కోవిడ్యుక్త ధర్మం - అచ్చంగా తెలుగు
కోవిడ్యుక్త ధర్మం 
డా. మూర్తి జొన్నలగెడ్డ
సౌత్ పోర్ట్, యునైటెడ్ కింగ్డమ్ఊరు కాని ఊరు లోన
అపరిచితుల సేవలోన
అద్వితీయ తెలుగు సేన
ఆక్రందపు అంతరాన

అదురు బెదురు లేక నేను
అదను చూచి పలికినాను
కోవిడుకో వేడికోలు
నువ్వెళ్లిక వీడుకోలు

లేకుంటేమరి సవాలు
నీకుండదు ఆనవాలు
నువ్వొచ్చింది ఎట్నుంచైనా 
నిన్నధోగతి పట్టించైనా!

దూర దూరముగ తొలగి నిలిచి
చేతులెన్నడు కడిగి కడిగి
మూతులెన్నడు తొడుగు తొడిగి
అలుపు సొలుపు మాట మరచి

మా సేన లెల్లరు సర్వ సిధ్ధం
దుర్బల నిర్బల వయో వృధ్దుల
దీర్ఘ వ్యాధీ బాధా గ్రస్థుల
మట్టు పెట్టుట అధర్మ యుధ్ధం 

నీ గెలుపు నాకు వీర స్వర్గం
నే గెల్చి చూపెద నీకు నరకం
విజయమో వీర స్వర్గమో
వైరస్సో మరి వేరు కష్టమో

గెలిచి నిల్చిన భావి పర్వం
తోక ముడిచిన కాల గర్భం
ఓ వైరీ నీకిది నమస్కార బాణం
నే గెల్చెద నా జనుల ప్రాణం

***

No comments:

Post a Comment

Pages