ప్రపంచ ప్రఖ్యాత "లీనింగ్ టవర్ ఆఫ్ పిజా" గురించిన కొన్ని విశేషాలు - అచ్చంగా తెలుగు

ప్రపంచ ప్రఖ్యాత "లీనింగ్ టవర్ ఆఫ్ పిజా" గురించిన కొన్ని విశేషాలు

Share This

 ప్రపంచ ప్రఖ్యాత "లీనింగ్ టవర్ ఆఫ్ పిజా" గురించిన కొన్ని విశేషాలు

అంబడిపూడి శ్యామసుందరరావు


 



ప్రపంచ వ్యాప్తముగా గుర్తింపు పొందిన కట్టడాలలో పిజా టవర్ ఒకటి ఈ ఇటాలియన్ నిర్మాణము ప్రపంచము నలుమూలలనుండి ఏంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది ఇంతగా ఆకర్షించటానికి కారణము ఆ టవర్ కొద్దిగా వంగి ఉండటమే.మనదేశములో అంతకన్నా ఎక్కువ వంగిన కట్టడము ఉన్నప్పటికీ మనము మన చరిత్రకారులు ప్రభుత్వాలు దానిని వెలుగులోకి తీసుకురారు ఆ కట్టడాన్ని గురించి చివర తెలుసుకుందాము ముందు ఇటలీ లోని పిజా టవర్ఈ ను గురించి కు మనకు తెలియని తెలుసుకోతగ్గ చరిత్ర తెలుసుకుందాము.ఈ చరిత్రలో ఈ టవర్ ఎలా నిర్మింపబడింది అనిర్మాణములో జరిగిన కొన్ని ఇంజనీరింగ్ పొరపాట్లు మొదలైనవి అన్ని వస్తాయి.వీటన్నిటి వల్ల ఈ పిజా టవర్ ఇటలీ యొక్క అబ్దుతమైన చిహ్నముగా తయారు అయింది.ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాము.        

.పిజా టవర్ నిర్మాణము 1173 లో మొదలై ఇంచుమించు రెండు శతాబ్దాలు కొనసాగింది." గేమ్ ఆఫ్ ద బ్రిడ్జ్ పిజా" అనే పేరుతొ ఇటాలియన్ చిత్రకారుడు స్టెఫానో డెల్లా బెల్లా గీసిన చిత్రము ఆధారముగా దీని నిర్మాణము మొదలైయింది. ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిజా ఒక గంట స్తంభము కాథలిక్ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించటానికి అనౌన్స్ చేయటానికి నది ఒడ్డున ఉన్న ఇటాలియన్ పట్టణము పిజా లోనిర్మించాలి అనుకుని 1173 లోనిర్మాణము  మొదలు పెట్టారు ఐదు ఏళ్ళు నిర్మాణము కొనసాగి మూడవ అంతస్తూ దాక నిర్మాణము జరిగింది. కానీ దురదృష్టవశాత్తు పక్కన ఉన్నఇటాలియన్ రాష్ట్రాలలో జరిగిన మిలిటరీ తగువుల  వల్ల ఈ గంట స్తంభము నిర్మాణము ఆగి 1272 వరకు మళ్ళా తిరిగి మొదలు కాలేదు.మొత్తము మీద 1372 వరకు ఈ నిర్మాణము పూర్తి కాలేదు. అంటే దీని నిర్మాణానికి రెండు శతాబ్దాలు పట్టిందన్నమాట ఈ నిర్మాణము మొదలు అయినప్పటి నుండి ఈ శతాబ్దాలలో ఎంతమందో ఆర్కిటెక్టుల తరాలు మారినాయి. ఇదొక పెద్ద విశేషము     .   
.ఈ టవర్ ను దోచుకున్న డబ్బుతో కట్టారు 12 వ శతాబ్దములో పిజా ఇటలీలో బాగా ధనవంతమైన నగరము.అప్పటి ప్రభుత్వము పాలెర్మో సిసిలీ నగరాలను దోచుకొని వారు దోచుకున్న సంపదను ఇతరులకు తెలియజేయాలని ఫీల్డ్ అఫ్ మిరకిల్స్ ను సృష్టించాలనుకున్నారు.అనుకున్న తరువాత ఈ పిజా టవర్ ను కెథడ్రల్,ఒక బాప్టిసరి, ఒక సమాధుల సమూహము పక్కపక్కగా నిర్మానించాలి అనుకున్నారు ఈ సముదాయంలో గంట స్తంభము ఎత్తుగా నిర్మించాలి అనుకున్నారు కానీ నిర్మాణ లోపాల వల్ల ఎత్తైన కట్టడము కాలేకపోయింది.

పిజాలోనే ఇలాంటి లీనింగ్ టవర్స్ ఇంకా ఉన్నాయి. సాన్ మిచెల్ డెగ్లీ స్కేల్జి చర్చ్ ఇలాంటి వాటిలో ఒకటి  ఈ వంగటం అనేది ఆ ప్రాంతములోని మెత్తటి నేల వల్ల జరుగుతుంది.12వ శతాబ్దము నాటి  చర్చ్ ఆఫ్ సెయింట్ నికోలా యొక్క గంట స్తంభము ఈ పిజా టవర్ కు ఒక అర మెయిలు దూరములో దక్షిణాన ఉంటుంది. అలాగే 11 వ శతాబ్దానికి చెందిన సాన్ మిచెల్ డేగ్లీ స్కాల్జి చర్చ్ తూర్పు భాగములో ఉంటుంది అది కూడా ఇలాంటిదే. వీటిలో సాన్ నికోలా కొద్దిగా మాత్రమే వంగి ఉంటుంది. సాన్ మిచెల్ డేగ్లీ స్కాల్జి చర్చ్ 5 డిగ్రీలు వంగి ఉంటుంది.   

పిజా టవర్ 800 ఏళ్ళది ,పురాతనమైనది కాబట్టి వంగి ఉంటుంది అని చాలా మంది అభిప్రాయము కానీ ఇది నిజము కాదు నిజనికి ఈ టవర్ నిర్మాణము మొదలుపెట్టిన 5 సంవత్సరాలకే వంగటం ప్రారంభించింది. సాయిల్ మెకానిక్స్, ఇంజనీరింగ్ నిపుణులు కారణాలు వెతకటం మొదలు పెట్టారు భూమిలోని ఇసుక నేల అలాగే షిఫ్టింగ్  (జరుగుతున్న)మట్టి ఈ 14 టన్నుల గంట స్తంభాన్ని మోయలేక వంగి ఉండవచ్చు అని భావించారు అర్కటెక్టులు ఈ లోపాన్ని రెండవ అంతస్తు కట్టడము ద్వార సరిచేయవచ్చునని అనుకున్నారు కానీ ఈ పధకం పనిచేయలేదు పిజా టవర్ వారి వెబ్ సైట్ లో తెలిపిన దానిని బట్టి  800 ఏళ్లలో 55 మీటర్ల ఈ టవర్ కేవలము వంగటమే కాదు సంవత్సరానికి 1 లేదా 2 మిల్లీమీటర్ల చొప్పున పడిపోతుంది.ఈ నిర్మాణము వివిధ దిశలలో వంగినట్లు తెలుస్తుంది.1272లో నిర్మాణాన్నిమళ్ళి మొదలు పెట్టినప్పుడు చాలా మంది ఇంజనీర్లు ఆ లోపాన్ని సరి చేయటానికి పైన అంతస్తులు కలపటం ద్వారా ప్రయత్నించారు కానీ ఉపయోగము లేకుండా పోయింది.నిరాణము కంటిన్యూ చేస్తుండగానే ఈ టవర్ దక్షిణానికి వంగింది. ఆప్పటినుండి నేటి వరకు అలాగే ఉండి పోయింది.  
\
ఈ టవర్ నాలుగు భూకంపాలను తట్టుకుంది .అలాగే ఈ టవర్ రెండు ప్రపంచయుద్ధాలను కూడా చూసింది అనేక మంది విహార యాత్రికులు నిత్యమూ దర్శిస్తుంటారు ఈ భూకంపాలలో ఒకటి రెక్టార్ స్కెల్ పై 6 కన్నా ఎక్కువ ఉన్నది.ఈ టవర్ పునాదుల క్రింద ఉన్న మెత్తటి నెల భూకంపాల సమయములో కూలిపోకుండా కాపాడింది అని శాస్త్రజ్ఞుల ఊహ.2018లో ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ యూనివర్సిటీ బృందం ఈ టవర్ ఎందుకు పడిపోవటం లేదు అన్న అంశముపై పరిశోధన చేసి నివేదిక సమర్పించారు  ఆ నివేదిక లో ఆ టవర్ క్రింద జరుగుతున్న"డైనమిక్  సాయిల్ స్ట్రక్చర్ ఇంటర్ యాక్షన్ "అనే ప్రక్రియ ఆ టవర్ పడిపోకుండా కాపాడుతున్నది అని తెలియజేసారు.    

ఇటాలియన్ నియంత ముస్సోలిని  ఈ టవర్ ను సరి చేయటానికి ప్రయత్నించాడు. కానీ సఫలము కాలేకపోయాడు. ఈ ప్రయత్నములో ఈ టవర్ పునాదుల లొ రంధ్రాలు చేసి టన్నుల కొద్దీ సున్నము కంకర రాళ్లతో నింపాడు పునాది మరీ బరువై ఇంకా వంగటము ప్రారంభమయి ఆ ప్రయత్నం ఆపేసాడు రెండవ ప్రపంచ యద్ద సమయములో ఇద్దరు అమెరికన్ సైనికులకు ఈ టవర్ పై బాంబులు వేసి ధ్వంసము చేయమని ఆర్డర్లు ఇచ్చారు కూడా.ఆ కాలములో జర్మనీ సైన్యము ఈ టవర్ ను ఆర్మ్ బేస్ గా వాడుకున్నది అందుచేత చుట్టూ ఉన్న భవంతులను నాశనము జర్మనీ ఆర్మీ బేస్ పై దాడి చేయవచ్చు అని అమెరికన్ సైనికులు ఈ ప్రయత్నం చేశారు. కానీ ఆ టవర్ అందాలను చూసి వారు ముగ్దులై ఈ ప్రయత్నం చేయలేదు ప్రస్తుతము ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిజా స్థిరముగా ఉన్నది.ఎన్నో సార్లు దానిని సరిచేయాలని ప్రయత్నించినా ఫలితము లేకపోయింది. మరల 1990 -2001 మధ్య కాలములో ఆ టవర్ ను నిట్ట నిలువగా చేయాలనే ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలలో భాగముగా 70 మెట్రిక్ టన్నుల మట్టిని టవర్ ఎత్తుగాఉన్న భాగము క్రింద నుండి తొలగించారు. దీని వలన 17. 7 అంగుళాలు సరి అయింది. 2008 లో ఇంజనీర్లు ఈ టవర్ ఇంకా ఏమాత్రము వంగటం లేదు అని నిర్ణయించారు. వారి అంచనా ప్రకారము ఈ టవర్ కు 200 ఏళ్ల వరకు ఏ విధమైన ప్రమాదం లేదని చెప్పారు, ఆ తరువాత కొత్త టెక్నాలజీ వల్ల మేలు జరగవచ్చు అని శాస్త్రజ్ఞుల అభిప్రాయము మరియు ఆశ.అటువంటిదే జరిగితే ఇంకా కొన్ని శతాబ్దాలపాటు ఆ టవర్ అలాగే ఉండవచ్చు.

వారణాసి మణికర్ణిక ఘాట్ లోని రత్నేశ్వర్ దేవాలయము :-
మన భారతదేశము లో వారణాసి మణికర్ణికా ఘాట్ లో గల రత్నేశ్వర్ దేవాలయము పిజా టవర్ కన్నా అన్ని విధాలుగా  గొప్పది ఎందుకంటే పిజా టవర్ 4 డిగ్రీలు మాత్రమే వంగి ఉంటుంది కానీ రత్నేశ్వర్ దేవాలయము 9 డిగ్రీలు వంగి ఉంటుంది.కానీ పిజా టవర్ కు వచ్చినంత ప్రచారము ఖ్యాతి మన దేవాలయానికి రాలేదు కారణము బ్రిటిష్ వారి దమన నీతి, పాశ్చాత్యుల పక్షపాత ధోరణి ,స్వాతంత్రము తరువాత మన పాలకుల నిర్లక్ష్యము తగినంత ప్రచారము లేక పోవటం వల్ల ఈ నిర్మాణానికి ప్రపంచవ్యాప్తముగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతము పిజా టవర్ కన్నాపురాతనమైనది  గొప్పదైన రత్నేశ్వర్ దేవాలయము గురించి కూడ తెలుసుకుందాము. ఈ దేవాలయము రాజా మాన్ సింగ్ యొక్క నౌకరు తన తల్లి రత్న బాయి కోసము నిర్మించాడు.నిర్మాణము పూర్తి చేసినాక ఆతను గర్వంగా ,"నేను నాతల్లి ఋణము తీర్చుకున్నాను " అని అన్నాడుట ఆ మాటలు అన్న వెంటనే ఆ నిర్మాణము ఆగ్నేయము వైపుగా వంగటం ప్రారంభించి నేలలోకి కూరుకుపోయి గోపుర భాగము మాత్రమే కనిపిస్తుంది తల్లి ఋణము తీర్చుకోవటం అసాధ్యము అని లోకానికి తెలియజేసింది. అప్పటి నుంచి దేవతా మూర్తులు ఉన్న పీఠము ఎన్నో ఏళ్ళు గా గంగానది నీటిలో ఉన్నాయి వంగిన గోపురము మాత్రమే కనిపిస్తుంది.      

****

No comments:

Post a Comment

Pages