ద్వందాతీత స్థితి - అచ్చంగా తెలుగు

 ద్వందాతీత స్థితి

రచన: సి.హెచ్.ప్రతాప్
  


యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ ।
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే

(భగవద్గీత 2 వ ఆధ్యాయం 15 వ శ్లోకం)

ఓ అర్జునా, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఃఖముల చే ప్రభావితం కాకుండా, రెండిటిలో చలించకుండా నిశ్చలముగా ఉన్నవాడు మోక్షమునకు అర్హుడవుతాడు అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం.

ఉన్నత ఆధ్యాత్మిక ప్రాప్తి కోసం స్థిర  నిశ్చయం కలిగి, సుఖ దుఖములు వంటి ద్వందాల తాకిడిని స్థిర చిత్తుడై సమానంగా ఎదుర్కొనగలిగినవాడే మోక్షానికి అర్హుడు అవుతాడు.నిజజీవితంలో వచ్చే కష్ట నష్టాలను ఎంత బాగా సహిస్తే అంత త్వరగా భగవంతుని కృపతు పాత్రులమై  మోక్షానికి అర్హత సంపాదిస్తాము. దీనినే సద్గురు సాయిబాబా వ్యవహారిక భాషలో సబూరీ అని అన్నారు. ఈ సాధన ద్వారానే మానవుల ఆధ్యాత్మికానుభవం సంపూర్ణం అవుతుంది.

జీవిత ప్రయాణం లో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు అనేక ద్వందాలు ఎదురవుతుంటాయి. మనకు సంతోషం కావాలి, కానీ దుఃఖం కలుగుతుంటుంది; మనకు జ్ఞానం కావాలి; కాని అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేము; పరిశుద్ధమైన ప్రేమని కోరుకుంటాము కాని పదేపదే స్వార్ధపూరితమైన ప్రేమ ఎదురవుతుంది.మన లౌకిక విద్య, సాంకేతికత  పాండిత్యములు జీవితం లో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు. మనకు జీవితపు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించటానికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితి లో ఉన్న నిజమైన గురువు లభించినప్పుడు, మనకు వారి నుండి నేర్చుకునే అణకువ, వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన నిధి తెరువబడుతుంది.ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు. మనం కూడా అర్జునుని మార్గంలో పయనించేందుకు స్థిర చిత్తంతో, ఏకాగ్రతతో ఒక సద్గురువుని సేవించాలి.


***

No comments:

Post a Comment

Pages