ఉగాది - కవిత - అచ్చంగా తెలుగు
 ఉగాది
 
శ్రీమతి భారతీ లక్ష్మణ్

నూతన ఒరవడిని తెచ్చిన ఈ వసంతం.
నిశ్చేతన జీవితాలను తన ఒడికి చేర్చుకుని అందరికీ ఇచ్చెను ప్రశాంతం.

నిరుడు కరోనా మహమ్మారి చేసిన విలయ విజృంభణం
నేడు ఇ"క రోనా" మత్ అంటూ సర్కారు చేసెను దానితో రణం.

అందరి హృదయాలలో ఆశల పల్లవములకు
అయ్యేను పునాది.
వారి జీవితాల లో శుభ ఫలాలను తెచ్చెను శ్రీ ప్లవ నామ ఉగాది.

షడ్రుచుల సమ్మేళనం నింబకుసుమ భక్షణం.
ఈ యేడు ఇవ్వాలి అందరికీ మధురానుభూతి ని క్షణ క్షణం.

ప్రతి ఒక్కరూ కొంగ్రొత్త కళలకు చుట్టండి శ్రీకారం.
అందరి కలలను సాకారం చేస్తూ విజయ పరంపరను ఇవ్వాలి ఈ సంవత్సరం.

***

No comments:

Post a Comment

Pages