శ్రీధర మాధురి - 97 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి - 97

Share This

శ్రీధర మాధురి - 97 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)




నేను ఒక కథ విన్నాను, దాన్ని మీతో పంచుకుంటాను.

విష్ణు భగవానుడు, నారదుడు గురుశిష్యుల లాగా ఒక కొండ మీద ధ్యానం చేసుకోసాగారు. అనేక సంవత్సరాల పాటు వారు యోగనిద్రలో మునిగి ఉన్నారు.
 
వారిద్దరూ లౌకిక జగతికి తిరిగి రాగానే నారదుడు ఆనంద బాష్పాలతో నిండి ఉన్నాడు.
 
నారదుడు ఇలా అన్నాడు 'స్వామి! మీతో ధ్యానం చేయడంలో ఎంతటి ఆనందం ఉంది? మీరు నన్ను ఆనందము, శాంతి నిండిన జగతికి తీసుకొని వెళ్లారు. అటువంటి పవిత్రమైన శాంతితో నన్ను దీవించడానికి నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో? స్వామి, ఇందుకు బదులుగా మీకు ఏదైనా చిన్న సేవ చేయాలని నాకు అనిపిస్తోంది. భగవాన్ దయుంచి మీకు సేవ చేసే ఒక అవకాశంతో నన్ను దీవించండి.
     
విష్ణుభగవానుడు నవ్వి ఇలా అన్నారు, 'నేను నీకు చేసిన దానికి బదులుగా ఏదైనా సేవ చేయడమన్నది అసాధ్యం నారదా! కాబట్టి నాకు సేవ చేయాలన్న కోరికని విడనాడు. నీవు నాకు ఏ సేవను చెయ్యలేవు, అది అసాధ్యం.'
   
నారదుడు విష్ణు భగవానుడిని ఇలా బ్రతిమాలాడు, 'హే కరుణామూర్తి! దయుంచి మీ కోసం ఏదో ఒక చిన్న పనైనా చేసేలా దీవించండి.'
 
విష్ణు భగవానుడు కనికరించి, ఇలా అన్నారు, ' నాకు ఒక కప్పు చల్లని నీరు తీసుకొని రా.'
 
నారదుడు కొండదిగి వెళ్ళాడు. అతను ఒక ఇంటి తలుపు తట్టాడు.
 
ఒక యువతి తలుపు తెరిచింది.

నారదముని ఆమెను ఇలా అడిగారు 'నాకు నువ్వు ఒక కప్పు చల్లని నీటిని ఇవ్వగలవా? కొండ మీద ఉండే గురువు యొక్క శిష్యుడిని నేను. నా గురువు నాతో ఒక కప్పు చల్లని నీరు తీసుకు రమ్మని చెప్పారు.
 
ఆ యువతి ఇలా అంది 'దయుంచి ఇంట్లోకి రండి. నిరంతరం ధ్యానంలో కొండమీద ఉండే ఆ గొప్ప గురువు గురించి నేను ఎంతో విన్నాను. మీరు ఆయన శిష్యులు కనుక మీరు మా ఇంట్లోకి వస్తే, ఆయన వచ్చినట్లే. దయవుంచి మా ఇంట్లోకి అడుగు పెట్టి, మా గృహాన్ని పావనం చేయండి.'
 
నారద ముని ఇలా అన్నారు 'దీనంతటికీ నాకు సమయం లేదు. దయుంచి నాకు ఒక కప్పు చల్లని నీటిని ఇవ్వండి.'
 
ఆమె బ్రతిమాలుతూ పోసాగింది. కనుక ఆయన ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు.
 
అప్పటికే పొద్దుపోయింది. కనుక ఆమె తనతో రాత్రి భోజనం చేయమన్నది, ఆయన ఒప్పుకున్నారు. చీకట్లో నీరు ఒలికిపోతుంది కనుక ఆయన ఆ యువతి ఇంట్లోనే నిద్రపోయారు. మర్నాడు ఉదయం ఆవుకు ఏవో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆయన ఆమె ఆవుకి సహాయం చెయ్యాల్సి వచ్చింది. ఇది కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఆయన ఆమెను వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు పుట్టారు. వారు వ్యవసాయం చేశారు, పంటలు పండించారు. ఎంతో డబ్బు గడించారు. ప్రజల కోసం స్కూళ్లు, హాస్పటళ్లు కట్టించారు. పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాయి. మనవలు కూడా పుట్టారు.
 
హఠాత్తుగా జలప్రళయం వచ్చింది. లోయల నుండి నీరు చొచ్చుకుని వచ్చింది. అందరూ కొట్టుకుపోయారు. భార్య, పిల్లలు, మనవలు, స్కూళ్ళు, హాస్పటళ్లు, ప్రజలు, ప్రతి ఒక్కరూ కొట్టుకొని పోసాగారు.
 
విష్ణు భగవానులు చుట్టలుగా చుట్టుకుని ఉన్న ఆదిశేషునిపై, వరద నీటిలో తేలుతూ వచ్చి నారదమునిని ఇలా అడిగారు, 'నారదా! నేనింకా ఒక కప్పు చల్లని నీటి కోసం వేచి ఉన్నాను.'
 
ఈ రోజున ప్రతి శిష్యుని పరిస్థితి ఇదే.
 
గురువు మీకు చేసిన సేవలకు బదులుగా మీరు ఏమీ చేయలేరు. మీరు గురువు యొక్క సేవల కు బదులు తీరుస్తున్నారన్న ఆలోచనే అల్పత్వముతో కూడుకున్నది, దానిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.
 
ఓం మహావిష్ణవే నమః
  

No comments:

Post a Comment

Pages