జోక్స్ - అచ్చంగా తెలుగు
జోక్స్ 
తురగా శివరామవేంకటేశ్వర్లు



1. భార్య : ఏమండీ మీరువండిన ఈ ముద్ద  పప్పు కమ్మగా ఉండాలిగానీ పుల్లగా కుంచెం తియ్యగా ఉందేమిటండీ . అడిగింది భర్తని. 
భర్త : నీ మొహం ! అది ముద్దపప్పని ఎవరు చెప్పారు ? అది పప్పు పులుసు . కుంచెం నీళ్ళు తక్కువయ్యాయి అంతే .
భార్య : ఈకరోనా కాలంలో ఇంట్లో కూర్చుని చేసిన వంట చాలుగాని రేపటినుంచి గదులు యూడవండి .

2. భార్య : ఏమండి మన వీధి చివరిలో ఉన్న కరోనా జోళ్ల షాపు ఉద్యోగికి  కరోనా పాజిటివ్ వచ్చిందిట పాపం.
భర్త.: అందుకేకదే నేను బాటా జోళ్ల షాపులో పనిచేస్తున్నాతెలివిగా . అన్నాడు.
అవునా! అంది భార్య అమాయకంగా.

3.భర్త భార్యతో : నిన్నటి మందారాలు  ఇల్లా పట్టుకురా. అన్నాడు .భార్య దేవుడు పటం మీద నిన్న పెట్టిన నాలుగు మందారపూలు తీసి ప్లేట్ లో పెట్టి భర్త కిస్తూ నవ్వుతూ  అడిగింది, "ఎందుకండీ  ఇవి? మీకు తెలివితేటలు, జుట్టు రావడానికి ఏదైనా నూనె చేస్తారా వీటితో" అని.
భర్త వెంటనే "ఏమిటావాగుడు ?అంటే ఆ రెండు నాకు లేవనా  నీ  ఉద్దేశ్యం. అయినా నేను చెప్పిందేమిటి ? నువ్వు తెచ్చిందేమిటి ? మందారపువ్వులు కాదు .నేను చెప్పింది. నిన్న సగం చదివి ఆ గదిలో పెట్టిన 'నిన్నటిమందారాలు ' నవల. చెప్పింది అర్ధం చేసుకునే తెలివి నీకు ఎప్పుడొస్తుందో !" అన్నాడు. "మీకు చెప్పే తెలివి వచ్చినప్పుడు" అంది భార్య వెంటనే.

4.
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన భర్త , భార్య అదోలా ఉండడం చూసి" ఏమయంది?" అని అడిగాడు.
  "ఏ మిటో నండి పొద్దుట నుంచి ఇంట్లో అన్నీ పారపోయడంతో సరిపోయింది. అంది భార్య. అంటే? అన్నాడు. "ఏముంది . స్టౌ నుంచి పాలు దింపుతుంటే చేయి జారీ నేను పాలు ఒలకపోసాను. అబ్బాయి బజారు నుంచి నూని సీసా తెచ్చి  లోపల పెడుతుంటే అది కింద పడి, నూని ఒలికి పోయింది. అమ్మాయి అటుకులు పొట్లం ఇప్పుతుంటే అది చిరిగిపోయి అటుకులన్నీ ఒలికిపోయాయి. కోడలు వరిపిండి డబ్బాలో పోస్తూ  ఏదో పాడుకుంటూ సగం క్రింద ఒలకపొసింది" చెప్పింది భార్య." అయితే అన్నీ మీరే పారపోసి చివరికి  నాకు పారపోయడానికి ఏమీ లేకుండా చేశారన్నమాట" అన్నాడు కోపం నటిస్తూ భర్త. " ఎందుకండీ అంత  మాటంటారు ? మేము ఒలకపోసినవి అన్నీ ఆడబ్బా లోకి ఎత్తి  ఉంచాం. డబ్బా పట్టుకెళ్లి వాటిని వీధిలో పారపోసి రండి" అంది భార్య నవ్వుతూ .

***

No comments:

Post a Comment

Pages