తలరో లోకాంతరపరులు తడవము పుణ్యపాపమును - అచ్చంగా తెలుగు

తలరో లోకాంతరపరులు తడవము పుణ్యపాపమును

Share This

 తలరో లోకాంతరపరులు తడవము పుణ్యపాపమును

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 
రేకు: 0336-05 సం: 04-212


పల్లవి: 


తలరో లోకాంతరపరులు తడవము పుణ్యపాపమును


వలె నని శ్రీవైష్ణవులకు వందనమే సేసెడివాడచ.1: తపసిగాను ధర్మిగాను


కృపగల శ్రీపతి కింకరుడ


జపిత గాను శాస్త్రిగాను


వుపదేశపు గురువూళిగకాడచ.2: భయము లేదు భక్తి లేదు


జయభాగవతుల దయవాడ


ప్రియము న్నెరగను పెరిమ న్నెరగను


ద్వయాధికారముదగిలినవాడచ.3: జ్ఞానము లేదు మోనము లేదు


పూని శ్రీవేంకట పురుషుడిదె


నానాటదెలిపి నను మన్నించెను


సానదేరి తన శరణమువాడభావం


పల్లవి:


 చింతించరో !  పరలోక వాసులారా ! పుణ్యపాపములను మేము వెదకము.


కావాలని చేయవలెనని శ్రీవైష్ణవులకు (విశిష్టాద్వైతమును అనుసరించు బ్రాహ్మణులకు) నేను  వందనము చేస్తాను.


చ.1:


నేను తపస్విని కాను. ధర్మం కలిగినవాడిని కాను.


దయ కలిగిన లక్ష్మీపతి సేవకుడను.


ఋషిని కాను. శాస్త్రముతెలిసినవాడిని కాను


ఉపదేశము చేసిన గురువు యొక్క సేవ  చేసినవాడను మాత్రమే. (అన్నమాచార్యుల వారికి అహోబిలంలో నరసింహమంత్రాన్ని ఉపదేశించిన గురువు ఆదివన్‌ శఠకోపుడు.)


చ.2:


నాకు భయము లేదు. భక్తి లేదు.


దేవునికి జయము పలుకు దైవ భక్తులు దయ పొందిన వాడను.(అరళుప్పాడు భాగవతులు- దేవుని సంకీర్తనలు పాడే భాగవతులు అని అన్నమయ్య మరొక ప్రయోగం)


ప్రియము తెలియదు. గొప్పతనము తెలియదు.


శ్రీమన్నారాయణచరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అను ద్వయమంత్రములో అధికారము కలిగినవాడిని.


చ.3:


జ్ఞానము లేదు, మౌనములేదు.అన్ని  శ్రీవేంకట పురుషుడే.


ఆ స్వామి  క్రమక్రమంగా అన్ని నాకు తెలిపి  నన్ను మన్నించాడు.


అధిక నైపుణ్యం పొంది తన శరణము కోరతాను.


విశేషాలు


 14 మంది భాగవతులు ప్రసిద్ధి.


1. ప్రహ్లాదుడు, 2. నారదుడు, 3. పరాశరుడు, 4. పుండరీకుడు, 5. వ్యాసుడు, 6. అంబరీషుడు, 7. శుకుడు, 8. శౌనకుడు, 9. భీష్ముడు, 10. దాల్భ్యుడు, 11. రుక్మాంగదుడు, 12. అర్జునుడు, 13. వసిష్ఠుడు, 14. విభీషణుడు. 

***

No comments:

Post a Comment

Pages