విజయ దుర్గమ్మా! - అచ్చంగా తెలుగు

విజయ దుర్గమ్మా!

Share This
'విజయ దుర్గమ్మా ..!'
-సుజాత .పి.వి.ఎల్ అమ్మా..! దుర్గమ్మా..!
శక్తి యుక్తుల నిచ్చి. .
మమ్ము నడిపించ చ్యోదక శక్తివవు తల్లి !
తెవివి తేటలు నిచ్చి
వెలుగుబాట చూపుమమ్మా !
శాస్త్ర సాంకేతిక రంగాల్లో
మేము ప్రతిభను చూపేలా దీవించుమమ్మా !
ఇంజనీర్లమై చక్కటి ప్రాజెక్టులు కట్టాలి. .
వైద్య నారాయణులమై మరణాలను ఆపాలి. .
న్యాయశాస్త్ర కోవిదులమై అన్యాయాన్ని
అణగదొక్కాలి. .
ఉపాధ్యాయులమై అజ్ఞానాంధకారాలను
తొలగింపజేయాలి .
మహాత్ములమై ..మథర్ థెరీసాలమై
సేవానిరతిని చాటించాలి ..
రంగం ఏదైనా సాధించేతత్వo మాకివ్వు..దుష్ట శక్తులను దునుమాడ..విజయదుర్గవై కదలి వచ్చి విజేతవైన..అమ్మలగన్న అమ్మా!..మము ఎల్లవేళలా కాపాడు..మాయమ్మా!!

*****


No comments:

Post a Comment

Pages