మానసవీణ-30 - అచ్చంగా తెలుగు

 మానసవీణ-30 

 సాలూరు సంతోషి (విజయనగరం)


దేహామనే పరికరం ప్రకృతి తయారు చేసిన అద్భుతం

ఆత్మకు రూపం తొడిగి ప్రాణాన్ని ప్రయోగశాలగా చేసి

మానవుడికి ఓ గమ్మత్తైన పరీక్ష పెడుతుంది

మనసులగ్నం చేసి చూస్తే అంతరంగ పుస్తకంలో సాగే

పయనానికి తోవ చూపే సమాధానాలు ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి


జీవితమనే ప్రయోగం విజయవంతం అయ్యేది ఆత్మ పరిశీలన ఉన్నవాడికే...

అంటూ తన భావాలను కాగితం పై రాస్తూ తెలియని ఆవేదనతో ఆలోచనలో పడ్డాడు యువకవి యుగంధర్. 

చిననాటి నుండి సమాజాన్ని దేవాలయంగా చూడాలనే సత్సంకల్పం తో ఎదిగిన PG విద్యార్థి, స్వామి వివేకానంద యువజన సంఘ నాయకుడు. తరచు కృషివలరావు గారి గురించి తెలుసుకుంటూ ఆయన మంచితనానికి మనసులోనే  అభిమానాన్ని పెంచుకుంటూ, రంగులు మార్చే రాజకీయాల్లో కృషిసార్ లాంటి స్వచ్చమైన మనసున్న వాళ్ళు చాలా అరుదు అందుకే యుగంధర్ ఆయనకి బాగా ఆకర్షితుడయ్యాడు.

హఠాత్తుగా ఓ రోజు పేపర్లో కృషి సార్ కి కారు ప్రమాదం జరిగింది అన్న వార్త చదవగానే జీవచ్ఛవంలా ఉండిపోయాడు యుగంధర్. సమయానికి రక్తమంది కృషి సార్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇంకా స్పృహ లోకి రావడానికి సమయం పడుతుందని, కొన్నిరోజులు తరువాత వచ్చిన వార్త యుగంధర్ లో మళ్లీ జీవం తిరిగి  వచ్చినట్టు అయ్యింది.

యుగంధర్ నాన్నగారి స్నేహితుడు కృషీసార్ PA  ప్రసాద్ రావు గారు. అపుడప్పుడు ఆయన్ని కలుస్తూ ఉండేవాడు  యుగంధర్. ఓ రోజు మాటల్లో PA  ప్రసాద్ రావు గారుసందర్భం వచ్చి మానస, GTR  గారి గురించి చెప్పారు. యుగంధర్ తన మనసులో ‘ఇలాంటి ఉన్నత వ్యక్తిత్వం గలవారు ఇంకా సమాజంలో ఉన్నారా’ అని ఎంతో ఆనంద పడ్డాడు. ఇంటికి వస్తూ తన తండ్రి నిన్నటి జీవితాన్ని తలచుకున్నాడు. (తన - పర బేధం లేకుండా చేతనైనా సహాయాన్ని చేస్తూ అందరి ఆనందంలోనే తన ఆనందం ఉందనుకునే మంచు బిందువు లాంటి మనసున్న మా నాన్నను, స్వార్థంతో సర్వస్వం దోచుకొని చివరికి నిస్సహాయుడిగా మార్చేసిన మనసు లేని ఈ సంఘాన్ని మరమ్మత్తు చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు.)

త్వరలో రాబోతున్న వివేకానంద జన్మదిన వేడుకల్లో భాగంగా యుగంధర్ దాదాపు ఒక ఐదారు కళాశాలల ప్రిన్సిపాల్స్ తో మాట్లాడి ఒక భారీ సభ ఏర్పాటు చేసి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మానస, GTR సార్, కృషి సార్ లాంటి వాళ్ళ ని పిలిచి యువతరాన్ని తట్టిలేపితే ఒక అడుగు సమాజ సంస్కరణ వైపు పడినట్టే అని ఆలోచించి కార్యాచరణ మొదలుపెట్టాడు యుగంధర్.

ముందుగా ప్రసాద్ రావు గారకి ఫోన్ చేసి కృషి సార్ గారి ఆరోగ్యం గురించి అడిగాడు. ఆయన “కృషి సార్ ఇంకా ఆస్పత్రి లో నే వైద్యుల పర్యవేక్షణలో నే ఉన్నారు బాబు, ఏంటి విషయం?” అని అడిగారు. యుగంధర్ తన ఆలోచనని వివరించాడు వినగానే ప్రసాద్ గారు అభినందించి,  “నీ లాంటి  యువకులు ఈ సమాజానికి ఎంతో అవసరం బాబు! కృషి సార్ గారి పరిస్థితి ఇలా లేకపోతే తప్పకుండా వచ్చేవారు. సార్ రాలేదని నీవు నిరశాపడకు. నీలాంటి అభ్యుదయ భావాలున్న వారంటే సార్ కి చాలా ఇష్టం, మానస గురించి నీకు చెప్పాను, గుర్తుందా? ఆ అమ్మాయి కూడా ఎప్పుడూ ఈ తరం పిల్లలా కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ అందరికీ సేవచేస్తూ, ఆదర్శంగా నిలబడుతుంది. అందుకే మానస అంటే అతనికి ఎంతో అభిమానం. నీ వెంట సార్ ఉన్నారు అనుకుంటూ కార్యక్రమాన్ని జరిపించు, ఉంటాను.” అని ఫోన్ పెట్టారు ప్రసాద్ గారు. కృషి సార్ రారు అనగానే బాధగా అనిపించిన ప్రసాద్ గారి మాటల్లో అదృశ్యంగా కనిపించిన కృషి సార్ ప్రోత్సహాన్ని తలచుకొని  ఏకలవ్యుడిలా కృషి సార్ ని  మనసున నిలుపుకొని ముందడుగు వేసాడు యుగంధర్.

ఉదయాన్నే లేచి యుగంధర్ GTR సార్ ని కలవడానికి బయలుదేరాడు. ఆయన గురించి వినడమే తప్ప ఎన్నడూ కలవలేదు ఇదే మొదటసారి. కాలింగ్ బెల్ కొట్టాడు, ఈ లోపల మదిలో ఎన్నో ఆలోచనలు మెరుపు వేగంతో వస్తూ వెళుతూ ఉన్నాయి. ఇంతలోనే  చిరునవ్వు నవ్వుతూ ‘రా బాబు కూర్చో. నువ్వే కదా నా అపాయింట్ మెంట్ తీసుకున్నది’ అని ఆప్యాయంగా పలకరించగానే ఇప్పటివరకూ మెదడుని తొలిచేసిన ఊహాలన్ని మాయమయ్యి మనసంతా పచ్చటి చేనులా మారి హాయిగా అనిపించింది. భుజం పై చేయి వేసి ‘బాబు ఏమయ్యింది అలా ఉండిపోయావ్?’ అనగానే... “నమస్తే సార్.  నా పేరు యుగంధర్ PG చదువుతున్నాను, స్వామి వివకానంద యువజన సంఘ నాయకున్ని, కృషి సార్ అభిమానిని, కవిత్వం రాస్తుంటాను. కృషి సార్ PA ప్రసాద్ గారు మా నాన్న గారి స్నేహితుడు. అతని ద్వారానే మీ గురించి, మానస గారి గురించి తెలుసుకున్నాను,  నా ఆశయం ఒకటే సార్... 

“మనుషుల మనసుల్ని కమ్మిన స్వార్ధపు ముసుగుని తొలగించి అంతర్లీనమై ఉన్న జ్యోతులను వెలికి తీయాలని” 

సేవా దృక్పథం ఉన్న మీలాంటి వారు నేటి యువతరానికి  మార్గదర్శకులు. మనిషి మాయమై పోతున్నాడు అనుకునే ఈ తరుణంలో  మీరు, మానస గారు, కృషి సార్  అలా అనుకోవడం తప్పు అని చెప్పకనే చెబుతున్నారు” అన్నాడు యుగంధర్. యువకవి మాటలు GTR గారి మనసుని కదలించాయి. “బాబు!  నీ మాటలు వింటుంటే మా మానసే గుర్తుకు వస్తుంది. తను కూడా నేటి తరం లో పుట్టిన మరో మదర్ థెరిస్సా, ఝాన్సీ లక్ష్మీబాయి... ఇలా చెప్పు కుంటే పోతే పరిపూర్ణ వ్యక్తిత్వానికి, మానవత్వాన్ని కి మానస నిర్వచనం గా నిలుస్తుంది” అన్నారు GTR గారు.

“నేను తప్పకుండా సభకి హాజరవుతాను. మరి నేను వస్తాను సార్” అని మానస దగ్గరికి  బయలుదేరాడు. కానీ యుగంధర్ వెళ్లేసరికి మానస అక్కడ లేక పోవడంతో ఆశ్రమంలో తన ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళాడు.

ఆరోజు రాత్రి మానస కి ఫోన్ చేసాడు యువకవి యుగంధర్. తన పరిచయం చెప్పి తాను నిర్వహించాలనుకుంటున్న కార్యక్రమం ఉద్దేశ్యాన్ని చెప్పాడు. వెంటేనే మానస “మీ సంకల్పం లో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇంకెవరు వస్తున్నారు?” అని అడగగానే యుగంధర్ “GTR గారు వస్తున్నారు, నా  దైవమైన కృషి సార్ అనారోగ్యం వల్ల రాలేక పోతున్నారు” అని ఆర్ద్రంగా చెప్పాడు. కృషి సార్ పేరు వినగానే మానస కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. “తప్పకుండా వస్తాను” అని ఫోన్ పెట్టేసింది.

అనుకున్న ప్రకారం ఆరోజు సుమారు 2000 మంది యువసంద్రం మైదానమంతా నిండింది. నిలువెత్తు వివేకానందుల వారి పటం స్టేజి పై, ఫ్లెక్సీ ల ఆర్భాటం ఏమి లేకుండా ప్రశాంతగా ఉంది వాతావరణం. ‘సంఘాన్ని సంస్కరించే కర్షకుడే కవి’ ఈ మాటకి కట్టుబడ్డ వాడు యువకవి యుగంధర్. స్టేజి పైకి వచ్చి పొగడ్తల పన్నీర్లు జల్లకుండా స్వచ్చమైన మనసుతో ఆహ్వానించాడు. మానస గారిని, GTR గారిని అంతా కలసి వివేకానంద చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి నమస్కరించి, ఎవరి స్థానంలో వారు కూర్చున్నారు.

యుగంధర్ సభని ఉద్దేశిస్తూ మాట్లాడం ప్రారంభించాడు... “ప్రియాతి ప్రియమైన నా మిత్రులారా సభకి విచ్చేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. సోదరులారా వర్తమానం, భవిష్యత్తు మన పిడికిల్లోనే ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించి పిడికిల్నించి ఒక్కొక్క వేలిని వదిలి పెట్టేస్తూ ఉంటే, చేజారిది మాత్రం తిరిగి తీసుకురాలేని విలువైన సమయం” అంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లడుతూ ఉంటే ఒక యువకుడు లేచి “అంటే మీ ఉద్దేశ్యం  మా యువతరమంతా తప్పులు చేస్తూ సమయం వృధా చేస్తున్నామంటున్నారా? సరదాగా  ఉండడం కూడా తప్పేనా?” అని ప్రశ్న సంధించాడు. వెంటనే మానస మైక్  అందుకొని  “నేస్తమా, మంచి ప్రశ్న వేసావ్. సరదాగా ఉండడం అంటే  ఏమిటో చెప్తారా?” అని అడగగానే ఆ యువకుడు “సినిమా, గేమ్స్ , వీకెండ్ పార్టీస్....” అని చెప్పాడు. 

“సరే నువ్వు అనుకుంటున్నా సరదాలేవైతే ఉన్నాయో అవి హద్దు మీరకపోతే సరదాగానే ఉంటుంది. మితిమీరితే ప్రమాదకారిగా మారుతాయి. మనం రోజూ వినటం లేదా సెల్ గేమ్స్ కి బానిసలై, మత్తు పదార్థాలకు అలవాటు పడి, డబ్బు కోసం పెడ దారులు తొక్కడం, ఫ్యాషన్ మోజులో పడి విచ్చలవిడిగా తిరగడం, సైబర్ నేరాలకు పాల్పడడం, బెట్టింగుల్లో  డబ్బును పోగుట్టు కోవడం, క్షణిక ఆవేశాలకి, ఆకర్షణలకు లోనై ఆత్మహత్యలు  చేసుకోవడం, అత్యాచారాలు చేయడం... ఇలా రోజుకి ఎన్నో... ఇలా చేసిన వారిలో యువత లేదంటారా?” అని ఆదిశక్తి లా ప్రశ్నించింది మానస.

సభలో ఇంకొక యువకుడు లేచి “మీరు చెప్పింది నిజమే. కాని పోలీసులు, ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఎందుకు అరికట్టలేకపోతున్నారు?” అని అడిగాడు.  దానికి సమాధానంగా GTR గారు ఇలా చెప్పడం ప్రారంభించారు “నువ్వు అడిగింది నిజమే! అయితే నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడైనా నీ కళ్ళముందు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఎదిరించగలిగావా?” అనగానే యువకుడు మౌనంగా ఉండి పోయాడు. అప్పుడు GTR గారు మానసని, యుగంధర్ ని చూపిస్తూ, “మీకు ఎవరో గురించి చెప్పడం కాదు. మీ ముందు ఉన్న ఈ యువకిరణాలు మీ తోటివారే! కాని, ఈ మానస ఓ అనాథశరణాలయం లో పెరిగి, సేవాభావమే లక్ష్యంగా పెట్టుకొని, అడుగడుగనా తనని తాను ఉలిపట్టి, అందరికీ ఆదర్శంగా నిలిచే శిల్పంలా మారుతూ,  నిస్వార్థంగా ఎదుటి వాడి ఆనందంలోనే తన ఆనందం ఉంటుందని భావిస్తుంది. అలాగే ఈ యుగంధర్ ఇతడు మొన్న నా దగ్గరికి వచ్చి తను ఇలా కార్యక్రమం నిర్వహిస్తున్నా అని చెప్పి తన ఆశయాన్ని చెప్పాడు. వెంటనే నేను ఇతని గురించి తెలుసుకోవడం జరిగింది. తన తండ్రి చెప్పిన నీతిని నమ్మి చివరికి సమాజం చేతిలో మోసపోయాడు. మామూలుగా అయితే సమాజం పై కోపం పెంచుకొని, తన తండ్రికి జరిగిన అన్యాయానికి బుద్ది చెప్పాలి. కాని ఈ అబ్బాయి నా దగ్గరకి వచ్చి ‘సమాజాన్ని సంస్కరించాలి అనుకుంటున్నా’ అన్నాడు. కవిగా మనిషి మనసుని శుద్ది చేయాలి అనుకున్నాడు. చూడండి, యువత వ్యక్తిత్వం పై దేశ భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. స్త్రీ పురుషులు  ఇరువురికి గుణం ప్రధానం. మనసుని అదుపు తప్పనీయకుండా ఉంచుకుంటే మీరంతా జాతి రత్నాలుగా నిలిచి పోతారు. నా మాటలు గుర్తుపెట్టుకొని మీరంతా ఈరోజు రేపటి భవిష్యత్తుకి  సక్రమమైన మార్గాన్ని ఎంచుకుంటామని ప్రమణం చేయ్యండి” అని GTR గారు మానస, యుగంధర్ తో కలసి యువత అందరిచేత ప్రమాణం చేయించారు. సభ అయిన తరువాత యుగంధర్ తను రాసిన కవిత సంకలనం GTR గారికి, మానసకి ఇచ్చి,  వీడ్కోలు పలుకుతూ, కృషి సార్ ఆరోగ్యం కుదుట పడగానే మనమంతా కలవాలని” చెప్పాడు.

***

No comments:

Post a Comment

Pages