శ్రీరుద్రంలో విశేషాలు - 6 - అచ్చంగా తెలుగు

శ్రీరుద్రంలో విశేషాలు - 6

Share This
శ్రీరుద్రంలో విశేషాలు - 6
శ్రీరామభట్ల ఆదిత్య


 

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం,
వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహమ్।
వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం,
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్॥

ఎనిమిదివ అనువాకం:

" నమః సోమాయచ రుద్రాయచ నమః...." అనే మంత్రంతో ఈ అనువాకం ప్రారంభం అవుతుంది.  ఈ అనువాకం చాలా ప్రసిద్ధమైంది. ఇందులో మొత్తం 16 మంత్రాలున్నాయి. వీటిని నమస్కారమంత్రాలని అంటారు. ఒకవేళ రుద్రం మొత్తం చదివే అవకాశం లేనప్పుడు కేవలం అష్టమానువాకం చదివతే సరిపోతుందంటారు. 

" నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ.... "....  'నమః శివాయ' అనే పంచాక్షరి మంత్రం మొట్టమొదటిసారిగా వేదాలలో రుద్రంలోని ఈ అనువాకంలోనే వస్తుంది. ఈ అనువాకం చదవడం వల్ల శత్రునాశనం జరిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తారు.

ఉమాపతికి నమస్కారమని, దుఃఖాలను తొలగించేవాడని, త్రామ్రవర్ణంలో ఉండువాడని,  అరుణవర్ణంలో ఉండువాడని, శుభములు కలింగించువాడని, పశుపతి అని, ఉగ్రరూపుడని, శత్రుభయంకరుడని, సన్మార్గంలో నడిపించువాడని, దుష్టసంహారుడని, లయకారుడని, వృక్షస్వరూపుడని, కర్మఫలదాతయని, ఓంకారరూపుడని, శుభములు కలింగించువాడని, మోక్షము ప్రసాదించువాడని ఈ అనువాకం చెప్తుంది.

అన్నిలోకాలకూ సుఖములు కలిగించువాడని, శుభస్వరూపుడని, జలస్వరూపుడని, నదులలో ఉండువాడని, బ్రహ్మజ్ఞానులచే పొగడబడువాడని, కోరిన కోరికలు తీర్చేవాడని, పాపమనే నదిని దాటించువాడని, మోక్షమువైపుకు దారి చూపువాడని, జన్మలను కలిగించువాడని, కర్మఫలాలను అనుభవింపజేయువాడని, నదుల ప్రక్కన ఉంటే తృణ స్వరూపుడని, ఫేనము(నురుగు) తన రూపముగా కలవాడని, సైకతస్వరూపుడని, నీటిలో ఉండువాడని ఈ అనువాకం పరమేశ్వరుణ్ణి కీర్తస్తుంది. 

నమః శివాయ

( ఇంకా వుంది )

No comments:

Post a Comment

Pages