నాకిప్పుడే తెలిసింది... - అచ్చంగా తెలుగు

నాకిప్పుడే తెలిసింది...

Share This

 నాకిప్పుడే తెలిసింది...

లక్ష్మీ రాధిక 
చీకటైతే ఆకాశమూ సముద్రమూ 
ఒకేరకం నీలిరంగుని పూసుకుంటాయని
వెన్నెల కురిసినప్పటి అందమంతా
సన్నటి జల్లులై ప్రకృతిని అల్లుకుంటాయని

మత్తుగా కదులుతున్న చందమామకి మాటలొచ్చి
ఆగకుండా అల్లిబిల్లి కధలేవో కల్పించి చెప్తుందని
పుస్తకంలో దాచ్చుకున్న నెమలీకలు ఎగిరి
నక్షత్రాలుగా మారి వెలుగుతుంటాయని..

మౌనాన్ని ముసుగేసుకున్నట్టుండే కాలం
పరవశాన్ని పులకరించేంతగా పలకరిస్తుందని
రాత్రయితే కొన్ని అద్భుతాలకు తెరతీసేందుకే
నిద్రను కౌగిలించి కలలు కంటామని
ఓహ్.. ఎన్నెన్ని మృదుకంపనాల ఉలికిపాట్లో

అవును.. 
భావకులు అంతుచిక్కని మెత్తనివారు కాబోలు
నీలాగా..
పువ్వులను లాలిస్తూ పదాలుగా మార్చేస్తారు.

***

No comments:

Post a Comment

Pages