చంద్ర గ్రహ ఫలితాలు - అచ్చంగా తెలుగు

 చంద్ర  గ్రహ ఫలితాలు

 PSV రవి కుమార్ 


పాఠం లో చంద్ర గ్రహ కారకత్వాలు, చంద్రుడు ఇచ్చే ఫలితాలు తెలుసుకుందాం.

 

చంద్రుడు కర్కాటక రాశి కి ఆధిపత్యం వహిస్తాడు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు, చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. చంద్ర మహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. పైన చెప్పిన మూడు నక్షత్రాలలో ఎవరైతే జన్మిస్తారో, వారి జీవితం చంద్ర మహాదశ తో ప్రారంభం అవుతుంది .

 

చంద్రుడు మానసిక వికాశానికి, మనోధైర్యానికి కారకత్వం వహిస్తాడు. ఏ సమస్య వచ్చినా వాటికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవటంలో చంద్ర గ్రహ పాత్ర చాలా ముఖ్యం.

 

ఎవరికైతే చంద్ర బలం బాగుంటుందో, వారు జీవితం లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్ర బలం బాగలేదో జీవితం లో తీసుకునే నిర్ణయాల వలన, చాలా సందర్భాలలో సమస్యలు ఎదుర్కొంటారు.

చంద్ర గ్రహం నీరు, పాలు, వెండి, ముత్యాలు, తల్లి, ఆడపిల్లలు, బయాలజీ వంటి వాటిని సూచిస్తుంది. చంద్రుడు లగ్నం నుండి ఎక్కడ ఉన్నాడో చూసుకుని, ఆ భావం బట్టి చంద్రుడు ఎటువంటి కారకత్వం వహిస్తాడొ చెప్పాలి.  

చంద్ర గ్రహానికి వృషభ రాశి ఉచ్చ క్షేత్రం అయితే, వృశ్చిక రాశి నీచ క్షేత్రం అవుతుంది. చంద్రుడు ఉచ్చ లో ఉన్నట్టయితే శుభ ఫలితాలు పొందుతారు, నీచ లో ఉన్నట్టయితే అశుభ ఫలితాలు పొందుతారు.

 

పూర్ణ చంద్రుడిని శుభుడిగా, క్షీణ చంద్రుడిని పాపి గా చెప్పారు.

పూర్ణ చంద్రుడు అనగా  శుక్ల పంచమి నుండి బహుళ పంచమి వరకు ఉండే చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.

 

 

లగ్నం లో చంద్రుడు ఉంటే వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తల్లి బాధ్యతలు స్వీకరిస్తారు.

 

 

ద్వితీయం లో చంద్రుడు ఉంటే, ధనాదాయం పరవాలేదు. కుటుంబ సౌఖ్యం. మాట తీరు బాగుంటుంది. సంగీతం, మిమిక్రీ వంటి విద్యలపై ఆసక్తి ఉంటుంది. అదే చంద్రుడు పాపి అయితే ధన సంపాదన లో ఇబ్బందులు.

 

తృతీయం లో చంద్రుడు ఉంటే, వీరు మార్కెటింగ్, మీడియా రంగాలలో వృత్తి చేపడతారు. వెండి, ముత్యాల వ్యాపారం చేస్తారు. డైరీ వ్యాపారం చేస్తారు. 

చతుర్ధం లో చంద్రుడు ఉంటే, వీరు వాహనములు నిదానంగా నడుపుతారు. బయాలజీ సబ్జెక్ట్ లో మంచి మార్కులు సాదిస్తారు. నీటి కి సంబందిచిన వృత్తులు చేపడతారు.

 

పంచమం లో చంద్రుడు ఉంటే, వీరికి ముందుగా స్త్రీ సంతానం కలుగుతుంది. స్త్రీ లకు పంచమం లో క్షీణ చంద్రుడు ఉంటే, స్త్రీ సంబందిత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. 

 

షష్టమం లో చంద్రుడు ఉంటే, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. మనసులో చాల మందితో వైరం ఉంటుంది. పైకి వీరు చాలమందితో నవ్వుతూ మాట్లాడిన, మనసులో వీరికి చాలా మందితో శత్రుత్వం ఉంటుంది. విదేశాలకు వెళతారు. వైద్య విద్య పై లేదా తత్సమాన విద్య పై మక్కువ ఉంటుంది.

 

సప్తమం లో చంద్రుడు ఉంటే, జీవిత భాగస్వామి పై ఎనలేని అనురాగం ఉంటుంది. జీవిత భాగస్వామి తో ఎమోషనల్ గా ఉంటారు. విదేశాలకు వెళ్ళు అవకాశం.

 

అష్టమం లో చంద్రుడు ఉంటే, వైద్య రంగంలో కానీ, రీసెర్చ్ రంగం లో సైంటిస్ట్ గా కానీ, రాణిస్తారు. అనారోగ్య సంస్యలు ఇబ్బంది పెడతాయి. మానసిక వత్తిడులను తట్టుకోలేరు. అత్తగారింట్లో సమస్యలు ఉంటాయి, వైవాహిక జీవితం లో ఇబ్బందులు.

 

భాగ్యం లో చంద్రుడు ఉంటే, ఉన్నత విద్య విదేశాలలో కానీ, స్వగృహంనుండీ దూర ప్రదేశం లో కానీ చేస్తారు. మెడికల్ తత్సమాన విద్య లలో ఉన్నత విద్య చేస్తారు అనగా, ఫార్మసీ, బయో మెడికల్ వంటి విద్యలు. వీరి తండ్రి వీరిని తల్లి లాగ చూసుకొంటారు.  తండ్రి చేసే వృత్తి పై మక్కువ ఉంటుంది, ఆ వృత్తి చేయు అవకాశం కూడా కలదు.

 

రాజ్యం లో చంద్రుడు ఉంటే, చంద్ర సంబందిత ఉద్యోగాలు చేస్తారు. న్యావీ, మరైన్, డైరీ సంస్థలలో ఉద్యోగం చేయచ్చు. సాఫ్ట్ వేర్ లో మెడికల్, ఇన్స్యూరెన్స్, వంటి ప్రోజక్ట్ల లో పని చేయచ్చు. మెడికల్ రెప్రజెంటేటివ్స్ గా కానీ, మెడికల్ ట్రాన్స్క్రిప్ట్స్ గా కానీ, ఉద్యోగం చేయచ్చు.

లాభం లో చంద్రుడు ఉంటే, ఆర్దిక లాభాలు బాగానే ఉన్న, అప్పుడప్పుడు, చంద్ర కళల వలె హెచ్చు తగ్గులు ఉండచ్చు. వీరికి లభాలౌ జాగ్రత్త చేసుకొను విషయం లో జీవి త భాగస్వామి యొక తోడ్పాటు అవసరం. స్టాక్ మార్కెట్ లో తరచూ క్రయ విక్రయాదులు చేయాలని కోరిక కలిగి, లాభాలు నష్టాలు రెండు చవి చూస్తారు. వెండి, మెడికల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన లాభాలు వచ్చును. 

 

వ్యయంలో చంద్రుడు ఉన్న, విదేశాలకు వెళతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టచ్చు. వైద్య రంగం లేదా తత్సమాన రంగం లో వృత్తి చేపట్టిన ఆర్దిక లాభాలు. సాఫ్ట్ వేర్ లో ఉన్న, మెడికల్, ఫార్మ క్లైంట్లకు పని చేసిన లాభాలు.  మాన్సిక ఆందోలనలు ఎక్కువ.

 

చంద్రుడి నుండి మరిన్ని శుభ ఫలితాలకోసం నెలకిఒక సారి, శివాలయం లొ శివ లింగానికి జలాభిషేకం లేదా క్షీరాభిషేకం చేయించుట మంచిది.

 

వెండి పాత్ర ఉన్న, అందులో పాలు తాగిన శ్రేయస్కరం.

ఎవరికయినా జాతకం తెలుసుకోవాలంటే నన్ను కన్సల్ట్ చేయవలసిన నంబర్ 911 304 8787 . కన్సల్టేషన్ చార్జస్ వర్తిస్తాయి.

 

***

No comments:

Post a Comment

Pages