నెత్తుటి పువ్వు - 26 - అచ్చంగా తెలుగు

 నెత్తుటి పువ్వు - 26

మహీధర శేషారత్నం


(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు. ) 

రోజా ముఖం వాడినట్లయిపోయింది. రాజుకి జాలేసింది. ఈ మనిషికి నేను తప్ప ఎవరున్నారు? అనుకున్నాడు.

          “రా! ఇలా కూర్చో...” అనునయంగా పిలిచాడు.

          రోజా రాలేదు. ఈసారి గట్టిగా పిలిచాడు.

          నిన్నే రా! ఈసారి గట్టిగా పిలిచాడు.

          పలకలేదు.

          “కోపానికి తక్కువేం లేదు.”

          నాకు కోపమెందుకు? నన్ను పిలిచే అధికారం నీకెవరిచ్చారు? విసురుగా అంది.

          “నీమీద నాకు అధికారమొకరిచ్చేదేమిటి? నాకే ఉంది?...” చిన్నగా నవ్వాడు.

          “నామీద నీకు అధికారముంటే నీమీద నాకుండదేమిటి?” కళ్ళెగరేస్తూ అడిగింది.

          “అమ్మో! అమాయికంగా కనిపిస్తావు కానీ, గడుసుదానివే నవ్వాడు.

          మెల్లిగా వచ్చి పక్కలోకూచుంది.

          “అలా ఎప్పుడు అనమాక. నా కెవరూలేరు నువ్వు తప్ప...”

          భుజం మీద తల ఆన్చింది.

          “విసుగ్గా ఉండి రాగానే అలా అడిగితే విసుక్కున్నాను. మరి నాకు ఇల్లు. ఆఫీసు.. ఖాళీ ఎక్కడ చెప్పు? భుజాల చుట్టూ చేతులేస్తూ అన్నాడు.

          “మరే! నేను నీకు మూడో పెళ్ళాన్నికదూ!” మూతి తిప్పుతూ అంది.

          “మూడో పెళ్ళమా? ఇప్పటికే ఇరుక్కుపోయాను. ఇంకొకళ్ళెవరు?” గాబరాగా అన్నాడు.

          “నీ పెళ్ళాం మొదటిది, ఉద్యోగం రెండవది. నేను మూడోదాన్ని మొదటి రెండూ వదల్లేవు. మరినన్నేగా...” కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

          “ఛ! అదేం కాదు, నిన్న శివరాత్రి కదా! ఆ రికార్డింగు డాన్సులవీ చూస్తే బాధేసింది... నిన్ను తీసుకురావడం.... నేను తప్పు చేయడం... మనస్సు చికాగ్గా ఉండి విసుక్కున్నాను” నిట్టూర్చాడు.

          “ఛట్ అస్తమానం అదేపాటా, నువ్వు తప్పు చేయలేదు. నీకు తప్పు చేయడం కూడా చాతవుతుంది. నేను చేసాను. నీచేత చేయించాను. సరేనా! తలపట్టనా?” దగ్గరగా జరుగుతూ అంది.

          “ఓయ్ పిల్లా! కాస్త దూరం జరుగు” అంటూ నవ్వుతూనే ఎముకలు విరిగేట్టు కౌగిలించుకున్నాడు.    

“అదీ! ఇప్పుడు నా రాజు బాబులా ఉన్నావు.”

          “నువ్వు ఐదారేళ్ళ కింద నాకు తగిళ్తే బావుండేది. ఈ బాధ లేకుండా నిన్నే పెళ్లి చేసుకునే వాడిని. నుదురు ముద్దాడుతూ అన్నాడు.

“ఛట్! ఎప్పుడూ ఇదే గోల. ఉంటే నాకుండాలి బాధ. నీ గోలేంటి బాబు. నేను నీ పెళ్ళాన్నే. నువ్వు నా మొగుడివే.

          అలా ఉండి ఎంతో సేపటికి విడివడింది.

          తలనొప్పన్నావు. పాలున్నాయి. మళ్ళీ టీ పెట్టనా? తల నిమురుతూ అడిగింది.

          నువ్వు పక్కనుంటే అన్నీ పారిపోతాయి. నాకా రికార్డింగు డాన్సులు చూస్తే బాధేస్తుంది. అదేమిటో అందరూ ఎంజాయి చేస్తారు. నేను తప్ప... శరీరంలో ఆ రెండు పార్టులు తప్ప ఇంకేం లేనట్టు చూపించు, చూపించు అని వీళ్ళ గోల, వాళ్ళు నిర్లజ్జగా అన్నీ చూపించడం, ఏకాంతంలో ఆడ మగ ఒకరి స్పర్శ నొకరు కోరుకుంటూ ఆస్వాదిస్తూ, ఆ ఆనందం, ఆ సంతోషం.. ఇది సృష్టించ గలిగే గొప్ప శక్తి స్థానం అని కాక ఏదో ఒక బూతు ఒక ఆనందం. అన్నట్టు నాకు నచ్చదు రోజా!” ... రోజాను సరిగ్గా జరిపి ఆవిడ ఒళ్ళో తల పెట్టుకు పడుకుంటూ కాళ్ళు చాచుకు పడుకున్నాడు.

          సరోజ చిన్న బుచ్చుకుంది.

          “అందరూ అలా చెయ్యరు. గ్రూపులో ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళకి కొంచెం డబ్బు ఎక్కువ ఇస్తారు. అందంగా ఉండరు ఆడవాళ్ళయితే చాలు, అవయవాలు ఉంటే చాలు అని ఏదో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే డాన్సు కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటాయి. ఎవడో ఒక ముసలాడు కూడా తాగి స్టెప్పులేస్తూ ఉంటాడు. వీళ్ళు చూస్తూ ఉంటారు. అది కొంచెం లోక్లాసుగా ఉంటుంది. ఎక్కువ డబ్బు ఇస్తారు వాళ్ళకి. ఇంటి అవసరాలుండి తల్లిదండ్రులు అక్క చెల్లెలు బాధ్యతలు ఉన్నవాళ్ళు ఇలా చెయ్యడానికి సిద్ధపడతారు. నువ్వు బాధపడినట్టు వాళు ఏ బాధపడరు. ఇందులో పదహారు, పదిహేడేళ్ళ ఆడపిల్లలే కాదు, ముఫ్ఫై నలభై ఏళ్ళ ఆంటీలు కూడా ఉంటారు. కొన్నిచోట్ల వాళ్ళ మొగుళ్ళు కూడా ఈ గ్రూపుల్లోనే ఉంటారు. మొదట్లో కొంచెం అనిపించినా తరువాత దొంగ నాబట్టలు... చూడ్డానికి ఎగబడతారు. చూడనీ, మాంసం ముద్దలాంటి ఒళ్ళు చూస్తే ఏంపోతుంది. దగ్గరకు రానివ్వరుగా... చూడ్డానికే పడిచస్తారు. అని అలవాటు పడతారు. నీకో సంగతి తెలుసా! న్యూడ్ డాన్సులు చేసేటప్పుడు తెలిసిన ప్రదేశంలో చెయ్యరు. ఇంకో రాష్ట్రానికి వెళ్ళి చేస్తారు. శరీరానికి భాషేముంటుంది. ఆ రాష్ట్రం వాళ్ళిక్కడ, ఈ రాష్ట్రం వాళ్ళక్కడ. మా గ్రూపులీడరు మా అమ్మమీద జాలితో, మా అమ్మకి పోయేముందు ఇచ్చిన మాటతో అలా నన్ను ఎప్పుడూ చెయ్యమన్లేదు. లంగా, ఓణీలలో పండగలకి పబ్బాలకి చేసేదాన్ని నాకెవరూ లేరుగా. తిండి బట్ట ఉంటే చాలు. అదే ఇచ్చేది. నా అవసరాలు తీరిపోయేవి. అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి ఇలాంటివి. మళ్ళీ మాట్లాడితే అన్నిదేశాల్లోనూ ఉంటాయిట ఆడదంటే శరీరం... కసిగా అంది సరోజ.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages