కనకధారా స్తోత్రం వైశిష్ట్యం - అచ్చంగా తెలుగు

కనకధారా స్తోత్రం వైశిష్ట్యం

Share This

 కనకధారా స్తోత్రం వైశిష్ట్యం

సి.హెచ్. ప్రతాప్


భగవంతుడిని సాకార రూపంలో అంతే తమ మనస్సుకు నచ్చిన విధంగా పలు రూపాలలో కొలిచే భక్తజనావళికి భక్తి, ధ్యానం సత్వరమే కుదిరి, అవి నిశ్చలంగా, ఎక్కువ కాలం నిలిచేందుకు మన మహర్షులు ఎన్నో స్త్రోత్రాలు, శ్లోకాలు, సతకాలను,సూక్తాలను మనకు అందించారు. విటికి ఒక పారాయణ విధానాన్ని కల్పించినా, వాటిని పాటించలేని వారికి కూడా ఉపాసన చేసి, భగవంతుని అనుగ్రహం సత్వరమే లభించేందుకు కుద అవకసం లభించారు. అందుకే విది విధానలను పాటించకుండా, కేవలం భక్తి శ్రద్ధలతో ,పవిత్రమైన మనస్సుతో ఈ స్త్రోత్రాలను పఠించినా మంచి ఫలితం కలుగుతుంది.

భారత దేశంలో అతి చిన్నకాలంలోనే, ఎక్కువ మరియు అతి ప్రభావవంతమైన, స్త్రోత్రాలను రచించిన వారు జగద్గురువుగా కీర్తింపబడుతున్న శ్రీ ఆది శంకరుల వారు.  ఆదిశంకరుల సాహిత్యం ఉజ్వలమైంది, జ్ఞానంతో అద్వైత స్థితిని అందుకోలేని సామాన్య భక్త జనావళికి భక్తి మాగంలో నిర్గుణ, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేందుకు ఆయన స్త్రోత్రాలు ఉపకరిస్తాయి.

సర్వలోక రక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని. శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరిసంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరినవారికి కొంగుబంగారమవుతుంది లక్ష్మిదేవి డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది... లక్ష్మిదేవి నాలుగు చేతులతో వుంటుంది, రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని, రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఈమెకు అనేక అవతారాలు కూడా ఉన్నాయి . విష్ణు దేవేరి అయిన లక్ష్మీ, విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా, అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా,మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా,కలియుగంలో వెంకటేశ్వరస్వామి భార్య పద్మావతిగా అవతరాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా సంపద, ఐశ్వర్యం యొక్క దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం, అందుకే ఆ లక్ష్యాలు అష్ట లక్ష్మిలుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్ష్యం పొందినట్లేనని భావన. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతికబద్ధ ప్రవర్తన ఉన్నచోట లక్ష్మీదేవికొలువై ఉంటుందని అర్థమవుతోంది. లక్ష్మీదేవి చల్లనిచూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆతల్లి భక్త జనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది.

కనకధారా స్తోత్రం లేదా కనకథారా స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం, శ్రీ మహాలక్ష్మీ దేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన మొదటి సంస్కృత స్తోత్రం. సకలసంపత్ప్రదాయకమని ఈ స్తోత్రం పారాయణ పట్ల భక్తులకు విశ్వాసం ఉండడం వలన, ఈ స్తోత్రంలోని పద, భావ సౌందర్యం వలన అత్యంత ప్రాచుర్యం కలిగిన లక్ష్మీదేవి ప్రార్థనలలో ఇది ఒకటిగా నిలుస్తొంది.

మానవాళికి కనకధారా స్తోత్రం ఓ పెద్ద వరం. దీనిని క్రమంతప్పకుండా నిష్టగా పారాయణం చేస్తే, ఇంట్లో కనక వర్షం కురుస్తుందన్నది అశేష భక్త జనం యొక్క విశ్వాసం.

ముఖ్యంగా దసరా నవరాత్రులలో.. దుర్గమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన కనధార స్తోత్రం పఠిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది

జగద్గుర ఆదిశంకరులు భిక్ష కోసం ఒక పేదబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారట.
యజమాని ఇంట లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్నఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరి కాయను దానం చేసింది ఆ మహాతల్లి. వారి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీ దేవిని ప్రార్థించారు. లక్ష్మి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది.

ఈ స్తోత్రంలో తొలి శ్లోకమే ఎంతో భావగర్భితంగా వుండి భక్తుల హ్ర్దయాలను పవిత్రం చేస్తూంది.యాంత్రికంగా ప్రారంభించినా, క్రమక్రమంగా ఈ స్తోత్రం యొక్క భావం, అర్ధం తెలుసుకొని పఠిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితుల భావం.


అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥

భక్తుల కోర్కెలు తీర్చేవాడు, లక్ష్మీదేవికి ఆనందము కూర్చువాడు, జ్ఞానులకు ఆరాధ్యుడు అయిన హయగ్రీవునికి వందనము. లమేఘశ్యాముడైన హరిని తన చూపులతో చుట్టివేసిన మంగళమూర్తి, సకలసిద్ధిస్వరూపిణి అయిన శ్రీలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములను ప్రసాదించును గాక ! కమలము చుట్టు పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక ! దేవేంద్ర పదవిని సైతము ప్రసాదింపగలిగిన, ఎల్ల ఆనందములకును మూలమైన, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగింపగల శ్రీ మహాలక్ష్మీ మాత నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించు గాక !

ఈ ప్రార్ధనను మలినరహిత, పవిత్రమైన మనస్సుతో, నిష్టగా చేస్తే ఆ చల్లని తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుందన్నది శాస్త్ర వాక్యం. మహలక్ష్మి అమ్మవారు శుభప్రదాయిని. ఆమె దృష్టి మంగళప్రదం. సృష్టికి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు ఆనందానిచ్చే ఆ తల్లి సకల సౌభాగ్యస్వరూపిణి. ఏ ఇంటిపై ఆ చల్లని తల్లి యొక్క దివ్యమైన కటాక్షం ప్రసరింపబడుతుందో, అక్కడ అష్టైశ్వర్యాలు కొలువుంటాయనేది కోట్లాది భారతీయుల అనుభవం. ఈ కనకధారా స్తోత్రంలో శ్రీ మహావిష్ణువును మేఘంతో , మహలక్ష్మి ని మెరుపుతో శంకరులు పోల్చారు. వ్యక్తి లేదా అతని కుటుంంబం యొక్క చింతనలను,దారిద్రాన్ని క్షణకాలంలో మెరుపు వేగంతో పోగొట్టే ఆ చల్లని తల్లిని ప్రసన్నం చేసుకునెందుకు, భక్తి శ్రద్ధలతో, పవిత్రమైన మనస్సుతో, సర్వశ్య శరణాగతి చేసి కనకధారా స్త్రోత్రాన్ని పఠించడం ఒక రాచమార్గంగా ఆదిశంకరులు అభివర్ణించారు.

మంత్రాలను పఠించడం లేదా భగవంతుడిని ప్రార్థించడం మన   ఆత్మ నుండి సానుకూల శక్తిని బయటకు తెస్తుంది మరియు మన  మేధస్సుకు ప్రయోజనకరమైన కార్యకలాపాలలో మునిగిపోవడానికి మన కు సహాయపడుతుంది.. ఇది జీవితం పట్ల మన   వైఖరిని మారుస్తుంది మరియు మన కు భిన్నమైన దృక్పథాన్ని అందిస్తుంది

సి హెచ్ ప్రతాప్ 


No comments:

Post a Comment

Pages