కాగితం పువ్వు - అచ్చంగా తెలుగు
 కాగితం పువ్వు!'

-సుజాత. పి.వి. ఎల్.

సైనిక్ పురి, సికిందరాబాద్.
అక్షరాలకు పూలకు పెద్ద తేడాలేదు
అక్షరాలెన్నో... పూలన్ని
వాక్యాలెన్నో... మాలలన్ని
నా పిచ్చిగాని వర్ణమాల అంటే అదేగదా!
ఎన్నెన్ని భావాలు
మరెన్ని సౌరభాలు
మనసు మనసును స్పృశిస్తాయి!
ఊహ తెలిసినప్పటి నుంచి
భావాలతోనేగా మనిషి సావాసం!
భూతకాలాన్ని మైమరపించడానికి
స్మృతిపథంలో నెలకొన్న మధుర భావపరంపరలు కొన్నైతే,
వర్తమానపు జ్ఞాపకాలుగా రూపొందడానికి
హృదయ పొరల్లో నిక్షిప్తపవుతున్నవి మరికొన్ని!
భాష ఏదైతేనేం
భావ సుగంధం లేని మనిషి జీవితం
కాగితం పువ్వుతో సమానం!

*******

No comments:

Post a Comment

Pages