శలభాలు - కవిత - అచ్చంగా తెలుగు
శలభాలు
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు



రెక్కలొచ్చిన పక్షులు గూళ్ళొదులుతాయి విత్తనం వేసిన తోటమాలికి పళ్లందకపోవచ్చు అవి విచక్షణ ఉన్న మానవజాతికి చెందవు నవమాసాలు మోసి, కని, కళ్ళలో పెట్టుకుని చూసిన తల్లిని తన జీ(వి)తాన్ని ఎదుగుదలకు ధారబోసిన తండ్రిని నాలుగు మంచిమాటలు, అనారోగ్యానికిన్ని మందులు...అంతేగా దూరం చేసుకుంటున్నారంటే, కసాయి మనసుకు దర్పణమేకదా! జవసత్వాలుడిగిన దశలో వాళ్ళేంకోరుకుంటారు సమస్త జీవజాతిని సమాదరించేది మానవుడేనని చెబుతామే బతుకు బతికించు అని సాటివాళ్ళ విషయంలో అనుకుంటామే దానికే గుండెని బండ చేసుకొని వృద్ధాశ్రమాల్లో చేర్చడమా మారని మనిషి జీవచ్ఛవంతో... దేవుళ్లను సైతం కంటతడి పెట్టించే కలియుగ తత్త్వం ఇది అని సరిపెట్టుకందామా మానవుడు మాధవుడయ్యేది కంటి ఎదురు దైవాలకి సేవచేసినప్పుడే జన్మ వృధాచేసుకునే శలభంతో..సమానం! ***

No comments:

Post a Comment

Pages