శివం - 82 - అచ్చంగా తెలుగు

శివం - 82 

రాజ కార్తీక్ 


(అయ్యన్న రాజు గారిని మనహర సిద్ధూ... తన తల్లిని రుణ విముక్తి రాలు... చేయమని.. మనవి చేయటం దానికి ఆయన ఒప్పుకోవడం... తన కుటుంబం అంతా ఆశ్చర్యపడటం...)


 పౌర్ణమి తర్వాత జరగబోయే సంఘటనలకి.. తన తల్లి ఎంత ఆశ్చర్య పడుతుందో ఎంత బాధ పడుతుందో తన ప్రతిభ కి ఎంత గొప్ప గుర్తింపు లభించింది.. అని చూసి సంబర పడుతుంది.. అని ఆనంద పడసాగాడు.. హర సిద్ధుడు.. ఇకపోతే తన రాజ్యానికి వరంగల్ లభించిన.. శ్రీ చక్రం లాంటివర ప్రసాదిత.. చిహ్నాన్ని.. గర్భగుడిలో ఎలా చెక్కాలి అనే తలంపుతో ఉన్నాడు.

హర సిద్ధుడు ఇంటికి వెళ్లి.. తన కుటుంబానికి అంతా మంచి జరగబోతుంది అని.. ఇక మనకి కష్టాలు లేవని రాజుగారి కొలువులో ఉన్నతమైన అవకాశం లభించిందని.. ఇకపైన నీ రుణాలు నీ బాధలు అన్ని మాఫీ అయిపోతాయి అని తన తల్లికి ధైర్యం చెప్పాడు.. కానీ తన సోదరుడికి తను ఏదో చెప్పపోయినా తాను వినకుండా వెళ్ళిపోయాడు.. అది ఎందుకో కూడా తర్వాత చూద్దాం.

అంతా బాగున్నప్పుడు ఆనంద క్షణాలు మరింత బాగా గుర్తుకు వస్తాయి.. ఏది బాగోన్నప్పుడు.. జీవితంలో జరిగిన బాధ సంఘటనలు మరిన్ని.. గుర్తుకు వస్తాయి.. ఆనందం వచ్చినప్పుడు తాత్కాలికమని.. బాధ కలిగినప్పుడు ఇది కూడా తాత్కాలికమే అని.. మనసులో పెట్టుకొని  వ్యవహరించండి. అప్పుడు మీ మనసు పడే మానసిక సంఘర్షణ తగ్గిపోయి.. ప్రశాంత మన ప్రవృత్తితో జీవించగలరు.. తెలిసో తెలియకో మన హర సిద్ధూ చేసింది అదే. అంతేకాదు తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవడం ఏ కాకుండా మళ్లీ ఆ తప్పు చేయకుండా నన్ను క్షమాపణలు వేడుకొని తదనుగుణంగా ప్రవర్తించాడు.. తనకున్న ఉన్నతమైన ప్రతిభ.. ఖచ్చితంగా లోకకళ్యాణం కోసం ఉపయోగపడాలని నేను కుంభన్న  లాగా వచ్చాను, హర సిద్ధుడు కోరిన దానికన్నా.. ఎక్కువగా జనరంజకంగా తనకి దక్కబోతోంది.. అది ఎలానో ముందు ముందు మీకే అర్థమవుతుంది.

చెప్పిన విధంగా గా.. ఆ పాత భవంతిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు హార సిద్దుడు.. శుభ్రం చేస్తూ చేస్తూ తన సృజనాత్మకత ఉపయోగించి . ఆ భవంతి చుట్టూ అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు రాజోద్యోగులు సాయం తో.. చూడటానికి కన్నుల పండుగగా చక్కని ఆహ్లాదకరమైన స్థలము గా ఉంది ఆ ప్రాంగణం అయ్యన్న రాజులే కాకుండా హర సిద్ధుని వ్యతిరేకులు అందరూ కూడా మెచ్చుకునే విధంగా తీర్చి దిద్దాడు.

తన తల్లి మాత్రం కొడుకు ఒక దారిలో పడ్డాడు ఇక పెళ్లి చేద్దాం.. అని అనుకుంటూ భగవంతుడు తన కుటుంబానికి ఒక మంచి దారి ఇచ్చాడని ఆనంద పడసాగింది.. హర సిద్ధుడు మాత్రం.." ఈ పౌర్ణమి దాకా ఆగమ్మా తర్వాత నువ్వు అనుకున్న దాని కన్నా ఇంకా గొప్పగా అన్ని పనులు జరుగుతాయి "అని అనుకున్నాడు.. పౌర్ణమి తర్వాత కుంభన్న రాజ్యంలో కొలువు సంపాదించి . ధర్మయ్య బాబాయి సాయంతో రాచ మర్యాదలత.. తన తల్లిని తన సోదరుడిని.. ఆ రాజ్యానికి రప్పించుకొని.. వారికి కి కుంభ స్వామి మహత్యం చెబుదామని అనుకున్నాడు.. ఇంతవరకు బొజ్జ లింగం ఇతివృత్తం.. తనతో స్నేహం చేసే తాత కు తప్ప ఎవరికీ చెప్పలేదు.

హర సిద్ధుని కి పరిస్థితులన్నీ ఆశాజనకంగా ముందుకు వెళ్తున్నాయి.. మునుపెన్నడూ లేని జీవితాశయం తో ముందుకు సాగుతున్నాడు.. ఏమిటి తన జీవితాశయం.. తన కుటుంబానికి ఒక ఆధారం తాను ఉన్నా లేకపోయినా ఏర్పాటుచేసి.. ఘనమైన ఖననం మైన  శిధిలమైన.. తిరిగి బాగు చేసే.. వాటిని సౌందర్య భక్తి భరితంగా మలచి.. ఆలయాల ద్వారా ధర్మసంస్థాపన చేస్తూ ప్రజలకి మహిళలకి.. దేశభక్తి నేర్పుతూ.. ధర్మాన్ని దేశాన్ని సగౌరవంగా నిలబెట్టడమే అతని లక్ష్యం.. అతని లక్ష్యం గొప్పది కాబట్టే.. నేను అతని కోసం కదిలాను.. గొప్ప గొప్ప లక్ష్యాలు ఉండటమే కాదు.. గొప్ప గొప్ప పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. అలాంటి మరొక పరీక్షే హర సిద్ధుడు ఎదుర్కోవాలి... సాధారణ జీవితాన్ని కోరుకునే వారికి సాధారణ పరీక్షలు మాత్రమే ఉంటాయి.. ఉన్నతమైన జీవితాన్ని కోరుకునే వారికి ఉన్నతమైన ఆశయం కోసం పనిచేసే వారికి.. ఉన్నతమైన పరీక్షలు ఉంటాయి.. హర సిద్ధుడు ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉన్నతమైన జీవితం కోరుకునే వ్యక్తి.. అందరికీ ఒకే న్యాయం.

హర సిద్దు తో స్నేహం చేసిన తాత కూడా.. తనకి వృద్ధాప్యం కారణంగా ఓపిక లేకపోయినప్పటికీ, అతికష్టం మీద తాను బాగు చేస్తున్న గుడి కి వచ్చి.
". హర సిద్ధ.. ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నావూ.. మళ్లీ" కుంభన్న.. వస్తాడేమో అడుగు చూడరాదా..
హార సిద్ధుని కి మనసులో.. కుంభన్న . గా నేను వచ్చినది నేను తనతో మాట్లాడింది నేను సరదాగా తిరిగి నది.. నేను సమాధానపరచినిది.... అన్నీ గుర్తు చేసుకొని.. ఒక తన్మయత్వానికి లోనయి.." తాత గతంలో మనిద్దరం వాగ్వివాదం చేసుకునేవాళ్ళం... ఎందుకో ఆయన దర్శనం తర్వాత నా మనసంతా.. స్థిమిత పడింది.." "మళ్లీ కుంభమన్న వస్తానంటే.. ఇంకా గట్టిగా వాగ్వివాదం చేసుకుంటావా" అని చలోక్తి విసిరారు తాత. "ఏదో ఒక రూపంలో మళ్లీ నువ్వు గుర్తుపట్టలేనట్టు గా . వస్తాడేమో ఈ సారి గట్టిగా మనసుపెట్టి చూడవయ్యా హార సిద్దా.. నేను ఎక్కడో ఊరికి ఉత్తరాన ఉంటా.. నువ్వు వచ్చి చెప్తే కానీ నాకు ఏ వార్త తెలియదు.. అప్పుడప్పుడు బయటికి వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ నీ శిల్ప శాల ని పరికిస్తూ ఉంటాను.."అంటూ సెలవు తీసుకున్నాడు
చాలా తక్కువ రోజుల్లో ఆలయాన్ని ఎంతోబాగా సుందరి కరించి.. ఎంతో గొప్పగా శిల్పాలను చెక్కి.. ఇక రాజు గారు చెప్పిన విధంగా.. ముద్రికను చెప్పవలసిన సమయం ఆసన్నమైంది..

రాజు గారి కోసం రాజదర్బార్ కి వచ్చాడు హార సిద్దు.
రాజు గారు అతని స్వాగతించిన విధానం చూసి హర సిద్ధుని వ్యతిరేకులు అందరూ కోపంతో రగిలిపోయారు..

"మహారాజా మీ రాజ్య ఉద్యోగుల సహాయంతో ఎటువంటి ఆటంకం లేకుండా ఇప్పటి దాకా పని జరిగినది.. మీతో నేను ఆంతరంగిక0 గా మాట్లాడవలెను.." దాని కి అనుమతి ఇచ్చిన రాజు హర సిద్ధుని లోపలికి తీసుకొని వెళ్ళాడు..

"రాజా పని అంతా అయిపోయినది దాదాపు.. ఇక మిగిలినది ఆ రాజముద్రను చెక్కటమ.. నా తల్లి వంటి మహారాణిని మీరు తీసుకు వచ్చిన పిమ్మట నేను గతంలో చెప్పిన విధంగా.. కొద్దిపాటి తేడా కూడా లేకుండా.. సజీవంగా ఆ ముద్రికను.. గర్భగుడిలో.. ఉండే శివలింగమునకు.. వెనకాల ఆరా వచ్చిన విధముగా.. చిత్రీకరించి.. మీరు కోరిన విధంగా ఫలితం తీసుకురాగలను."

అయ్యన్న రాజు మరియు ఆ వృద్ధ మంత్రి.. ఏదో ఆలోచిస్తూ ఉండగా.. హర సిద్దు.. "మహారాజా నాది ఒక చిన్న ఉపాయం..  ప్రతిష్ట.. కేవలం రాజ కుటుంబీకుల సమక్షంలోనే జరగాలని అందులోనూ పూర్వపు రాజులైన వారసులైన మీరు రాణి గారు మాత్రమే ఉండాలి అని చాటింపు వేసి.. ఆ సమయంలో లో నేను ముద్రికను చిత్రీకరిస్తారు వెనువెంటనే మా రాజా పురోహితులు చేత మీరు ప్రతిష్ట గావించండి ఎట్లాగో అన్ని సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రణాళిక బాగా పనిచేస్తుంది..
హార సిద్ధు చెప్పిన మాటలకి.. రాజుగారు సరి అని.. మరుసటి రోజు హర సిద్ధులు చెప్పిన విధంగా గా చాటింపు వేసి.. శుభారంభం చేశారు.."

రాజ పరివారం ఆ నూతన ఆలయానికి వచ్చి పరిశుద్ధుని పనితనం చూసి నేర్చుకోవడమే కాకుండా తనకు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని.. ఆశీర్వదించారు..
మహారాణి గారు వేరే ఆభరణాలు లేకుండా కేవలం రాజముద్రిక మాత్రమే ధరించి వచ్చారు

ఆలయంలో శివలింగాన్ని ముందే . ఉంచారు దానికి ప్రాణప్రతిష్ట చేయటం ఒక్కటే జరగవలసినది,ఈ లోపు హార సిద్దు రాజముద్రిక ను సిద్ధం చేయాలి

రాణి గారు నాకు నమస్కరించి రాజ ముద్రికలు తీయకుండా మెడలో నుంచి , హారసిద్ధుని కంట ఎదురుగా నిండుగా ఆ మద్రిక ఒకటే కనపడే విధంగా నుంచున్నారు.. రాజుగారు సైతం హార సిద్దు తీక్షణత చూసి ఆశ్చర్యపడ్డాడు..
ఈ లోపు చిన్న వర్తమానం అని.. అత్యవసరమని.. ఒక భక్తుడు పిలవడంతో రాజు గారు నేను వెంటనే వస్తాను మీరు ఇలా పాదముద్రికలు గావించండి అని బయటికి వెళ్లాడు..
పనిలో నిమగ్నమైన హర సిద్ధుడు.. రాజు గారి వెళ్ళటాన్ని గమనించలేదు..

ఉన్నపళంగా ఆకాశం మేఘావృతమై ఉంది..
పెద్దపెద్ద ఉరుములు మెరుపులు రావటం మొదలయ్యాయి..
గాలి బలంగా వీస్తోంది..

పగటిపటే చిమ్మ చీకటి ఆవరించింది..
సరిగ్గా రాజముద్రిక ను చెక్కటం పూర్తిచేశాడు.. కోరు గాలికి దీపాలు కూడా కొండెక్కాయి..
ఉన్నపళంగా భూ ప్రకంపనలు..
భూమి కొంచెం కంపించింది..

ఆ భయోత్పాతం లో మహారాణి స్పృహ కోల్పోయింది.. సూర్యుని పూర్తిగా మేఘాలు కమటం తో దాదాపు చిమ్మచీకటి అయింది..
మహారాణి కింద పడటంతో.. హర సిద్ధుడు. ఆమెని నీ రెండు చేతులతో మో సుకొని గర్భగుడిలో నుండి బయటకు తెచ్చి .. ఆమె స్పృహ లో కి వస్తుంది అన్నట్లు ఎదురు చూస్తున్నాడు
ఈ లోపు మహారాజుగారు గుడిలోకి వచ్చారు.. రాణి గారు స్పృహలోకి రావడం గమనించి .. ఆమె మెడలో ఉన్న రాజముద్రిక మాయమవడం చూశారు..
రాజభటులు పిలవా గానే అందరూ వచ్చారు...
అందరూ రాజముద్రిక కోసం వెతుకుతున్నారు.. హర సిద్దు కూడా.. ఆలయం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ కూడా ఆఖరికి ఒక చిన్న కర్పూరము ముద్దు కూడా బయటికి పోలేదు.. అన్ని వస్తువులు అంతే ఉన్నాయి.. ఒక్క రాణిగారి రాజముద్రిక తప్ప.. అది ఆ రాజ్యానికి ఏ రాజముద్రిక రాజేశ్వరి దేవి వరం ఏమైనది..
మహారాజు కోపంగా.."ఈ హర సిద్ధుని.. ఈ దొంగని బంధించి.. చెరసాలలో వేయండి" అని ఆజ్ఞ జారీ చేశాడు

హర సిద్ధుడు ఖిన్నుడయ్యాడు.. చూద్దాం ఏం జరగబోతుందో!

No comments:

Post a Comment

Pages