శ్రీధరమాధురి - 99 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 99

Share This

శ్రీధరమాధురి - 99

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


మీరు భవిష్యత్తును గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే, మీరు భయపడే అవకాశం ఉంది. మీరు ప్రస్తుతంలో జీవిస్తే నిర్భయంగా ఉంటారు. భయం యొక్క మూలాలు భవిష్యత్తులో పాతుకుని ఉంటాయి, ఎందుకంటే, భవిష్యత్తు అనిశ్చయమైనది. 

***

నేను చాలా సార్లు ఇదే చెబుతూ ఉన్నాను...

దైవం, మతం పేరుతో మీలో భయాన్ని పాదుకొల్పారు.  దీన్ని వేలాది ఏళ్ళుగా వంశానుగతంగా నియంత్రిస్తూ వచ్చారు. ఈ భయాన్నే ఒకరి స్వంత స్వార్ధ కారణాల కోసం, మతానికి ప్రతినిధులైనవారు ఆయుధంగా వాడుతూ వచ్చారు. భయం అనేది మిమ్మల్ని దైవానికి ఎన్నడూ చేరువ చెయ్యలేదు. ఒకవేళ మీరు ఆయనకు భయపడితే, ఆయన్ను ప్రేమించలేరు.అది సాధ్యం కాదు. చివరికి దైవం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దైవం. మీరు భయాన్ని విడనాడాలి. దైవం అంటేనే ప్రేమని బలంగా నమ్మి, భయం మిమ్మల్ని తినెయ్యకుండా తరిమి కొట్టడానికి, మీకు ఎంతో ఎక్కువ ధైర్యం కావాలి. లేకపోతే భయం మిమ్మల్ని తినేస్తుంది. అప్పుడు మిమ్మల్ని – శర్మ, నిర్మల్, ప్రవీణ్, రాజా, సాయి, దత్త, డేవిడ్, ఆసిఫ్ అని పిలవలేరు. మిష్టర్ ఫియర్ అని పిలుస్తారు. అంతా దైవానుగ్రహం, దయ.

***

పూర్తిగా భయంతో నిండి ఉండేవారికి దైవం పట్ల కాని, ధర్మం పట్ల కాని నమ్మకం ఉండదు. అలా ఉందని అతడు చెప్పినట్లయితే, అది మిధ్యా నమ్మకమే. ఎందుకంటే అతడు దైవానికి కూడా భయపడతాడు. అటువంటి వ్యక్తికి మోక్షాన్ని పొందడం సాధ్యం కాదు. గందరగోళంలో, భ్రమలో జీవితం గడిపేస్తాడు. అతని దుఃఖానికి దైవానుగ్రహం, దయ చికిత్స చెయ్యాలి.

***

నిన్ను నేనొక వ్యక్తిని చూశాను. నేను అతన్ని చూడాల్సి ఉంది కనుక చూశాను. అతడు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, మంచి నడవడితో, అత్యంత సంతులనంతో ఉన్నాడు. అతడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హఠాత్తుగా ఇది జరిగింది. నేను అతన్ని చాలా జాగ్రత్తగా పరీక్షించి సాగాను. ఆహా, ఇది పరీక్ష నాళికలోనున్న స్వచ్ఛమైన నీరని నేను అనుకున్నాను. ఒక్కసారి దాని మీద ఉన్న బిరడాని తెరవగానే, అది గాఢమైన సల్ఫ్యూరిక్ ఆమ్లమని నేను తెలుసుకున్నాను. ఆవిర్లు బయటకు తన్నుకు రాసాగాయి కొన్ని సార్లు నేను కొన్నింటిని గమనించినప్పుడు అవి నెమ్మదిగా, మృదులంగా అనిపిస్తాయి.  కానీ దైవం యొక్క నిర్మాణం ఎంత అందమైనదంటే, దెయ్యం దాని పళ్ళను చూపించే తీరాలి. నెమ్మదిగా నేను అతనికి బై చెప్పి, ఆ ప్రదేశాన్ని విడిచి పెట్టాను. అంతా  దైవానుగ్రహం.

***

No comments:

Post a Comment

Pages