ఈ దారి మనసైనది - 33 - అచ్చంగా తెలుగు

 ఈ దారి మనసైనది - 33

అంగులూరి అంజనీదేవి


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్విత గతాన్ని తలచుకుని బాధపడుతూ ఉంటుంది.)

అంతలో స్టెతస్కోప్ని మన్విత ముఖానికి దగ్గరగా గాలిలో ఆడిస్తూ ... "హాలోఅన్నాడు ధీరజ్ మన లోకంలోకి రండి. ఏమిటంత పరధ్యానం అన్నట్లుగా .... 

ధీరజ్ని చూడగానే .. అసలే పెద్దవయిన ఆమెకళ్లు మరింత విచ్చుకున్నాయి. “మొన్న మీకు సారీ చెప్పాను కదా! మళ్లీ ఎందుకొచ్చారు?" అంది తల ఎగరేసి, కుడి చేతిని పైకి లేపి, ఆ చేతో సైగ కూడా చేసింది. తెల్లగా కదులుతున్న ఆ చేతిని ఒక్క క్షణం అలాగే చూశాడు ధీరజ్ అందులో అత్మ విశ్వాసం, ఆత్మాభిమానం, అహంకారం తప్ప బేలతనం లేదు. ఇలాంటి ఈ అమ్మాయి ఇలా బెడ్ మీద ఎందుకుంది?  

“నిన్న నేను డ్యూటిలోలేను. ఉదయం నేను ఓ.పి.లోవుండంగా ... కె.ఎం.సి మెడికో అమ్మాయి జనరల్ వార్డ్ లో ఉందన్నారు. మీరనుకోలేదు. ఏం జరిగిందండి? " అన్నాడు ఆమె ముఖంలోకి అత్రుతగా చూస్తూ దీరజ్ " ఏం జరిగితే ఇతనికెందుకో,చెప్పందే కదిలేలా లేడే ! " అన్నట్లు చూస్తూ ...

“కోసుకున్నా ...” అంది సింపుల్ గా .

ఉల్లిగడ్డ కోస్తుంటే తెగిందన్నంతతేలిగ్గా ఆమె చెబుతుంటే....

" మొన్న కన్పించినప్పడు బాగానే వున్నావుగా... ఇంత లోపలే..." అంటూ ఆగిపోయాడు.

" అంటే ఈ లోపల ఏం కాకూడదా?అయినా ఇవన్నీ మీకంత అవసరమా ? మీదారినమీరు వెళ్లండి ప్లేజ్ " అంది సహనాన్ని కూడదీసుకుంటూ... తను ఏదైతేమాట్లాడకూడదనుకుందో అతను అదేమాట్లాడుతుంటే బాధగా కూడా వుంది.

"ఎలా వెళ్తనండీ ! ఇవాళనా ఓ.పి. అయ్యాక డ్యూటి ఇక్కడే . నన్ను చూస్తుంటే ఆ మాత్రం బాధ్యత లేని వాడిలా అన్పిస్తున్నానా ? ఒక పిజి గా నేనా పని చెయ్యలేను.అదీ కాక ఇలా ఒంటరిగా మిమ్మల్ని ఈ బెడ్ మీద చూస్తుంటే జాలిగా కూడా వుంది" అన్నాడు సిన్సియర్గా, ఆమెను చూస్తుంటే ఏదో దాస్తున్నట్లు అన్పించి, ఏందాస్తుందోతెలిసికోవాలని వుంది.

ఈ జాలి అనే పదాన్ని డిక్షనరీలో నుండి తీసి వెయ్యాలి. ఆ పదాన్ని చిన్నప్పటి నుండి విని, విని విసుగొస్తోంది. తనికి నచ్చని పద ప్రయోగాన్ని చేసినందుకు అతనంటే కోపంగా వుంది మన్వితకి.

ఆ కోపంలో ." ఒంటరిగా వున్నామని జాలిగా వుందా? అయితే మీరు కూడా ఇక్కడోబెడ్ వేయించుకోండి! ఇదిగో ఈ పక్కన కాస్త్ర ప్లేస్ వుంది." అంది ఎమోషనల్గా మాట్లాడడంతో బాడీ కదిలి చెయ్యి నోప్పిగా అన్పించి "అబ్బా ..." అంది.

ఆ నొప్పికి భయపడి - కదలకుండా బిగుసుకుపోయి . పడుకున్న శిల్పంలా అయింది.

" ఇక్కడ బెడ్ వేయించుకునే అదృష్టం నా కొద్దులే ఏదో పేషెంట్లా బెడ్ విూద వున్నావని,వచ్చి పరామర్శించానంతే ! చూస్తుంటే ఇదేదో సూసైడ్ కేస్లాఉందే . ఎందుకు చేసుకోబోయావు? " అంటూ ఆమె చెవికి దగ్గరగా వంగి రహస్యం అడుగుతున్నట్లు అడిగాడు. 

ఉరిమి చూసిందిమన్విత, 

అప్పటికే వంగి వున్న ధీరజ్ మెల్లగా ఆమెకళ్ల వైపు చూసూ...

" అబ్బో. ఆ చూపేంటి? మరీ చిన్నపిల్లాడిని భయపెట్టినట్లు భయపెడ్తోంది. నీతోనాకెందుకులే గాని .... నన్నెప్పడుచంపుతావో చెప్ప ?" అన్నాడు సరిగ్గా లేచినిలబడుతూ.

చచ్చీ చెడి తనే సరిగ్గా చావలేకపోయింది. తనింకొకళ్లని చంపటమా ? ఇంత నీరియస్ గా చనిపోవాలని ప్రయత్నించి హాస్పిటల్లో వుంటే - ఇతనేంటి ఇంత జోవియల్గా, ఎంతో కాలంగా పరిచయమున్న వ్యక్తిలా మాట్లాడుతున్నాడు ? 

ఆలోచనగా వున్న మన్విత వైపు ఒక్క క్షణం దీక్షగా చూశాడు ధీరజ్ ... మనిషి చూడబోతే బాగుంది. పైగా కాబోయేడాక్టరు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది?. 

" ఓ.కె. రెస్ట్ తీసుకో . తర్వాత కలుస్తా " అంటూ అక్కడి నుండి కదిలాడు.

(సశేషం)


No comments:

Post a Comment

Pages