మహాభారత పర్వాల (1 నుండి 6 వరకు) సంగ్రహ వివరణ - అచ్చంగా తెలుగు

మహాభారత పర్వాల (1 నుండి 6 వరకు) సంగ్రహ వివరణ

Share This

 మహాభారత పర్వాల (1 నుండి 6 వరకు) సంగ్రహ వివరణ

అంబడిపూడి శ్యామ సుందరరావు 


తింటే గారెలు తినాలి వింటే భారతము వినాలి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు భారతాన్ని పంచమ వేదముగా చెపుతారు అంటే ఏ వేదమైన అనేక విషయాలు మానవునికి ఉపయోగపడేవి చెపుతుంది అలాగే భారతము కూడా మనిషి ఉన్నతికి సత్ప్రవర్తనకు మార్గదర్శకంగా అనేక విషయాలను చెపుతుంది భారతాన్ని వేద వ్యాసుడు సంస్కృతములో రచిస్తే నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే కవిత్రయము వేరు వేరు కాలాలల్లో ఆంధ్రీకరించారు  ఆంధ్రీకరించేటప్పుడు నన్నయ్య మొదలు పెట్టినప్పటికీ ఎక్కువ భాగము తెలుగులోకి మార్చిన ఘనత తిక్కనకే చెందింది ఆ తరువాత మిగిలిన భాగాన్ని ఎఱ్ఱన పూర్తిచేసాడు అటువంటి 18 పర్వాలు ఉన్న భారతాన్ని సంగ్రహముగా చెప్పటం అంటే కష్టమైనా పనే ఈ సంగ్రముగా చెప్పటంలో ఉద్దేశ్యము ఏఏ  అంశాలు ఏఏ  పర్వాలలో వివరింపబడ్డాయో తెలియజేస్తే ఆసక్తి ఉన్నవాళ్లు వివరముగా ఆ పర్వానికి సంబంధించిన పుస్తకాన్ని చదవగలరు 18 పర్వాలు ఒక్కసారిగా కాకుండా మూడు భాగాలుగా అంటే ఆరు పర్వాల చొప్పున వివరించే ప్రయత్నమూ చేస్తున్నాను  నేటికీ భారతములోని పాండవోద్యోగ విజయాలు పేరిట తిరుపతి వెంకట కవులు రచించిన నాటకము లోని కురుక్షేత్ర యుద్ధము పద్యాలు ప్రజలలో పామరులు పండితులు అనే తేడాలేకుండా రంజింపచేస్తున్నాయి ఈ భారతము కల్పితము కాదు ద్వాపర యుగములో జరిగిన యదార్ధగాధ అని తెలిపే నిదర్శనాలు ఉన్నాయి కురువంశము లోని పాండవులు కౌరవుల పోరు అయినప్పటికీ ఆనాటి నుంచి యుగాలు మారిన నేటికీ ప్రజలకు ఏంతో నీతి  చెపుతుంది భారతములో ముఖ్యమైన ఘట్టము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుకి భోదించిన భగవత్ గీత ఈ గీత ఒక్క అర్జునుడిని ఉద్దేశించి భగవానుడు చెప్పినా నేటికీ సమస్త మానవాళికి ఉపయోగ కరమైనదిగా కీర్తింపబడుతుంది ఎందరో మహానుభావులు గీతకు భాష్యాలు చెపుతూ గీతామృతాన్ని ప్రజలకు అందిస్తున్నారు 


భారతములో మొదటి పర్వము ఆదిపర్వం ఇందులో మహా భారత కధ క్లుప్తముగా వివరింపబడింది ఈ ఆదిపర్వంలో ఇతర పర్వలలో లాగానే ఉపపర్వాలు ఉన్నాయి కౌరవ పాండవుల కధ మేరకు పరిశీలిస్తే వారి వారి పుట్టుకనుంచి ( నిజానికి వారు పుట్టకముందునుంచి, ఇంకా ముందునించి కూడా) , వారి బాల్యం, విద్యాభ్యాసం. కురు పాండవుల తగాదాలు, ధర్మరాజు యువరాజుగా అభిషిక్తుడవడం , లక్క ఇల్లు కాలడం, పాండవులు చనిపోయారని అందరు నమ్మడం, విదురుడి సహాయంతో పాండవులు బయట పడి రహస్య జీవితం గడపడం, హిడింబాసుర వధ, హిడింబ ద్వారా ఘటోత్కచుడిని కొడుకుగా పొందడం, ఏకచక్రపురంలో బ్రహ్మచారులుగా జీవితం , భీముడు బకాసురిని చంపడం,వ్యాసుని సలహా మేరకు ద్రౌపది స్వయంవరంలో పాల్గొని ఆమెను అర్జునుడు గెలుచుకోవడం, పాండవులు ఐదుగురు ఆమెను వివాహమాడటం, మొదటిసారిగా కృష్ణుడి పాత్ర ప్రవేశం, వారి సమాగమం , ధృతరాష్ట్రుడు రాజ్యం విభజించి ధర్మరాజును ఖాండవ ప్రస్తం ఏలుకోమనడం, ధర్మరాజు పట్టాభి షేకం,ఇంద్రాప్రస్థ నిర్మాణం, కృష్ణార్జునుల వల్ల ఖాండవ దహనం, అర్జునిడికి గాండీవం, అక్షయ తూణీరం, కపిధ్వజంతో ఉన్న రధం అమరడం,ఇంద్రుడి యుద్ధవిరమణ, మయని  పరిచయం ఇత్యాదులు ఈ పర్వంలో వివరింపబడతాయి. 


రెండవది సభాపర్వం దీనికి ఈ పేరు రావడానికి మయ సభే కారణము అని పండితులు చెపుతారు. ఇంద్రప్రస్థాన్ని పొందిన ధర్మరాజు రాజసూయ యాగము చేయటానికి నలుగురు తమ్ముళ్లను నాలుగు దిక్కులకు పంపి రాజ్యాలను జయిస్తాడు. ఈ యాగానికి ముందే జరాసంధుని వధ రాజసూయ యాగము అనంతరము శ్రీ కృష్ణుని చేతిలో శిశుపాలుడు హతము అవటం మయ సభలో దుర్యోధనునికి పరాభవం జరగటం ,శకుని పధకం ప్రకారము ధర్మరాజును జూదానికి పిలిస్తే ధర్మరాజు తనను తాను ఒడి అంతటి తో ఆగకుండా భార్య, తమ్ముళ్లను ఒడ్డి ఓడిపోవటం ,ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్నం , శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఆదుకోవటం భీముని భీకర ప్రతిజ్ఞ ,దృతరాష్ట్రుడు ద్రౌపదిని అనుగ్రహించి రాజ్యాన్ని తిరిగి ఇవ్వగా మళ్ళా శకుని కుతంత్రము వలన జూదము అడి  12 ఏళ్ళు అరణ్యవాసము ,ఒక ఏడాది అజ్ఞాతవాసానికి అడవులకు బయలు దేరటము తో ఈ పర్వము ముగుస్తుంది.


మూడవది అరణ్య పర్వము ఈ పర్వములోనే పాండవులు కామ్యక వనము చేరటం, యాదవులు, పాంచాలులు, చేది రాజులు పాండవులను కలుసుకోవటం, పాండవులు దైత్య వనము చేరటం, వ్యాసుని సలహా మేరకు అర్జునుడిని తపస్సుకు పంపటం,శివునికోసము తపస్సు చేయమని ఇంద్రుడు చెప్పటం., అర్జునుడి ఘోర తపస్సు ఫలితము గా శివుడు కిరాతకుని రూపములో రావటము, పరీక్షల అనంతరము శివుడు అర్జునికి పాశుపతాస్త్రము ఇవ్వటం, అర్జునిడిని ఇంద్రుడు ఇంద్రలోకానికి తీసుకు వెళ్లి చిత్రసేనుని దగ్గర నృత్య సంగీతాలు నేర్చుకోవటం ఊర్వశి శాపము ,ఇలా పదేళ్లు గడిపిన అర్జునుడు గంధమాన పర్వతము పై తన వాళ్లను కలుసుకోవటం, ఈలోగా మిగిలిన పాండవులు లోమస మహర్షితో అనేక తీర్ధాలు తిరిగి గంధమానం చేరడము,భీముడు సౌగంధిక పుష్పాలు తేవటం ,కుబేరుడి అనుచరులతో యుద్ధము ,దారిలో హనుమంతుని కలవటం దుర్యోధనుని ఘోష యాత్ర, చిత్రసేనుడు చేతిలో దుర్యోధనునికి పరాభవం,పాండవులు విడిపించటము ,ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలు అపహరించటం ,పాండవుల అరణ్యవాస సమయము పూర్తి ఆయె సమయములో యక్షుడు ధర్మరాజును అడిగిన ప్రశ్నలు పాండవులు విరాట నగరము చేరాలని నిర్ణయము ఈ పర్వములోనే ధర్మరాజు ఋషుల ద్వారా పురాణా గాధలు వినటం ,మరియు బృహదశ్వుని ద్వార ఓడిపోకుండా జూదము ఎలా ఆడాలో అక్ష విద్యను నేర్చుకుంటాడు.


నాల్గవది విరాటపర్వం అంటే పాండవులు అజ్ఞాతవాసము కోసము మారు వేషాలలో విరాటుని కొలువు చేరటం. ధర్మరాజు కంకుభట్టు గా విరాటుని జూద మిత్రునిగాను,అర్జునుడు పేడీ రూపములో ఉత్తరకు నృత్యము నేర్పేవాడుగాను, భీముడు వలలుడు అనే పేరుతొ వంటవాడుగాను, నకుల సహదేవులు గ్రంధిపాలుడు, తంత్రీపాలుడు అనే పేర్లతో అశ్వ శిక్షకుడు,గో సంరక్షకుడిగాను ద్రౌపది సైరంధ్రి పేరుతొ రాణి సుధేష్ణ దగ్గర అంతరంగిక పరిచారిక చేరుతారు ఈ పర్వములోనే భీముడు ద్రౌపదిని మోహించిన కీచకుని ఉపకీచకులు సంహరిస్తాడు.ఉపకీచకులు ద్రౌపదిని కీచకునితో పాటు దహనము చేయటానికి తీసుకువెళుతుంటే భీముడు గంధర్వుని రూపములో వచ్చి వారందరిని మట్టు పెడతాడు. ఈ విషయము తెలుసుకున్న దుర్యోధనుడు భీముడే కీచకుని చంపి ఉంటాడని భావించి సుశర్మను దక్షిణ గోగ్రహణానికి పంపి మరునాడు దుర్యోధనుడు హస్తినాపురము సైన్యముతో ఉత్తర గోగ్రహణానికి వస్తాడు ఉత్తర గోగ్రహాణాన్ని అడ్డుకోవటానికి బృహన్నల సారధ్యముతో ఉత్తర కుమారుడు బయలుదేరి సైన్యాన్ని చూసి భయపడితే బృహన్నల తానె అర్జునిడిని అని చెప్పి ఉత్తర కుమారుడి సారధ్యములో కౌరవ సేనను ఓడించినాకా విరాట రాజు నిజము తెలుసు కున్నాక ఉత్తరను అభిమన్యుని ఇచ్చి శ్రీ కృష్ణుని సమక్షంలో వివాహము చేయటము తో విరాట పర్వము ముగుస్తుంది.


ఐదవది ఉద్యోగ పర్వం  పర్వంలో ఉత్తరాభిమన్యుల వివాహము, దుర్యోధనుడు మాట వినడు కాబట్టి యుద్ధము అనివార్యము కావచ్చు కాబట్టి పాండవ పక్షీయుల  సమావేశము లో యుద్ధ సహాయానికి సమీకరణాలు తయారుచేసుకుంటూనే ద్రుపదుడి పురోహితుని ద్వారా రాయబారము పంపుతారు ధృతరాష్ట్రుడు తన రాయబారితో సమాధానము పంపిస్తానని వచ్చిన రాయబారిని పంపి సంజయుడిని రాయబారిగా పంపుతాడు సంజయుడు ధృతరాష్ట్రుని ఉద్దేశ్యము అంటే తనకొడుకు తన మాట వినడు కాబట్టి ధర్మరాజే నాశనానికి కారణమైయే యుద్దాన్ని నివారించమని సలహా ఇస్తాడు. ఈలోగా  ఇరుపక్షాలు యుద్దానికి సన్నద్ధమవటము ఇరుపక్షాల సేనలు యుద్దానికి బయలు దేరటంతో ఈ పర్వము ముగుస్తుంది అర్జునుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని దగ్గరకు సహాయానికి వెళ్లి అర్జునుడు శ్రీ కృష్ణుని సారధిగా కోరుకోవటం దుర్యోధనుడు ఒక అక్షౌహిణి సైన్యమును కోరటం, బలరాముడు ఎవరి వైపు యుద్దములో పాల్గొనని చెప్పటం, పాండవులకు సహాయము చేయాలని వస్తున్నా శల్యుడిని దుర్యోధనుడు మాయ మాటలు చెప్పి తన వైపు తిప్పుకోవటం,జరుగుతుంది. ఈ విధముగా పాండవులకు ఏడూ, కౌరవులకు పదకొండు అక్షౌహిణీల సైన్యము సమకూరుతుంది. చివరి ప్రయత్నముగా శ్రీ కృష్ణుడు రాయబారిగా కౌరవ సభకు రావటము శ్రీకృష్ణుని దుర్యోధనుడు బందీ చేయాలనీ ప్రయత్నిస్తే శ్రీ కృష్ణుడు తన విశ్వ రూపాన్ని చూపిస్తాడు దృతరాష్ట్రుడు తన నిస్సహాయతను తెలియజేస్తాడు. శ్రీకృష్ణుడు వెళుతు కర్ణుడికి అతని జన్మ రహస్యము చెపుతాడు ఈ పర్వములోనే కుంతీ కర్ణుని కలవటం కర్ణుడు అర్జునుని తప్ప ఇతర పాండవులను యుద్దములో చంపనని  కుంతికి మాట ఇస్తాడు. కౌరవ సైన్యానికి భీష్ముడిని  సర్వసైన్యాధక్షుడిగా నియమిస్తారు భీష్ముడు కర్ణుడిని అర్ధరడిగా ప్రకటిస్తే ఆగ్రహించిన కర్ణుడు భీష్ముడు యుద్ధరంగములో ఉన్నంత కాలము తానూ యుద్ధము చేయనని అంటాడు. బీష్ముడు తానూ శిఖండితో యుద్ధము చేయక పోవటానికి కారణము చెపుతాడు పాండవుల తరుఫున ధృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధక్షుడి గా నియమిస్తారు కురుక్షేత్రము యుద్దభూమిగా నిర్ణయించబడుతుంది. 


ఆరవ పర్వము భీష్మ పర్వము భీష్మ,ద్రోణ, కర్ణ, శల్య అనే నాలుగు యుద్ధ పర్వాలు వరుసగా ఉంటాయి. సంజయుడు వ్యాసుని వరము వల్ల పొందిన దివ్యదృష్టితో దృతరాష్ట్రునికి యుద్ధ వివరాలు చెప్పడానికి ముందుగా ద్వీపాల వివరాలు చెపుతాడు. ధర్మరాజు యుద్ధము మొదలైనవెంటనే పెద్దలైనా భీష్మాదుల ఆశీర్వచనాలు తీసుకుంటాడు అర్జునుడి విషాదయోగము,శ్రీ కృష్ణుని గీతోపదేశము జరిగినాక యుద్ధము మొదలవుతుంది. భీష్ముని పరాక్రమానికి ఎదురు నిలవలేని పాండవులు భీష్ముడిని ఉపాయము అడుగుగా భీష్ముడు శిఖండిని అడ్డు పెట్టుకొని యుద్ధము చేయమని సలహా ఇస్తే పదవరోజు అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్మునిపై అస్త్రాలు ప్రయోగిస్తే భీష్ముడు తీవ్రముగా గాయపడి నెలకొరగ  బోతుండగా అర్జునుడు   భీష్ముని కోసము అంపశయ్య ఏర్పాటు చేసి భీష్ముని దాహార్తి తీర్చటానికి భూమినుండి గంగను రప్పిస్తాడు కురు వంశ శ్రేయస్సు కోరే భీష్ముడు దుర్యోధనునితో తానూ పోయినాక అయినా సంధి చేసుకొని యుద్ధము విరమించమని చెపుతాడు. అంప శయ్య మీద ఉన్న భీష్ముడు ఇచ్ఛా మరణము అనే వారము ఉన్నది కాబట్టి మరణము కోసము ఉత్తరాయణ పుణ్యకాలం కోసము ఎదురు చూస్తూ ఉంటాడు ఆ సమయము లోనే కర్ణుడు భీష్ముని దగ్గరకు వచ్చి ఆశీర్వాదము తీసుకుంటాడు.   

(మిగతాది వచ్చే నెల...)

No comments:

Post a Comment

Pages