వర్ణ సందేశం - అచ్చంగా తెలుగు
'వర్ణ సందేశం..!'
-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.రాగ ద్వేషాలకతీతం
తారతమ్యాలెరగని కలివిడితనం
రంగుల కోలాహలం..
ఓ వర్ణ సందేశం..
మానవ ఐకమత్యభావ నిదర్శనం..
శ్వేతం..శాంతం,
అరుణం..ఆవేశం,
హరితం..హ్లాదనం,
పసుపు..పవిత్రం,
గులాబీ..సౌహార్ధ్రం,
నీలం..నిరుద్వేగం,
కాషాయం..త్యజనం..
మానవాళిని నిర్దేశించు జీవిత పరమార్థ ప్రామాణికం..
శశి వర్ణ విషాదం విడనాడి..
వర్ణ, వర్గ బేధాలను దునుమాడి
ఐక్యత రీతిన మెలగమని ఇచ్చే 
వర్ణాల..వర్ణనల ఆనంద సందోహమే..'హోళీ!'
****

No comments:

Post a Comment

Pages