'నిజమైన దీపావళి...!' - అచ్చంగా తెలుగు

'నిజమైన దీపావళి...!'

Share This
నిజమైన దీపావళి..!'
-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి,సికిందరాబాద్.
అన్ని రూపాల్లో నీవే కదమ్మా!..
మరి, ఆ (మగ) మనసుల్లో 
విష భీజాలెలానాటుకుంటున్నాయి తల్లీ?!..
సృష్టి సమస్తానికి జన్మనిచ్చే మాతృమూర్తి 
అన్న ఆరాధనా భావాన్ని అడుగంటిస్తూ..
'యత్ర నార్యస్తు పూజ్యంతే!' 
అన్న సంస్కృతి నానుడిని భ్రష్టు పట్టిస్తూ.. 
పసిపిల్ల నుంచి పండు ముదుసలి దాకా 
ఎవరు కనిపించినా రిమ్మతెగలు పుట్టే 
మ(మృ)గాడి జాతికి జన్మనెలా నిచ్చావమ్మా!?..
అవునులే పిల్లలను కంటావుగాని..
వాళ్ళు మదోన్మత్తులు, రాక్షస మనస్కులు అవుతారని 
ఎలా అనుకుంటావు..?
చట్టాలు..న్యాయాలు కంచె కట్టలేకపోతున్నాయి..
జనారణ్యంలో మృగాళ్ళు ఒళ్ళు విరుచుకుంటున్నారు..
నాడు నరకాసురుడిని వధించి..
అందరి జీవితాల్లో వెలుగులు నింపి.. 
చెడుపై మంచి సాధించి 
నీ పేరుని సార్థకం చేసుకున్నావు..
నేడు సమయం ఆసన్నమయింది..కదలిరా..
ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలను అరికట్టేందుకు 
నీ పదునైన బాణాన్ని సంధించు..
అసుర సంహరణలో
అబలలందరూ మరో 'సత్యభామలే!' 
అని నిరూపించిన నాడే..నిజమైన దీపావళి..!
***

No comments:

Post a Comment

Pages