటున్నారా?

Share This

కాఫీ దురలవాటును మానాలనుకుంటున్నారా?

అంబడిపూడి శ్యామసుందరరావు 

కాఫీలో కెఫీన్ అనే పదార్ధము ప్రేరణను కలిగిస్తుంది అంతే  కాకుండా కొద్దిగా అడిక్టివ్ అయి ,అంటే వ్యసనంగా మారే లక్షణము కూడ ఉంది చాలా మందికి ఉదయాన్నే కాఫీ త్రాగకపోతే దినచర్య మొదలు అవదు త్రాగకపోతే తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.చాలా మంది కాఫీకి అలవాటు పడ్డ వాళ్ళు మానాలని తీవ్రమైన ప్రయత్నాలు చేసి కుదరక ఆ ప్రయత్నాలే  మానుకుంటారు.కాఫీ మొదట్లో త్రాగటం అలవాటు చేసుకుంటే నాడీ  వ్యవస్థ ఉత్తేజితము అవుతుంది క్రమమంగా కాఫీ అలవాటు చాలా మందిలో వ్యసనంగా మారుతుంది.పొద్దున్నే నిద్రలేచిన వెంటనే కాఫీ త్రాగాలని బలమైన కోరిక ఉన్నా, త్రాగలేకపోతే చాలా అసౌకర్యము ఫీల్ అవుతున్న మీకు  కాఫీ అనే అలవాటు వ్యసనంగా మారినట్లే.ఈ రకమైన వ్యసనము ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్లు చెపుతుంటారు.తక్కువ మోతాదులలో కెఫీన్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువ మోతాదుల్లో అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరము.ఉదాహరణకు ఎక్కువ కెఫీన్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. కాలేయము శరీరములోని విషపదార్ధాలను ఫిల్టర్ చేయనివ్వదు. పళ్ళు పుచ్చిపోవటానికి దోహదపడుతుంది.ఎముకలు బలహీనపడతాయి. ఆందోళన పెరుగుతుంది తలా నొప్పికి కారణమవుతుంది.నిద్రకు భంగము వాటిల్లుతుంది ఇవి కొన్ని మాత్రమే ఆరోగ్యానికి కలిగే నష్టాలు.
కెఫీన్ ను తగ్గించాలి అనుకున్నప్పుడు కెఫీన్ కలిగి ఉండే ఇతర ఉత్పత్తుల గురించి  మరియు విత్ డ్రాయల్ లక్షణాలను కూడా తెలుకోవాలి. కెఫీన్ కాఫీ లో మాత్రమే కాకుండా టీ ,బేక్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్. చాకొలేట్, చూయింగ్ గమ్ లాంటి వాటిలో కెఫీన్ ఉంటుంది. విత్ డ్రాయల్ లక్షణాలు ఏమిటి అంటే అలసట,నిస్సత్తువ, డిప్రషన్, తలనొప్పి,నిద్రలేమి, ఏకాగ్రత లోపించటం, మలబద్దకం మొదలైనవి.కానీ వీటి గురించి అంతగా భాధ పడనవసరం లేదు,కొన్ని చిట్కాలను ఉపయోగిస్తూ ఈ లక్షణాలను అధిగమించవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాము వాటి వల్ల కాఫీ అనే వ్యసనాన్ని మానుకోవచ్చు.
1ఘాఢముగా శ్వాస తీసుకోవటం అలవాటు చేసుకోవాలి:- కెఫీన్ యొక్క విత్ డ్రాయల్స్ తో పోరాడటానికి ఈ విధమైన ఘాడ శ్వాస తీసుకోవటమని సాధన బాగా పనికి వస్తుంది. అంటే ఈ విధమైన ఘాడ శ్వాస వలన శరీరములోని విష పదార్ధాలు కూడా తొలగింపబడతాయి. ఘాడ శ్వాస ఎలా తీసుకోవాలంటే మొదట వెల్లకిలా పాడుకోవాలి రెండు చేతులను మీ కడుపు మీద ఉంచుకొని కండరాలను రిలాక్స్ చేయాలి. ముక్కు ద్వారా గాలిని గట్టిగా పీలుస్తూ యూదారాన్ని ఎక్స్పాన్డ్ చేస్తూ ఊపిరితిత్తుల్లోకి 1 నుండి 5 వరకు లెక్కపెడుతూ గాలిని నింపి  కొంచెము సేపు గాలిని నిలపాలి ఈ సారి ఐదు లెక్కపెడుతూ గాలిని బయటకు వదలాలి ఈ విధముగా పది నిముషాల పాటు చేయాలి. పడుకొనే చేయాలి అన్న రూల్ ఏమి లేదు అవకాశము లేకపోతె కూర్చుని చేయవచ్చు రోజు మొత్తము మీద వీలున్నప్పుడు ఈ విధముగా ఘాఢముగా శ్వాస తీసుకోవటం ప్రాక్టీస్ చేయాలి.  
2.అధికముగా నీరు త్రాగండి.ఏ విధమైన ఎడిక్షన్ ట్రీట్ మెంట్ కైనా నీరు ఎక్కువగా త్రాగటం చాలా అవసరము.కాఫీ ఎడిక్షన్ మానుకోవటానికి కూడ నీరు ఎక్కువగా త్రాగటం అవసరము. శరీరములో అధికముగాఉన్న కెఫీన్ బయటకు పోవటం మూత్రము ద్వారానే కాబట్టి శరీరములోని మలినాలు లేదా విషాలు బయటకు పోవాలంటే నీరు త్రాగటం అవసరము. మనము ఎంత నీరు త్రాగాలనేది మన ఆరోగ్యము వాతావరణము మనము చేసే పనులు మొదలైన వాటి మీద ఆధార పడి  ఉంటుంది.ఏది ఏమైనా చాలా మందికి 8 నుండి 10 గ్లాసుల నీరు రోజు మొత్తములో అవసరము.
3.సరిపడినంత నిద్ర పోవటం:-  కాఫీ దురలవాటును మానుకోవటానికి మంచి నిద్ర కూడా ఉపయోగపడుతుంది. నిద్రపొవాటానికి ముంది కాఫీ త్రాగితే అది నిద్రను బ్లాక్ చేస్తుంది అంటే నిద్ర రాదు అందుకే మీరు గుర్తించారో లేదో విద్యార్థులు పరీక్షలప్పుడు నిద్ర రాకుండా ఉండటానికి కాఫీలు టీలు త్రాగుతుంటారు. ఇవి బ్రెయిన్ లోకి కొన్నిరసాయనాలను పంపి నిద్రను బ్లాక్ చేస్తాయి.ఈ రసాయనాల వల్ల అడ్రినాలిన్ ఉత్పత్తి పెరిగి నిద్ర రాదు. దానికి బదులు సరిగా నిద్రపోవటానికి చేసే ప్రయత్నాలు కెఫీన్ మీద ఆధారపడకుండా చేస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన నిద్ర మంచిది. అంటే వేలకు నిద్రపోవటం వేలకు నిద్రలేవటము లాంటి రెగ్యుల సైకిల్ అలవాటు చేసుకోవాలి. అలా చేస్తే కాఫీ అవసరము ఉండదు.ఉదయానే లేచి కాఫీ త్రాగవచ్చు. 
4.గ్రీన్ టీ కి మారండి:- వేడి వేడి గా ఏదైనా త్రాగలనిపించినప్పుడు కాఫీకి బదులుగా గ్రీన్ టీ త్రాగండి. గ్రీన్ టీ లో మాములుగా కాఫీ లేదా బ్లాక్ టీ లో ఉండే కెఫీన్ కన్నా తక్కువ ఉంటుంది.అదనంగా గ్రీన్ టీ లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికముగా ఉంటాయి. ఇవి హానికరమైన విషపదార్ధాలు శరీరము నుండి తొలగించటానికి ఉపయోగపడతాయి. ఫలితముగా కెఫీన్ తీసుకోవటం తగ్గుతుంది.కాఫీ కి బదులుగా 4 లేదా 5 కప్పుల గ్రీన్ టీ త్రాగిన ఫరవాలేదు.
5.వ్యాయామము అలవాటు చేసుకోండి:-వ్యాయామము చేస్తూ ఉంటె శరీరములో ఎండోర్ఫిన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి ఇవి తలనొప్పిని అదుపు చేస్తాయి.   అలాగే అలసట కూడా కెఫీన్ విత్ డ్రాల్ సేడ్ ఎఫెక్ట్ ఒక ముప్ఫై నిముషాల వ్యాయామము యాక్టివ్ గా ఉండటానికి తోడ్పడుతుంది.
6 మెగ్నీషియం సప్లిమెంటలను తీసుకోవటం అలవాటు చేసుకోండి:- ఎక్కువగా కాఫీ త్రాగాలన్న కోరిక మెగ్నీషియము లోపముతో ముడి పడి ఉన్నది అందువల్ల మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవటము ద్వారా ఈ లోపమును సరిదిద్దుకోవచ్చు. ఆకలి మందగించటం, కండరాల బలహీనత, నిద్ర సరిగా పట్టకపోవటం,తలనొప్పి వంటి విత్ డ్రాయల్ సీంప్తమ్స్ తో పోరాడటానికి మెగ్నీషియం బాగా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకొనే ముందు డాక్టర్ ను సంప్రదించండి.ఎవరైనా గుండె లేదా మూత్రపిండాల జబ్బులతో బాధపడుతున్నా లేదా ఏదైనా మందులు వాడుతున్నా సప్లిమెంట్లు తీసుకోకుండా మెగ్నీషియం అధికముగా ఉండే ఆహారపదార్ధాలను అంటే అరటి పండ్లు బాదం పప్పులు బీన్స్ గుమ్మడికాయ విత్తనాలు సొయా మిల్క్, జీడిపప్పు లాంటివి తీసుకోవాలి. 
7. హెర్బల్ టీ ని ప్రిఫర్ చేయండి:-హెర్బల్  టీ లేదా హెల్తీ జ్యుసెస్ (పండ్ల రసాలను) ను కాఫీకీ బదులుగా తీసుకోవటం మొదలు పెట్టండి.హెర్బల్ టీ లలో అనేక రకాల టీలు ఉన్నాయి వాటిని ప్రయత్నించండి.హెర్బల్ టీలు నచ్చకపోతే చాలా రకాల పండ్ల రసాలను మిక్స్ చేసి  ట్రై చేయండి.
8.ప్రోటీనులు అధికముగా ఉండే స్నాక్స్ తీసుకోండి:- సాధారనముగా బాగా అలసిపోయినట్లు అనిపించినప్పుడు గబగబా ఒక కప్పు తిరగాలని పిస్తుంది కానీ ఉదయానే ప్రోటీనులు ఆదికముగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే లేదా ఆలా అనిపించినప్పుడు ప్రోటీన్ రిచ్ స్నాక్స్ తీసుకోవాలి అలా చేస్తే కడుపు నిండుగా ఉండి శక్తిని రోజు మొత్తము వాడుకోవచ్చు.కాబట్టి రోజు గ్రుడ్లను లేదా నాట్స్ సీడ్స్ ను కాఫీకి బదులుగా  బ్రేక్ పాస్ట్ తో  తీసుకోండి.      
9.పిప్పరమెంట్ తీసుకోవటము పిప్పరమెంట్ ఆకులూ లేదా నూనె ఈ విషయములో స్నేహితుడిగా భావించవచ్చు వీటిని విత్ డ్రాయల్ తలనొప్పి నివారణకు వాడవచ్చు కెఫీన్ విత్ డ్రాయల్ వలన తలనొప్పి ఏర్పడితే ఒక చేతి రుమాలుపై కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఆయిల్ ను వేసి వాసన చూస్తూ ఉంటె ఫ్లీతము కనిపిస్తుంది. :ఈ పిప్పరమెంట్ ఆయిల్ వేసిన గుద్దను చెవి వెనుక లేదా మణికట్టుకు ఉంచుకోవచ్చు ఈ ఆయిల్ వాసన తలనొప్పిని తగ్గిస్తుంది.
10.జిన్ సెంగ్  అనే ఔషధీయ మొక్క కాఫీ మానెటప్పుడు ఏర్పడే విత్ డ్రాయల్ లక్షణాల ఫ్రిక్వెన్సీని తగ్గిస్తుంది ఇదిఎడ్రినల్ గ్రంథికి ఒక టానిక్ లాంటిది నిరోధక వ్యవస్థను సపోర్ట్ చేస్తుంది శరీరములో సరి అయినా బ్యాలెన్స్ ను తిరిగి కలుగజేస్తుంది.ముఖ్యముగా స్ట్రెస్ ఆందోళన ఉన్నప్పుడు. ఇది కెఫీన్ వలన బలహీన పడ్డ మూత్ర పిండాలను బలపరుస్తుంది కెఫీన్ తీసుకోవాలన్న కోరికను తగ్గించుకోవటానికి ఒక చెంచా జిన్ సెంగ్ పొడిని బ్రేక్ ఫాస్ట్ కు గాని లేదా పాలకు గాని కలిపి తీసుకోవచ్చు లేదా ఎండబెట్టిన జిన్ సెంగ్ ను చప్పరించండి.గుండె సమస్యలు ఉన్నవారు ,మధుమేహము  ఉన్నవారు,హార్మోనుల సెన్సిటివ్ కండిషన్ ఉన్నవారు షైజోఫ్రీనియా ఉన్నవారు దీనిని వాడకూడదు.   
అదనంగా కొన్ని సూచనలు : కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్ధాల లిస్ట్ తయారు చేసి గ్రాసరీ షాపింగ్ కు వెళ్ళినప్పుడు వాటిని అవాయిడ్ చేయండి. :  పూర్తిగా ఒక్కసారిగా మానకుండా కొద్దీ కొద్దిగా మానటం అలవాటు చేసుకోండి. అలాగే మీలాగా కాఫీ అలవాటు లేదా వ్యసనాన్ని మానాలనుకుంటున్నవారితో స్నేహము చేసి వారి ద్వారా కొత్త విషయాలు తెలుసుకొని వాటిలో మంచివి గ్రహించండి.  

***

No comments:

Post a Comment

Pages