మనో దర్పణం! - అచ్చంగా తెలుగు

 'మనో దర్పణం!'

-సుజాత.పి.వి.ఎల్.


ఎందుకీ పరిహాసం
నువ్వూ నేనూ ఒకటేగా!
నీలో దాగున్న 
బాధలు, భయాలు
అగోచర భావాలు..
కళ్ళకి కట్టినట్టు బహిర్గతం చేసే 
ఉద్వేగాన్నేగా..
ప్రతి కదలిక 
ప్రస్ఫుటంగా గమనించే
నీ ప్రతిబింబాన్ని నేనేగా!
అందుకే నీలో నేనొకటిగా ఉన్నానని
నువ్వెన్నడూ అనుకోలేదు..
నీ మనసు ముకురానికున్న 
మకిలీ తొలగించి చూపే 
మనో దర్పణాన్నయినందుకు గర్విస్తున్నాను!

****


No comments:

Post a Comment

Pages