ప్రతి ఇంటా ఉండదగ్గ పుస్తకం - రామాయణ పరివారము - అచ్చంగా తెలుగు

ప్రతి ఇంటా ఉండదగ్గ పుస్తకం - రామాయణ పరివారము

Share This
ప్రతి ఇంటా ఉండదగ్గ పుస్తకం - రామాయణ పరివారము
రచయిత: శ్రీ బుర్రా వెంకటేశం, ఐ.ఎ.ఎస్.
సమీక్ష: భావరాజు పద్మిని

 


రామాయణం లో ఉన్న 50 పాత్రలను తీసుకుని మాన్యులు శ్రీ బుర్రా వెంకటేశం, ఐఏఎస్ గారు మనకు అందించిన అమూల్యమైన పెన్నిధి - 'రామాయణ పరివారము' అనే పుస్తకం. 

రామాయణంలో ఆయా పాత్రలు ఏ విధంగా ప్రయాణిస్తాయో కూడా, క్లుప్తంగా ఆ పాత్ర వివరణ వద్ద జోడించడం ఇందులో మరొక విశేషం. ఆయా పాత్రల స్వభావాలు, ఆలోచనా విధానాలు ప్రవర్తనలు వారి నుంచి మనం తెలుసుకోవలసిన విశేషాలు కూడా తెలియజేయడం చాలా బాగుంది. చక్కని బొమ్మలు జోడించడంతో ఈ పుస్తకం పెద్దలకే కాక, పిల్లలకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది.

మనిషి మనీషి కావాలంటే ఏమి చెయ్యాలో రామాయణం లోని వివిధ పాత్రలను అధ్యయనం చేసి, ప్రతి పాత్ర ద్వారా మనకు  చాలా చక్కగా తెలియజేసారు రచయిత శ్రీ బుర్రా వేంకటేశం గారు. చక్కని ఈ పుస్తకం ప్రతీ ఇంటా ఉండదగినది.

ధర: 250rs
పేజీల సంఖ్య: 162
ప్రతులకు సంప్రదించవలసిన నెంబరు: 
9963539139

No comments:

Post a Comment

Pages