రవి గ్రహ కారకత్వాలు మరియు ఫలితాలు - అచ్చంగా తెలుగు

రవి గ్రహ కారకత్వాలు మరియు ఫలితాలు

Share This

 రవి గ్రహ కారకత్వాలు మరియు ఫలితాలు

 PSV రవి కుమార్ 




పాఠం లో రవి గ్రహ కారకత్వాలు, రవి ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం.

 

రవి సింహ రాశి కి ఆధిపత్యం వహిస్తాడు. కృతిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలకు, రవి ఆధిపత్యం వహిస్తాడు. రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. పైన చెప్పిన మూడు నక్షత్రాలలో ఎవరైతే జన్మిస్తారో, వారి జీవితం రవి మహాదశ తో ప్రారంభం అవుతుంది .

 

రవి గ్రహం, పటుదలకు,  శారీరక ఆరోగ్యానికి, అధిక కోపానికి కారకత్వం వహిస్తాడు. రవి గ్రహం జాతక వ్యక్తులు పట్టుదల తో ఏ పనినయినా ఎంత కష్టం వచ్చిననూ తలొగ్గకుండా పూర్తి చేస్తారు.  ప్రభుత్వ ఉద్యోగాలకు కారకుడు.

 

జన్మ జాతకం లో రవి గ్రహం బలం గా ఉన్నవారు, ఏ పనినయినా పూర్తి చేస్తారు, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి తో సత్సంబందాలు ఉంటాయి. తండ్రి ని రోల్ మోడల్ గా చేసుకుని, తండ్రి చేసే వృత్తిని కానీ, ఆయన అలవాట్లను కానీ అలవరచుకుంటారు.

 

రవి గ్రహం బాగుంటే విద్య లో రాణిస్తారు, బాల్యం నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకుంటారు. రవి గ్రహం బలం సంపుర్ణంగ ఉండి, మంచి స్థానాలలో ఉంటే రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. 

 

రవి గ్రహానికి మేష రాశి ఉచ్చ క్షేత్రమయితే, తుల నీచం అవుతుంది. రవి ఉచ్చ లో ఉంటే, నాయకులుగా, లేదా లీFడర్లు గా ఉంటారు, అదే నీచ పడితే, సేవకులుగా మిగిలిపోతారు.

 

రవి తే ఏ గ్రహం కలిసి ఉన్ననూ, అస్తంగత్వం అవుతుంది, అంటే కలిసిన గ్రహం, బలం కోల్పోతుంది. అదే బుధుడు కనుక కలిస్తే ఆ బలం కోల్పోదు, బుధాదిత్య యోగం కలుగుతుంది.

 

కానీ, రవి గ్రహమునకు, బుధ గ్రహమునకూ దూరం 12 డిగ్రీలు ఉండాలి, లేదంట్తే అది కూడా అస్తగత్వం అని అంటారు. 

 

 

 

రవి కి బుధునికి మద్య 14 డిగ్రీ ల పైన దూరం ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు
రవి కి చంద్రుడి కి మద్య దూరం 12 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు

రవి కి కుజుడు కి మద్య దూరం 17 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు

రవి కి శుక్రుడు కి మద్య దూరం 10 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు

రవి కి గురుడు కి మద్య దూరం 11 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు

రవి కి శని కి మద్య దూరం 15 డిగ్రీ ల పైన ఉంటే అస్తంగత్వ దోషం ఉండదు.

 

లగ్నం లో రవి ఉంటే పట్టుదల ఎక్కువ, తాను అనుకున్న పనిని ఎట్టిపరిస్తితులలోను పూర్తి చేస్తారు. త్వరగా కోపం వస్తుందీ కానీ, ఆ కోపం ఎక్కువ సేపు ఉండదు.

 

 

ద్వితీయం లో రవి ఉంటే, కుటుంబం లో అందరి పైనా పెత్తనం చూపుతారు, అందరు తమ మాట వినాలి అనే తత్వం కలిగి ఉంటారు. మాట తీరు కఠినంగా డామినేటింగ్ గా ఉంటుంది. ధన సంపాదన బాగానే ఉంటుంది.

 

తృతీయం లో రవి ఉంటే, రాజకీయ సంబందిత ఉపన్యాసాలు ఇస్తారు.  ఎక్కడ ఉన్న తమ డామినేషన్ చూపుతారు. వాగ్దాటి బాగుంటుంది, మార్కెటింగ్ లో లీడర్లు గా ఉంటారు.

 

చతుర్ధం లో రవి ఉంటే, తల్లి తో తరచూ వాదనలు చేస్తారు. వాహనములు వేగంగా నడుపుతారు. స్కూల్లో లీడర్లు గా ఉంటారు, పరీక్షలలో మంచి మార్కులు సాదిస్తారు.

 

పంచమం లో రవి ఉంటే, జ్ఞానవంతులుగా ఉంటారు. సంతాన సంబందిత సమస్యలు ఎక్కువా ఎదురుకుంటారు.

 

షష్టమం లో రవి ఉంటే, వైద్య సంబందిత వృత్తి చేపట్టే అవకాశాలు ఎక్కువ. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విదేశాలకు వెళ్ళు అవకాశాలు ఎక్కువ.

 

సప్తమం లో రవి ఉంటే, జీవిత భాగస్వామితో తరచూ గొడవలు, మనస్పర్దలు ఉంటాయి. సప్తమం లో రవి గ్రహం ఉన్న, పెళ్ళి విషయం లో జాతక పొంతన చేసుకుంటే వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి పై పెత్తనం చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. 

 

అష్టమం లో రవి ఉంటే, వైద్య రంగం లో వృత్తి చేపట్టిన లేదా తత్సమాన వృత్తి చేపట్టీన విజయవంతం అవుతారు. తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అత్తగారింటి వారితో గొడవలు ఉంటాయి.

 

భాగ్యం లో రవి ఉంటే, తండ్రి చేసే వృత్తి పై లేదా తండ్రి చదివిన రంగ< లో నే ఉన్నత విద్య చేస్తారు. తండ్రి ని ఆదర్శంగా తీసుకుంటారు. విదేశాలకంటే, స్వదేశం లో నే ఉన్నత విద్యనభ్యసిస్తారు.

 

రాజ్యం లో రవి ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశాలు చాలా ఎక్కువ. రాజకీయాపై ఇష్టం కలుగుతుంది.

లాభం లో రవి ఉంటే, రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. వైద్య సంబందిత వ్యాపారాలు చేస్తారు. ధన లాభం బాగుంటుంది. ప్రభుత్వ రంగ కాంట్రాక్టరు గా పని చేస్తారు.

వ్యయంలో రవి ఉన్న, వైద్య లేదా తత్సమాన వృత్తి చేపడతారు. తరచూ అనారోగ్యాలకు గురి అవుతారు. ప్రభుత్వ జరిమానా తరచూ కట్టవలసి రావచ్చు. కారాగారాలకు వెళ్ళవలసి రావచ్చు. విదేశీ అవకాశాలు తక్కువగా వస్తాయి. చేయు పనులయందు వైఫల్యాలు ఎక్కువ..

 

రవి నుండి మరిన్ని శుభ ఫలితాలకోసం నిత్యం సూర్యాష్టకం పఠించుట, లేదా వినుట. మీ ఇంటి ఆచారాలను పాటించండి. గోధుమలు, బెల్లము దేవాలయం లో దానం ఇవ్వండి.

 

ఎవరికయినా జాతకం తెలుసుకోవాలంటే నన్ను కన్సల్ట్ చేయవలసిన నంబర్ 911 304 8787 . కన్సల్టేషన్ చార్జస్ వర్తిస్తాయి.


***

No comments:

Post a Comment

Pages