అచ్చంగతెలుగుకు జోక్స్! - అచ్చంగా తెలుగు

అచ్చంగతెలుగుకు జోక్స్!

ప్రతాప వెంకట సుబ్బారాయుడురాజారాంః నిన్న ఆఫీసుకు రాలేదేంటోయ్..రఘూ?
రఘుః మొన్న మా ఆవిడ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ కు లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మర్చిపోయా, అందుకని నిన్న సెలవు పెట్టించి మరీ..క్లాసు పీకింది.

***
ఒక పార్టీలో- రత్నేష్ రాజేష్ తో,
"మీ తీరని కోరిక ఏవన్నా ఉందా?"
"ఆఁ..మా ఆవిడతో సెల్ఫీ"

***
" నీ పేరు మీద యూ ట్యూబ్ ఛానల్ పెట్టి, 'మొగుణ్ని ఎలా ఉపయోగించుకోవాలి' అన్న సిరీస్ అప్ లోడ్ చేయడం బాలేదు జిన్నీ, లైక్ లు పెరుగుతున్నకొద్దీ, నా పరువంతాపోతోంది"

***
నిన్న తాగి బాస్ ను బండ బూతులు తిడుతూ డాన్స్ చేస్తే, మావాళ్ళలో ఎవడో ఒకడు దాన్ని యూ ట్యూబ్లో పెట్టాడు. అది వైరల్ అయింది. నా బతుకు బస్టాండ్ అయింది.

***

No comments:

Post a Comment

Pages