శ్రీధర మాధురి - 82 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి - 82

Share This
శ్రీధర మాధురి - 82
(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)



అమాయకత్వం అన్న చిరునామాలో దైవం మనల్ని వదిలిపెట్టారు. మనం విజ్ఞానం పేరుతో చాలా చెత్తను పోగేసుకున్నాము. దైవం మనల్ని కనుగొనలేక ఎక్కడైతే మనల్ని వదిలి పెట్టారో అక్కడే మనకోసం వెతుకుతున్నారు.


దైవం ఈవ్ తో – నీతో ఆడుకోడానికి నీకొక మంచి అబ్బాయిని ఇస్తాను. అతను చక్కటి సౌష్టవంతో అందంగా ఉంటాడు. కొన్నిసార్లు అతను మూర్ఖంగా ఉంటాడు. కాని, అతను నీకు బాగా ఉపయోగపడతాడు. నీ పిల్లలకు తండ్రి అవుతాడు. కాని, ఇదంతా ఒక షరతుపై జరుగుతుంది.
ఈవ్ – ఏమి షరతు నా దైవమా?
దైవం – నీకంటే ముందు నాచే అతను తయారు చెయ్యబడ్డాడని అతన్ని నేను నమ్మేలా చేస్తాను.
హ హ హ.


అతను – జీవితం తేలిక కాదు.
నేను – నిజమే. జీవితం తేలిక కాకపోవచ్చు, కాని చాలా సులువు.
అతను అర్ధం కానట్లు చూస్తున్నాడు, నేను నవ్వసాగాను.
వదులుగా లేక బిగువుగా ఉండకండి, జీవితం రెండిటికీ మధ్యలో ఉంటుంది.


మీపట్ల మీరు కఠినంగా వ్యవహరించకండి. జీవితం తీవ్రంగా ఉండదు. జీవితం సరళమైనది. దాన్ని జటిలం చేసుకుని, పరిష్కారాల కోసం పరుగెత్తకండి.


నిజం మాట్లాడే వ్యక్తి, అతని జ్ఞాపకశక్తిపై ఆధారపడరు.


అతను – గురూజీ, మిష్టర్ ఎక్ష్ అవకాశవాది అయిన వ్యాపారి.
నేను నవ్వాపుకోలేకపోయాను.
అతను – ఎందుకు నవ్వుతున్నారు?
నేను – వ్యాపారం అంటేనే అది. అవకాశాన్ని అంది పుచ్చుకోవడం.


మీరు మీ ఉనికితో లేక ఆత్మతో మిమ్మల్ని మీరు గుర్తించుకోవట్లేదు కనుక, మీ బుద్ధితోనే మిమ్మల్ని గుర్తిస్తారు కనుక, మీకు నిరాశగా అనిపిస్తుంది.

***

No comments:

Post a Comment

Pages