తేనె కన్నా తియ్యనిది మన తెలుగు - అచ్చంగా తెలుగు

తేనె కన్నా తియ్యనిది మన తెలుగు

Share This

'తేనె కన్నా తియ్యనిది మన తెలుగు!'

--సుజాత. పి.వి.ఎల్.   మాతృభాష అనగా ప్రధమ భాష అని అర్థం. మనం పుట్టాక అమ్మ ఒడిలో నేర్చకొనే తొలిభాషే మాతృభాష. అమ్మభాష అంటే అందరికీ ఇష్టం. మన మాతృభాష తెలుగు. తెలుగు మాటలు, పాటలు, పద్యాలు మధురాతి మధురాలు. ఉషోదయ కిరణాలు. వికసించిన కుమాలు. పసిపాప నవ్వులు. అప్పుడే పుట్టిన నవజాతి శిశువుల ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలిపారు. అమ్మ గర్భంలో ఉన్న తోమ్మిది నెలల్లో, చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు ఆలకిస్తారని, మాతృభాషను గురించి తెలుసుకుంటారని, పుట్టిన తరువాత బిడ్డ ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ విషయం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు హరినామ స్మరణని విని 'ఊ' కొట్టిన సంగతి పురాణగాథల్లో కూడా తెలుపబడినది. పిల్లలు ఏడ్చే ఏడుపులో వివిధ  రకాల ధ్వనులు కలిసి ఉన్నప్పటికీ, మాతృభాషకే ప్రాధాన్యత శిశు ప్రాయంలోనే ఇస్తారని తెలుస్తోంది. ఎలాగంటే తల్లి మాట్లాడే మాటల్నిత్వరగా అర్థం చేసుకుంటారు. అమ్మ జోలపాడితే నిద్ర పోవడం, మందలిస్తే ఏడుపుముఖాన్ని పెట్టడం వంటి భావాలను ప్రదర్శించడం మనం గమనిస్తూనే ఉంటాం!.  అందుకే ప్రతిబిడ్డకి తల్లి తొలిగురువు. తల్లి ఒడిలోతొలిసారి నేర్చిన భాష కాబట్టే మాతృభాష అని పేరొచ్చింది. మన మాతృభాషైనట్టి తెలుగు భాష ప్రాచీన భాష. 'దేశభాషలందు తెలుగులెస్స' అని శ్రీ కృష్ణరాయలువారు తెలుగు ప్రాశస్త్యము గురించి పొగిడారు. తేనెలూరు తెలుగు భాష ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల అధికారిక భాష. తెలుగు భాష ద్రవిడ భాషల్లో ఒకటి. 2008 లోమన మాతృ భాష అయిన తెలుగు భాషకి మిగతా భాషలైన సంస్కృతం కన్నడ తమిళ భాషలకు భారత ప్రభుత్వం 'ప్రాచీన భాష' హోదాను కల్పించింది. తెలుగుభాష క్రీ.పూ5-4శతాబ్దం అనగా 2500--2400 ఏళ్ళ క్రితం ద్రావిడ భాషల్లో నుండి విడిపోయి స్వతంత్ర భాషగా ఏర్పండింది. 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' గా విశేష జనాదరణ పొందింది మన మాతృభాష తెలుగు.  అజంతా భాషైనా తెలుగు భాషని మాట్లాడే వారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికమనే చెప్పాలి. నేడు 90%ప్రజలుతెలుగు మాట్లాడుతున్నారు. ఇంతమంది ఇష్టంగా మట్లాడే తెలుగు మన మాతృభాషకావడం ఎంతో అదృష్టం, ఆనంద దాయకం. తెలుగు పలుకు, బడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. సామాన్య ప్రజానీకం కూడా కవిత్వ ధోరణిలో తెలుగును తెగ మెచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. త్రిలింగ పదము నుంచి 'తెలుగు' పదం వెలువడింది. తేనె వంటిది కనుకనే ''తెనుగు" అంటాము. అయితే, యాస ఏదైనా భాష ప్రధానం కాబట్టి తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి సరిహద్దులు దాటి విస్తరిస్తోందని చెప్పొచ్చు. భాషాసాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు,అవగాహన పొందేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషకి ఆయన పెద్ద పీట వేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి నిత్య వ్యావహారిక భాషలో ఉన్న తెలుగు అందాల్నీ, సొబగుల్నీ తెలియజెప్పిన మహనీయుడు. మన మాతృభాషఅయిన తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలం పురుషుడు. మాతృ భాష ఏదైనా కన్నతల్లి తో సమానం. మనంమనతల్లిని ఎంత గౌరవిస్తామో, మన మాతృ భాషని కూడా అంటే గౌరవించాలి. ఎవరి భాష వారికి గొప్పది. ఏ భాషనైనా ఏ యాస నైనా తక్కువ చేసి మాట్లాడకూడదు. మన మాతృ భాష తెలుగుకి చాలా గొప్ప చరిత్ర ఉంది. తెలుగు భాష సామాన్యమైన ప్రజలు కోసం క్లిష్టమైన సంస్కృతం నుండి ఆవిర్భవించింది. ఆంగ్లం కన్నాఎక్కువ అక్షరాలు, శబ్దాలు,పదాలు మన మాతృ భాషలోనే ఉన్నాయి. పలికే విధానాన్ని బట్టి ఎదుటివారికి మన భావం వ్యక్తపరచ గలిగే ప్రత్యేకం కేవలం మాతృభాషకు సాధ్యం. ఎన్ని ఇతర భాషలు నేర్చుకున్నా, అమ్మ భాషలోనే సంభాషించుకోవడం వల్ల భాష గొప్పతనం, భాషలోని తియ్యదనం తెలుస్తుంది. అప్పుడు మాతృ భాషాభిమానులు మరింత పెరిగే అవకాశముంది. మాతృభాష అంతరించి పోకుండా చరిత్రలో కలకాలం నిలిచిపోయే అవకాశముంది. 

***

No comments:

Post a Comment

Pages