శివం - 89 - అచ్చంగా తెలుగు

శివం - 89

 రాజ కార్తీక్ 

(హరసిద్దు శిల్పం చెక్కటం మొదలుపెట్టాడు.. తన ఎదురుగా సాక్షాత్తు నేనే కూర్చుని ఉన్నాను)..

నన్ను ఆ విగ్రహంలో అచ్చు దింపుతున్నాడు హరసిద్ధుని కళ్ళను చూసి నేను ఎంతో మురిసిపోయాను.. తన కళ్ళలో తీవ్రమైన ఆనందం తీవ్రమైన బా వో ద్వేగం, వాల్మీకి రామాయణం రాసినప్పుడు, వ్యా సుడు భారతం రాసినప్పుడు, గొప్ప గొప్ప భక్తులు తీవ్రమైన ఆర్తితో సంకీర్తన చేసినప్పుడు, వేల ఏళ్లుగా తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు . ఇలాంటి కళ్ళని నేను గమనించాను.. హరసిద్ధుడికి ఇప్పుడు మనసులో ఉన్నది తాను శివరాత్రి రోజు సూర్యోదయానికి. భౌ తిక తనువు చాలించబోతున్నాడని, తను అనుకున్నది తన జీవితంలో ఏమీ చేయలేకపోయాడని.. తన యదార్ధ వాదం వల్ల.. ఆఖరికి.. సగం అనాధ అయ్యాడని.. తనను ఎంతో ప్రేమించే తన నాయనమ్మ కోరిక మేరకు కేవలం నా విగ్రహాన్ని మాత్రం చెక్కి రూపకల్పన చేసి.. తన కలని అజరామరంగా ఈ భూమిలో వదిలి పెడదామని మాత్రమే.. తనకి ఎవరి మీద ప్రేమ గాని  పగ గాని ఎవరిమీద పంతం గాని పట్టుదల కానీ ఎవరిమీద ఆశ గాని ని రాశగాని.. దేని మీద కోరిక గాని.. దేని మీద మోహo గాని.. ఏమీ లేవు..

ఉన్నదల్లా ఒక్కటే.. నన్ను చేరుకునే అదే నన్ను చెక్కుకునే గమ్యం.. పూర్తిగా భావ రహితుడయ్యాడు,


హర సిద్ద "స్వామి! మహాదేవుడివి దేవాది దేవుడివే కానీ.. నీ అందం చాలా చక్కగా ఉంది అయ్యా.. ఎప్పుడు విరాగిలాగా సన్యాసి లాగా.. విష సర్పాలను వేసుకొని.. ఉంటావని అందరూ అంటారు లే కానీ... అప్పుడప్పుడు మహావిష్ణువు లాగా కొంచెం అలంకరించుకో అయ్యా.. తల్లి పార్వతి ఎట్లా పడుతున్నావమ్మా ఈయనతో.. ఎందుకు ప్రేమ చూపిస్తాడు ఎందుకు పరుషం చూపిస్తాడో  తెలియదు.. పిలిస్తే వస్తా అంటాడు ఎంత పిలిచినా రాడు.. అంత అయ్యాక వస్తాడు. అనుకున్నది చేస్తాడు.. ఈ మహానుభావుడిని చేరుకోవటానికి నీకు కూడా కఠిన పరీక్షలు ఎదురయ్యాయి కదా.. జగన్మాతవి నీకే తప్పలేదు.. నీ పాదం కూడా తన గుండెల మీద మోపే కునే దాకా నిద్రపోలేదు, ఇక నేనెంత లే.. ఏదో నాకోసం వచ్చాడు నా చివరి క్షణంలో అని ఆనందం తప్ప.". అంటూ చమత్కారం చేశాడు


నేను "బాగు బాగుంది.. మీ భక్తులకు కళాకారులకు.. భావకత వల్ల. మీరు ఏమన్నా ఎట్లన్నా ఏం చేసినా భక్తిగా భావించవలసిన అగత్యం నాకు ఏర్పడింది కదా! ఏమి చేస్తాము భక్తి అనే ఒక బంధానికి భగవంతుడు భక్తుడు. భగవంతుడు బంధి అనే సూక్ష్మ బుద్ధిని మీరు గ్రహించారు కదా"


హార సిద్ద " కథలవాకయ్య దవడ సరిగ్గా రాదు కదలకుండా అంతే కూర్చో.."


నేను "హరసిద్ధ ముందు శరీరమంతా సరిగ్గా చూసుకొని చెక్కు.. చివరిలో మొహం చెక్కుదు గాని.. అర్థమవుతుందా"


హర సిద్దు "అలాగే స్వామి" అంటూ ఆ విగ్రహాన్ని నగీషగా చెక్కిన రాయి నీ. సరి చేసుకుంటూ సరి చూసుకుంటూ నన్ను ఆపదమస్తకం తరికిస్తూ, నేను తన ముందు ఎలా ఉన్నాను.. అచ్చం అలాగనే

. ఆ విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నాడు.. అవి అన్ని సమపాళ్లలో సరిగ్గా కుదురుతున్నాయి..


 హర సిద్దుడు.. ఏ స్తోత్రము ఏ కీర్తన ఏ గద్యము లేని శివ పూజ శివుడి యందే చేస్తున్నాడు.. అవును.. పూర్తిగా నా రూపమునందు లీనమై లింగారాధన చేస్తున్నాడు.. తాను శిల్పాన్ని చెక్కుతూ ఉండగా.. చిన్న చీమ ఒకటి కనపడింది..


హర సిద్దు "శివుడు ఆజ్ఞ లేదు చీమైనా కొట్టదు.. అలాంటివి ఈ చీమను నేను చంపుతానా అని పక్కకు వేశాడు.."


రేపు చనిపోతాను అని తెలుసుకున్న హార సిద్దు తెలిసి గాని తెలియక గాని ఏ తప్పు చేయి తలుచుకోలేదు.. భక్తులారా మంచి పనులు చేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు  రేపే మన చివరి రోజు అనే స్పృహతో ఉండి... ధర్మమైన సంపాదన వచ్చేటప్పుడు ఇంకొక వెయ్యి సంవత్సరాలు బతుకుతామేమో అనే స్పృహ లో ఉండాలి అప్పుడు మానవుడు ఏ తప్పు చేయటానికి బుద్ధి పుట్టదు..


సమయం దాటిపోతూనే ఉంది అలసట లేని హరసిద్ధుడు.. చంద్రోదయమైనప్పటికీ కూడా.. నా నుండి వచ్చే కాంతిని  నన్నే చెక్కుట కు వాడుతున్నాడు..

అలా హరసిద్ధుడు నాతో మాట్లాడుతు.. తత్వ జ్ఞాన. ఆత్మ జ్ఞాన, యోగ జ్ఞాన, రాజ్య పాలన జ్ఞాన. విషయాలని అతని మెదడులోకి ఎక్కించాను..


నా మొహం తప్ప.. నేను ఎలా అయితే తన ముందు కూర్చున్నాను అచ్చం అలానే నా విగ్రహాన్ని సిద్ధం చేశాడు.. ప్రపంచ స్థాయి కళాకారుడతను.. ఆ విగ్రహాన్ని చూస్తూ నాదైనప్పటికి కూడా శభాష్ అని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను


హర సిద్దు "అయినా మరో సూర్యోదయం అయితే సరికి నేనే ఉండను స్వామి నాకు ఎందుకు ఈ జ్ఞానాలు ఇవన్నీ" 


   నేను" సూర్యోదయం అయ్యిందా.. నీతో మాటల్లో పడి నీ కళ ను చూసి విషయమే మర్చిపోయాను హరసిద్ధ" 


హర సిద్దు "ఇక మొహం ఒక్కటే స్వామి.. తమరి అందమైన ఈ మొహాన్ని చూసినవారు, మూర్ఖులే కదా నిరాకర దైవాన్ని ప్రార్థించేది, ఈ శివయ్య ఇంత అందంగా ఉన్నాడు అని అనుకునే విధంగా తీర్చిదిద్దుతా" అంటూ వచ్చి తన్మయత్వంతో తన రెండు చేతులతో నా మొహాన్ని పొదివి పట్టుకొని ఆనందంగా చూస్తున్నాడు.."ఇప్పుడు నాకు కలుగుతున్న ఆనందాన్ని జన్మంతా ఉండేలా కరుణించు స్వామి.. ఏ ఆనందం ఇక అవసరం లేదు, ఏ బ్రహ్మానందం ఇక అవసరం లేదు, ఇదే నా చివరి రోజు నా చివరి రోజు ఇలా గడుస్తుందని ఏనాడు నేను అనుకోలేదు.. ప్రపంచంలో ఇది బహు అరుదు.. పోనీలే స్వామి నా నిజాయితీని నీతిని ప్రపంచ గుర్తించకపోయినా ప్రపంచాన్ని సృష్టించిన నీవు గమనించావు.. ఎవరేమనుకున్నా నీవు నాకోసం వచ్చావు చాలు, ఇది కూడా నా పితృదేవతల తప శక్తి ఫలమే.. శివరాత్రి రోజు శివుడిని చూస్తూ శివుడిని చెక్కుతూ.. శివుడి దగ్గరికి వెళ్ళిపోతాను"అంటూ పరిపూర్ణ యోగిలా మారిపోయాడు..


నేను తీక్షణంగా చూస్తూ "ఈరోజు శివరాత్రి కదా భక్తులు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ప్రతిచోట  సూక్ష్మంగా ఉంటాను.. హరసిద్ధ ఎంతోమంది భక్తులు మొన్న నీవు. బాగు చేసిన శివాలయంలో నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు.. నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ పూజలు అందుకోవాలని నాకు బుద్ది కావిస్తుంది.


ఎక్కడైతే హరసిద్ధుడి మీద నేరంమోప పబడిందో ఆ ఆలయమే.. ఇప్పుడు నేను చెబుతుంది..


హర సిద్దు "స్వామి మొహం ఒకటి చెక్కే దాకా ఉండు"అంటున్నాడు ఆందోళనగా..


నేను "లేదు హర్షిత నేను తక్షణమే అక్కడికి వెళ్లాలి అక్కడే ఉంటాను" అంటూ మాయమైపోయాను..

శివం - 89శివరాత్రి ఉదయం రోజు..


నేను మాయమవడంతో హరసిద్ధుడు ఖిన్నుడుయ్యాడు.


హరి సిద్దోడు ఏం చేయబోతాడు హరసిద్ధుడికి మిక్కిలిని ఆఖరి రోజు ఏం జరగబోతుందో చూద్దురుగాని...

(సశేషం)No comments:

Post a Comment

Pages