విరాధుడు - అచ్చంగా తెలుగు

 విరాధుడు

అంబడిపూడి శ్యామ సుందరరావు 



శ్రీమహావిష్ణువు ప్రతి యుగములో సాధుజనులను పీడించే రాక్షసులను సంహరించడానికి అవతారము ఎత్తేవాడు త్రేతాయుగములో రామావతారంలో సీత సమెత రాముడు లక్ష్మణుడితో అరణ్యవాసము చేస్తూ దండకారణ్యములో ప్రవేశించి మునులను హింసించే రాక్షసులను సంహరించాడు ఆ క్రమములో మొదటగా అరణ్యవాసములో మొదటగా చంపినది విరాధుడనే రాక్షసుడిని విరాధుడు ఎవరు? శ్రీరాముడు విరాధుడిని ఎలా సంహరించాడో తెలుసుకుందాము శ్రీరాముడు ,లక్ష్మణుడు సీతాసమేతంగా ఆశ్రమ మండలములో గడిపి సూర్యోదయం అవుతుండగా స్నాన సంధ్యాదులు ముగించుకొని అక్కడి మహర్షులందరి దగ్గర సెలవు తీసుకొని దండకారణ్యములో నడవసాగాడు ఆ మహారణ్యములో పెద్దపులులు తోడేళ్ళు లాంటి క్రూర జంతువులూ ఎందుకో భయపడిదాక్కునట్లు అనిపించింది పక్షులు చడి  చప్పుడు లేకుండా చెట్ల  మీద కూర్చున్నట్లు గా ఉంది. అక్కడి వాతావరణాన్ని బట్టి ఆ ప్రదేశం ఘోర మృగాలకు ఉనికిపట్టుగా వారికి తోచింది. 

వారికి అక్కడ ఒక కొండంత ఎత్తున్న ఒక ఘోరాకారుడు కనిపించదు వాడు పెద్ద పెట్టున కేకలు పెడుతున్నాడు వాడిది పెద్ద నోరు, పెద్ద పెద్ద గుంట కళ్ళు విశాలమైన దేహం, మిట్టపల్లాలుగాఉన్న పెద్ద పొట్ట, అవయవాలన్నీ ఒకదానికొకటి సంభంధం లేకుండా ఎక్కువ తక్కువగాఉన్నాయి. ఒళ్ళంతా నెత్తురుతోను, మాంసముతోను భీభత్సము గా ఉండి సమస్త ప్రాణ కోటికి భయం కలిగించేలా వాడు నోరు తెరిచి కేకలు వేస్తున్నాడు. సీతారామలక్ష్మణులు చుసిన ఆ వికారాకారుడు మహోగ్రుడై భయంకరంగా అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి చటుక్కున సీతాదేవిని పట్టుకొని లేవనెత్తి భుజం మీద కూర్చోబెట్టుకుని కొంచం దూరం పోయి ర్తామలక్ష్మణులతో ఎవరు మీరు మునివేషాలు వేసుకొని ఆయుధాలు ధరించి భార్యతో నా దండకారణ్యములో ప్రవేసించారు  మీ ఆయుర్ధాయం అయిపొయింది మీరు తాపసులైతే  మీకు ఆడది ఎందుకు?నా పేరు విరాధుడు నేను ఈ అడవిలో తిరుగుతూ ఋషులను చంపి వారి మాంసము తింటు జీవిస్తున్నాను.ఈ స్త్రీని నా భార్యగాఉంచుకుని మిమ్మల్ని చంపి మీ నెత్తురు తాగుతాను కావలిస్తే నాతొ పొట్లాడండి అని అంటాడు. 

ఆ దురాత్ముడు అలా క్రూరంగా చెబుతూ ఉంటె సీతాదేవి భయంతో వణికి పోయింది.రాముడు విరాధుడి భుజం మీద ఉన్న సీతాదేవిని చూచి నోట మాట    రాలేదు  లక్ష్మణుడు క్రుద్ధుడు అయినాడు అన్నను ఓదారుస్తూ విరాధుడితో పోరుకు సిద్దమయినాడు. మండిపడుతున్న విరాధుడితో రాముడు వారి పరిచయం చేసుకొని నీవెవరు ఎందుకు దండకారణ్యములో తిరుగు తున్నావు అని అడుగుతాడు. విరాధుడు,"నేను జయుడి కొడుకును, నన్ను విరాధుడు అంటారు నేను తపస్సు చేసి బ్రహ్మ దేవుడిని మెప్పించాను.నేను ఏ ఆయుధానికి చావకుండా ఉండేటట్లు వరం పొందాను నన్ను మీరు మీ ఆయుధాలు ఏమి చేయలేవు ఈ ఆడుదానిని నాకు విడిచిపెట్టి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన దారినే వెళ్ళండి"అనిఅంటాడు.ఆగ్రహించినరాముడు విరాధుడిపై బాణాలను ప్రయోగించాడు ఆ బాణాల తాకిడికి నొచ్చి విరాధుడు సీతను భుజం మీదనుండి దింపి మహాభయంకరముగా అరుస్తూ తన శూలంతో రామలక్ష్మణుల' వైపు పరిగెత్తాడు. 

ప్రళయకాలనా అందరిని   పరుగెత్తుకొని వస్తున్నా విరాధుడిమీద రామలక్ష్మణులు మంటలు మండే బాణాల వాన కురిపించారు. విరాధుడు తన కాయాన్ని పెంచగా ఆ బాణాలన్నీ క్రిందపడిపోయినాయి. తన చేతిలోని శూలాన్ని రామలక్ష్మణుల పైకి విసిరాడు. రామలక్ష్మణులు నల్లతాచు పాములాంటి ఖడ్గాలతో విరాధుడిని కొట్టసాగారు విరాధుడు కత్తి దెబ్బలు తింటూనే రామలక్ష్మణులను తీసుకొని వన్యమృగాలతో భయంకరంగా ఉండే మాహారణ్యము వైపు నడవసాగేడు ఇది చుసిన సీత చేతులెత్తి రామలక్ష్మణులను విడిచిపెట్టమని అరిచి చెప్పింది ఈ మాటలు విన్న రామలక్ష్మణులు ఈ దురాత్ముడ్ని వెంటనే చంపి వేయాలని అనుకున్నారు.లక్ష్మణుడు విరాధుడి ఎడమ భుజాన్ని రాముడు వాడి కుడి భుజాన్ని నరికి వేశారు. క్రింద పడ్డ వాడి భారీ కాయాన్ని కాళ్లతో చేతులతో బాగా నలగగొట్టారు అయినా విరాధుడు చావలేదు రాముడు విరాధుడిని జాగ్రత్తగా పరిశీలించి ,లక్ష్మణా వీడు తపస్సు చేసి బ్రహ్మ చేత వరం పొందినవాడు వీడు ఏ ఆయుధముతో ను చావడు వీడిని పాతి  పెట్టాలి అని చెబుతాడు 

ఈ మాటలు వీన్న విరాధుడు రాముడిని తేరిపార చూచి ఓ పురుషోత్తమా నీ చేతిలో నా చావు మూడింది నాఅజ్ఞానము వల్ల నీవు ఎవరో తెలుసుకోలేకపోయినాను ఇప్పుడు అంతా తెలుసుకున్నాను నేను తుంబురుడనే గంధర్వుడిని  నేను రంభ పట్ల ఆసక్తి పెరిగి కుబేరుని కొలువు చేయడం మానివేసాను అందుచేత కుబేరుడు నాపై కోపముతో నన్ను శపించాడు అందుచేత నేను రాక్షసుడిగా మారాను నేను ఆ మహాశయుడిని ప్రార్ధించగా ప్రసన్నుడై దశరథరాముడు నిన్ను యుద్ధం లో చంపివేస్తాడో అప్పుడు నీకు శాపవిముక్తి కలుగుతుంది అని సెలవిచ్చాడు ఓ మహానుభావా నీ అనుగ్రహము వల్ల నాకు శాపవిముక్తి కలుగుతుంది రామ ఒక గుంట తీసి  నన్ను పాతి  పెట్టండి ప్రాణం పోయిన రాక్షసులను గుంటలో పాతిపెడితే రాక్షసులు పుణ్యలోకాలకు పోతారు మీరు ఒకటిన్నర యోజనముల దూరములో ఉన్న శరభంగుడు అనే మహర్షి వద్దకు వెళ్ళండి అయన వల్ల మీకు మేలు జరుగుతుంది  అని చెప్పి విరాధుడు తన రాక్షస దేహాన్ని విడిచి స్వర్గానికి పోవడానికి ఉద్యుక్తుడు అయినాడు.

విరాధుడు చెప్పినది విన్న రాముడు లక్ష్మణుడితో ఆ రౌడ్రకర్ముడికి భయంకరం అయినా ఏనుగుకు వాలే అక్కడనే ఒక పెద్ద గుంత తీయమని చెప్పి విరాధుడి గొంతు మీద కాలు వేసి తొక్కిపెట్టి నిలుచున్నాడు లక్ష్మణుడు ఆ పర్వతాకారుడి పక్కనే ఒక పెద్ద గొయ్యి తవ్వినాడు ఆ గోతిలో విరాధుడిని పెడత్రోయడానికి రాముడు వాడి గొంతు మీద నుండి కాలు తీసి అన్నదమ్ములిద్దరూ విరాధుడిని ఆ పెద్ద గోతిలో పడత్రోయ పోయినారు.ఆ రాక్షసుడు చెప్పినట్లే అన్నదమ్ములు గుంటను పూడుస్తూ ఉంటె ఆ అడవి అంతా మారుమోగేటట్లు విరాధుడు కేకలు వేయసాగేడు. విరాధుడు ఆ గుంట నుండి లేవకుండా ఉండటానికి అన్నదమ్ములు పెద్ద పెద్ద రాళ్లు వేసి గుంటను పూడ్చారు ఆ విధంగా ఆ కారడవిలో మునులకు ఆ రాక్షసుడి భయము లేకుండా చేశారు. 

***

No comments:

Post a Comment

Pages